త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌లు.. మార్కెట్ల‌లో అనిశ్చితి..

Gold And Silver Prices Today | ప‌శ్చిమాసియా యుద్ధం కార‌ణంగా అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుండ‌గా బంగారం, వెండి ధ‌ర‌ల్లో మాత్రం అనిశ్చితి కొన‌సాగుతోంది. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకో ప్ర‌క‌ట‌న చేస్తుండ‌డంతో ఈక్విటీ మార్కెట్లు ఒక‌టి రెండు రోజులు లాభాల్లో కొన‌సాగి య‌థావిధిగా న‌ష్టాల్లో ఉంటున్నాయి.

S

Business | Published On Apr 3, 2026, 11.32 am IST

Gold And Silver Prices Today | భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌లు.. మార్కెట్ల‌లో అనిశ్చితి..
Advertisement

Gold And Silver Prices Today | ప‌శ్చిమాసియా యుద్ధం కార‌ణంగా అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుండ‌గా బంగారం, వెండి ధ‌ర‌ల్లో మాత్రం అనిశ్చితి కొన‌సాగుతోంది. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకో ప్ర‌క‌ట‌న చేస్తుండ‌డంతో ఈక్విటీ మార్కెట్లు ఒక‌టి రెండు రోజులు లాభాల్లో కొన‌సాగి య‌థావిధిగా న‌ష్టాల్లో ఉంటున్నాయి. క‌మోడిటీ మార్కెట్లు సైతం అలాగే ఉన్నాయి. యుద్ధం వ‌ల్ల సాధార‌ణంగా బంగారం, వెండి ధ‌ర‌లు పెరుగుతాయి. కానీ యుద్ధం మొద‌ల‌య్యే నాటికే ఈ లోహాల ధ‌ర‌లు ఆల్ టైం గ‌రిష్టాల‌ను తాకాయి. అందువ‌ల్ల అంత ఎక్కువ ధ‌ర‌ల‌కు ఈ లోహాల‌పై పెట్టుబ‌డులు పెట్టేందుకు వినియోగ‌దారులు ఆస‌క్తిని చూపించ‌డం లేదు. దీంతో ఈ మార్కెట్ల‌లో అనిశ్చితి నెల‌కొంది. ఇక శుక్ర‌వారం గుడ్ ఫ్రైడే వ‌ల్ల అంత‌ర్జాతీయంగా అన్ని మార్కెట్ల‌కు సెల‌వు కాగా గురువారం రాత్రి ఎంసీఎక్స్ లో ముగిసిన సెష‌న్ ప్ర‌కారం బంగారం, వెండి ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టులు త‌గ్గాయి. గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 4,028 పాయింట్లు (2.62 శాతం) ప‌త‌న‌మై 1,49,680 వ‌ద్ద ముగియ‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 11,006 పాయింట్లు (4.52 శాతం) త‌గ్గి 2,32,495 వ‌ద్ద ముగిసింది. అయితే శుక్ర‌వారం దేశీయ స్పాట్ మార్కెట్‌లో మాత్రం బంగారం ధ‌ర‌లు భారీగా పెర‌గ్గా, వెండి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.15,093 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,20,744గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,50,930గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.15,09,300 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.19,600 పెరిగింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.13,835 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,10,680గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,38,350 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.13,83,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.18వేలు పెరిగింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,320 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.90,560గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,13,200 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,32,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.14,700 పెరిగింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,50,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,500గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఈ ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,55,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,550గా ఉంది.

Advertisement
Advertisement