త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Monsoon | తీపిక‌బురు చెప్పిన ఐఎండీ.. నైరుతి వ‌చ్చేస్తోంది..!

Monsoon | తీవ్ర ఎండలతో జ‌నం అల్లాడుతున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ శుభ‌వార్త చెప్పింది. రుతుపవనాల ప్ర‌వేశంపై కీలక అప్‌డేట్ ఇచ్చింది. వచ్చే 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్–నికోబార్ దీవులను తాకే అవకాశముందని అంచ‌నా వేసింది.

P

National | Published On May 14, 2026, 5.59 pm IST

Monsoon | తీపిక‌బురు చెప్పిన ఐఎండీ.. నైరుతి వ‌చ్చేస్తోంది..!
Advertisement

Monsoon | తీవ్ర ఎండలతో జ‌నం అల్లాడుతున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ శుభ‌వార్త చెప్పింది. రుతుపవనాల ప్ర‌వేశంపై కీలక అప్‌డేట్ ఇచ్చింది. వచ్చే 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్–నికోబార్ దీవులను తాకే అవకాశముందని అంచ‌నా వేసింది. ప్రస్తుతం దక్షిణ బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయని, సముద్ర మట్టానికి సుమారు 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు తుపాను వలయం విస్త‌రించింద‌ని, రాబోయే రెండు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

మరోవైపు, ఎండల తీవ్రత ఈసారి సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతోంది. కొన్ని ప్రాంతాల్లో మధ్య మధ్యలో అకాల వర్షాలు కురుస్తున్నా.. వెంటనే ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతుండ‌డంతో జ‌నం ఇబ్బందులుప‌డుతున్నారు. ఓ వైపు ఎండ‌లు, మ‌రో వైపు ఆక‌స్మిక వాన‌ల‌తో జ‌నం ఇబ్బందిప‌డుతున్నార‌న్నారు. ఈ అస్థిర వాతావరణ పరిస్థితుల మధ్యే రుతుపవనాల కదలికలు ప్రారంభమవుతున్నాయని ఐఎండీ వివరించింది. మే 16 నాటికి నైరుతి రుతుపవనాలు అండమాన్–నికోబార్ ప్రాంతానికి చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. అదే సమయంలో ఈ నెల 19 వరకు అండమాన్–నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా ఈ కాలంలోనే రుతుపవనాల తొలి సంకేతాలు కనిపిస్తాయని వాతావ‌ర‌ణ‌శాఖ అధికారులు తెలిపారు.

నైరుతి రుతుపవనాల సాధారణ ప్రయాణాన్ని కూడా ఐఎండీ ప్రస్తావించింది. సాధారణంగా మే 15 ప్రాంతంలో నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే రుతుపవనాలు, మే 20 నాటికి అండమాన్ సముద్రం మొత్తం విస్తరిస్తాయి. ఈ ఏడాది కూడా ఆ సహజ క్రమానికి పెద్దగా విరుద్ధంగా కనిపించడం లేదని పేర్కొంది. అయితే గత ఏడాది పరిస్థితులు భిన్నంగా ఉండగా.. మే 13 నాటికే రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం వరకు ముందుగానే చేరిన విషయం తెలిసిందే. ఇక దీర్ఘకాలిక అంచనాల్లో భాగంగా నైరుతి రుతుపవనాల సీజన్ (జూన్–సెప్టెంబర్)లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని గ‌తంలో అంచ‌నా వేసింది.

Advertisement
Advertisement