Rajasthan Refinery | ప్రారంభానికి 24 గంటల ముందు.. రాజస్థాన్ పెట్రోల్ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం
Rajasthan Refinery | రాజస్థాన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బాలోత్ర (Balotra)లోని పచ్‌పద్ర (Pachpadra)లో గల పెట్రోల్ రిఫైనరీ (Rajasthan Refinery)లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
Rajasthan Refinery | రాజస్థాన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బాలోత్ర (Balotra)లోని పచ్‌పద్ర (Pachpadra)లో గల పెట్రోల్ రిఫైనరీ (Rajasthan Refinery)లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నికీలలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతాన్ని దట్టంగా పొగ కమ్మేసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాగా, ఈ రిఫైనరీని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించాల్సి ఉంది. ప్రారంభానికి 24 గంటల ముందు అగ్నిప్రమాదం సంభవించడం గమనార్హం.
ఇది దేశంలోని మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్. హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, రాజస్థాన్ ప్రభుత్వం భాగస్వామ్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, దేశీయ ఉత్పత్తి సామర్థ్యాలను పెంచడం ద్వారా దేశంలో ఇంధన భద్రతను బలోపేతం చేయడంలో ఈ రిఫైనరీ కీలక పాత్ర పోషిస్తుంది.
ఈ రిఫైనరీకి సెప్టెంబర్ 22, 2013 అశోక్ గహ్లోట్ నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ శంకుస్థాపన చేశారు. రూ. 37,230 కోట్ల అంచనా వ్యయంతో దీని నిర్మాణం చేపట్టారు. అయితే, ఆ తర్వాత రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2018, జనవరి 16న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ ప్రాజెక్టును మళ్లీ ప్రారంభించారు. అప్పుడు దీని నిర్మాణానికి సంబంధించిన అంచనా వ్యయాన్ని రూ. 43,129 కోట్లకు సవరించారు.
#WATCH | Rajasthan: Fire broke out at Refinery-cum-Petrochemical Complex at Pachpadra in Balotra. Firefighters have arrived at the refinery to control the fire. More details awaited. pic.twitter.com/q7ztFGVbAA
— ANI (@ANI) April 20, 2026
Also Read..
విదేశీ మార్కెట్ల వైపు పెట్టుబడిదారుల చూపులు.. భారీగా రాబడులు వస్తుండడమే కారణం..
గచ్చిబౌలిలో అగ్నికీలలు.. 18 బైక్‌లు దగ్ధం
లండన్‌లో అంబేద్కర్ ఇల్లును సందర్శించిన మాజీ ఎంపీ సంతోష్ కుమార్
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






