Santosh Kumar | లండన్‌లో అంబేద్కర్ ఇల్లును సందర్శించిన మాజీ ఎంపీ సంతోష్ కుమార్
Santosh Kumar | భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తన విద్యార్థి రోజుల్లో లండన్‌లో నివసించిన ఇంటిని రాజ్యసభ మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ తెలంగాణ ఎన్నారైలతో కలిసి సందర్శించారు.
Santosh Kumar | త్రినేత్ర.న్యూస్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తన విద్యార్థి రోజుల్లో లండన్‌లో నివసించిన ఇంటిని రాజ్యసభ మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ తెలంగాణ ఎన్నారైలతో కలిసి సందర్శించారు. ఇదొక చారిత్రక చిహ్నమని, ఎందుకంటే ఇది ఓ భవనం మాత్రమే కాదు, ఆయన వారసత్వాన్ని తెలుసుకునేందుకు అర్థవంతంగా ఉందని తెలిపారు. భవనం మొత్తం కలియతిరిగి పరిశీలించినప్పుడు.. అంబేద్కర్ దార్శనికత, ఆయన అంకితభావం గుర్తుకు వచ్చిందన్నారు. ఎంతో స్ఫూర్తిదాయకమైన చరిత్రకు ఈ భవనం సాక్ష్యంగా నిలవడం గౌరవంగా ఉందని సంతోష్ కుమార్ పేర్కొన్నారు.

అంబేద్కర్ ఇంటిని సందర్శించిన నేపథ్యంలో ఆయన విగ్రహానికి సంతోష్ కుమార్ నివాళులర్పించారు. ఆయన ఇండియాకు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఇక ఇల్లు సందర్శనలో భాగంగా అక్కడున్న నిర్వాహకులు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా వివరించారు.

అంబేద్కర్ ఇంటిని గ్రీన్ ఇండియా చాలెంజ్ సహ వ్యవస్థాపకుడు సంజీవల్ల రాఘవేందర్, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ అనిల్ కుర్మాచలంతో కలిసి సంతోష్ కుమార్ సందర్శించారు.

భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విద్యార్థిగా ఉన్నప్పుడు లండన్ ఉత్తర ప్రాంతంలోని కింగ్ హెన్రీ రోడ్డులో బస చేసిన ఇల్లు ఇది. 1921-22 సంవత్సరాల మధ్య అంబేద్కర్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుతున్న సమయంలో ఈ భవనంలో నివసించినట్లు ఆ భవనంపై ఉన్న నీలి రంగు ఫలకంపై ఉంది.

Visited the iconic Dr. B. R. Ambedkar House in London with my friends! 🇮🇳 A truly meaningful experience reflecting on Babasaheb’s legacy and global impact. Walking through his home reminds us of his vision and dedication. Honored to witness such inspiring history! 🙏@Anil_trs… pic.twitter.com/VbPfcaT1ft
— Santosh Kumar J (@SantoshKumarBRS) April 20, 2026
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



