Padmanabhaswamy Temple | ఆలయ ఉత్సవం.. ఐదు గంటలపాటూ విమాన రాకపోకలు నిలిపివేత
Padmanabhaswamy Temple | కేరళ (Keralam) రాష్ట్రంలో అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో (Thiruvananthapuram international airport) విమాన రాకపోకలు కొన్ని గంటల పాటూ నిలిచిపోయాయి.
Padmanabhaswamy Temple | కేరళ (Keralam) రాష్ట్రంలో అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో (Thiruvananthapuram international airport) విమాన రాకపోకలు కొన్ని గంటల పాటూ నిలిచిపోయాయి. ప్రపంచంలోనే అత్యంత సంపద కలిగిన ఆలయంగా పేరుగాంచిన శ్రీ అనంత పద్మనాభ స్వామి (Sree Padmanabha Swamy Temple) ఊరేగింపు సందర్భంగా రన్‌వేని అధికారులు మూసివేశారు. ఫలితంగా విమాన రాకపోకలు దాదాపు ఐదు గంటల పాటూ నిలిచిపోయాయి. కాగా, ఏటా రెండు సార్లు ఇలానే జరుగుతుంది.
శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో 'పైంగుని అరాట్టు' (Painkuni Arattu) అనే ఉత్సవం జరుగుతుంది. ఏటా రెండు సార్లు ఏప్రిల్, అక్టోబర్ మాసాల్లో నిర్వహిస్తారు. ఆ సమయంలో శ్రీ పద్మనాభ స్వామి ఆలయం నుంచి శంకుముఖం బీచ్‌వైపు ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ ఊరేగింపు తిరువనంతపురం ఎయిర్‌పోర్టు మీదుగా సాగుతుంది. అందుకే ఊరేగింపుకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ఆ సమయంలో విమాన రాకపోకలను అధికారులు నిలిపివేస్తారు. నిన్న కూడా సాయంత్రం 4:45 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు అంటే సుమారు ఐదు గంటలపాటూ విమాన సేవలు నిలిచిపోయాయి.

కాగా, ఈ విమానాశ్రయాన్ని రాజా బలరామవర్మ పాలనాకాలంలో 1932లో నిర్మించారు. అంతకు ముందు నుంచే ఈ మార్గం నుంచే యాత్ర వెళుతుండేది. అనంతపద్మనాభ దాసులుగా ఖ్యాతి చెందిన రాజవంశం ఆ ఆనవాయితీని గౌరవిస్తూ ఏటా రెండు సార్లు జరిగే ఈ ఉత్సవం విమానాశ్రయం మీదుగా వెళ్లేందుకు అనుమతులిచ్చారు. ఇప్పటికీ ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఊరేగింపు సందర్భంగా విమానాశ్రయ అధికారులు ముందుగానే ఈ నిలిపివేతను అన్ని విమానయాన సంస్థలతో పాటు ఎయిర్ ట్రాఫిక్‌కు సమాచారమిస్తారు. దీంతో అన్ని విమానాలు తమ రాకపోకలను రీషెడ్యూల్ చేసుకుంటాయి.

ఈ ఊరేగింపులో ఆలయ ఏనుగులతో పాటు పురోహితులు, ట్రావెన్కూర్ రాజ కుటుంబీకులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. వీరికి ముందుగానే విమానాశ్రయవర్గాలు పాస్‌లు జారీ చేస్తాయి. సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది నిశితంగా పరిశీలించిన అనంతరం వారిని అనుమతిస్తారు. గరుడ వాహనాన్ని అధిష్టించిన శ్రీ అనంత పద్మనాభ స్వామి భక్తులందరిపై కరుణ కురిపిస్తూ బీచ్‌కు వెళ్తారు. అనంతరం అదే మార్గంలో తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ఈ క్రమంలోనే ఈ ఉత్సవం కోసం ఐదుగంటల పాలు అన్ని విమాన రాకపోకలను నిలిపివేస్తారు. ఇలా ఏటా రెండుసార్లు జరుగుతుంది. నిన్న జరిగిన ఊరేగింపుకు సంబంధించిన ఫొటోలను తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్ అధికారులు ఎక్స్ వేదికగా షేర్ చేశారు.





#WATCH | Thiruvananthapuram, Kerala: The Painkuni Arattu procession of the Sree Padmanabhaswamy Temple in Thiruvananthapuram was held on 2nd April, marking the conclusion of the 10-day annual Painkuni Festival, which began on March 24. pic.twitter.com/rXtwzAfhZJ
— ANI (@ANI) April 2, 2026
Also Read..
విమానాల్లో 60 శాతం ఉచిత సీట్ల ఉత్తర్వులను నిలిపివేసిన కేంద్రం
మౌనమే.. కానీ, ఓటమి కాదు.. ఆప్‌ను ఉద్దేశించి రాఘవ్ చద్ధా ఆసక్తికర వీడియో
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






