SUV On Rooftop | చోరీ భయం.. కారును ఇంటిపైకప్పుపై పార్క్ చేసిన యజమాని
SUV On Rooftop | బీహార్‌కు చెందిన ఓ వ్యక్తి చేసిన పని అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమైన అతను.. తన కారును చోరీ భయంతో ఏకంగా ఇంటి పైకప్పుపైకి ఎక్కించేశాడు (SUV On Rooftop). ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
SUV On Rooftop | త్రినేత్ర.న్యూస్ : మనం సాధారణంగా కొన్ని రోజులపాటూ ఎక్కడికైనా వెళ్తే ఇంటికి భద్రంగా తాళాలు వేస్తాం. వాహనాలను ఇంటి ఆవరణలో ఉంచడం లేదా పెయిడ్ పార్కింగ్ స్థలంలోనో, బంధువులకు అప్పగించడమో చేస్తుంటాం. అయితే, ఓ యజమాని విదేశాలకు వెళ్తూ.. చోరీ భయంతో తన కారును ఏకంగా ఇంటి పైకప్పుపై పార్క్ చేయడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.
బీహార్‌కు (Bihar) చెందిన ఓ వ్యక్తి ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అయితే, తన మహీంద్రా స్కార్పియో కారును ఎక్కడ ఉంచాలన్నది..? ఆయన మదిలో మెదిలిన ప్రశ్న. బంధువుల వద్ద, పెయిడ్ పార్కింగ్ స్థలంలో ఉండచం సేఫ్ కాదని భావించాడు. అందుకు ప్రత్యామ్నాయ మార్గంగా వినూత్న ఆలోచన చేశాడు. కారును ఏకంగా క్రేన్ సాయంతో ఇంటిపైకప్పు ఎక్కించేశాడు (SUV On Rooftop). ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదేం ఆలోచన అంటూ దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
నిపుణుల హెచ్చరికలు..
అయితే, వాహనాన్ని ఇలా ఇంటిపైకప్పుపైకి ఎక్కించడం వల్ల అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఒక ఎస్‌యూవీ కారు చాలా బరువుగా ఉంటుంది. సాధారణ నివాస భవనాల పైకప్పులను ఇంతటి భారీ బరువును మోసేలా డిజైన్ చేయరు. భవన నిర్మాణం దెబ్బతినడమే కాకుండా, ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా, ఎండకు ఎండి, వానకు నానడం వల్ల కారు పాడైపోయే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
క్రేన్‌తో పైకి ఎత్తే సమయంలో నైపుణ్యం కలిగిన ఆపరేటర్లు, సరైన లిఫ్టింగ్ పాయింట్లు, కింది భాగంలో తగిన భద్రతా చర్యలు అవసరమని పేర్కొంటున్నారు. అదే సమయంలో మళ్లీ కారును కిందకు దించేటప్పుడు కూడా అనేక ఇబ్బందులు తలెత్తొచ్చని హెచ్చరిస్తున్నారు. అందుకే వాహనాలను వదిలి వెళ్లాల్సి వస్తే ఇలాంటి ప్రమాదకర పద్ధతులు కాకుండా.. సురక్షితమైన కవర్డ్ పార్కింగ్, కేర్‌టేకర్, వీల్ లాక్స్, జీపీఎస్ ట్రాకింగ్ పరికరాలు, సీసీ కెమెరాలను ఉపయోగించడం ఎంతో మేలని సూచిస్తున్నారు.
A man in Bihar used a crane to lift his Scorpio onto his house rooftop to keep it safe while going abroad for work. This is hilarious and it happens in India only, leaving netizens amused by the bizarre parking method. pic.twitter.com/4LGr7kUR3v
— VIZHPUNEET (@vizhpuneet) September 3, 2026
Also Read..
జల ప్రళయం వేళ.. టిబెట్‌ను వణికించిన భారీ భూకంపం
కొండా సురేఖ బర్తరఫ్: కేబినెట్ నుంచి ఉద్వాసనకు దారితీసిన 5 అసలు కారణాలు!
సంబంధిత వార్తలు

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
సెప్టెంబర్ 4, 2026

Nurse Murdered case | అత్యాచారాన్ని అడ్డుకోబోయిన నర్సు.. అయినా దారుణ హత్య
ఆగస్టు 31, 2026

Prashant Kishor | ముందు పదో తరగతి పాసవ్వండి.. బీహార్ సీఎం, విపక్షనేతకు ప్రశాంత్ కిషోర్ సవాల్
ఆగస్టు 26, 2026
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి



