Fire Accident | గచ్చిబౌలిలో అగ్నికీలలు.. 18 బైక్‌లు దగ్ధం
Fire Accident | సైబరాబాద్ పరిధిలోని గచ్చిబౌలిలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ వైపు మండుటెండలు భగ్గుమంటుంటే.. మరోవైపు టీఎన్జీవోస్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్ సెల్లార్లో మంటలు చెలరేగాయి.
Fire Accident | త్రినేత్ర.న్యూస్ : సైబరాబాద్ పరిధిలోని గచ్చిబౌలిలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ వైపు మండుటెండలు భగ్గుమంటుంటే.. మరోవైపు టీఎన్జీవోస్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్ సెల్లార్లో మంటలు చెలరేగాయి. దీంతో సెల్లార్లో పార్కు చేసిన 18 బైక్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
అప్రమత్తమైన అపార్ట్మెంట్ సిబ్బంది.. తక్షణమే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించింది. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కలిసి మంటలను అదుపు చేశారు. అయితే అగ్నిప్రమాదం నేపథ్యంలో సెల్లార్లో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నికీలలు ఎగిసిపడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
గచ్చిబౌలిలోని టీఎన్జివో కాలనీలో అగ్నిప్రమాదం
అపార్ట్మెంట్ సెల్లార్లో చెలరేగిన మంటలు
సెల్లార్లో పార్క్ చేసిన 10కి పైగా వాహనాలకు అంటుకున్న మంటలు.. మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
దట్టమైన పొగకారణంగా ఇద్దరికి అస్వస్థత
షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు… pic.twitter.com/f6N7p2PL0q
— Telugu Scribe (@TeluguScribe) April 20, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు





