త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Assembly Budget Session | తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం

Assembly Budget Session | రాష్ట్ర అసెంబ్లీ బ‌డ్జెట్ సమావేశాలు (Assembly Budget Session) సోమవారం ఉద‌యం 11.45 గంట‌ల‌కు ప్రారంభం అయ్యాయి. ఉద‌యం 11.50 గంట‌ల‌కు ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ శివ ప్ర‌తాప్ శుక్లా ప్ర‌సంగించారు.

S

Telangana | Published On Mar 16, 2026, 11.50 am IST

Assembly Budget Session | తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం
Advertisement

Assembly Budget Session | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్ర అసెంబ్లీ బ‌డ్జెట్ సమావేశాలు (Assembly Budget Session) సోమవారం ఉద‌యం 11.45 గంట‌ల‌కు ప్రారంభం అయ్యాయి. ఉద‌యం 11.50 గంట‌ల‌కు ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ శివ ప్ర‌తాప్ శుక్లా ప్ర‌సంగించారు. స‌భ‌కు శాస‌న‌స‌భ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్, మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజ‌ర‌య్యారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడనుంది. తర్వాత శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశమ‌వుతుంది. ఇందులో సమావేశాల ఎజెండాను ఖరారు చేస్తారు.

మంగ‌ళ‌వారం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్ర‌భుత్వం చర్చను ప్రతిపాదించనుంది. మంగళ, బుధవారాల్లో చర్చ అనంతరం తీర్మానాన్ని ఆమోదించనున్నారు. ఈనెల 20న ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. అనంత‌రం బ‌డ్జెట్‌పై చ‌ర్చించ‌నున్నారు.

కాగా, ఈ నెల 19న ఉగాది పండుగ కావ‌డంతో స‌భ జ‌రుగ‌దు. మ‌ళ్లీ 20న ఉభయ సభలు సమావేశం కానుండగా, అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌ భట్టి విక్రమార్క, మండలిలో శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాతి రోజు (మార్చి 21న‌) రంజాన్‌ కావడంతో మళ్లీ 23న సభ ప్రారంభమై వారం రోజుల పాటు జరిగే అవకాశాలున్నాయి. మార్చి 30 లేదా 31న ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌కు అసెంబ్లీ ఆమోదం తెలుపనున్న‌ట్లు స‌మాచారం.

తొలిసారి ఒకే ప్రాంగణంలో..
రాష్ట్ర శాసనసభ, శాసనమండలి తొలిసారిగా ఒకే ప్రాంగణంలో కొలువు దీరనున్నాయి. మండ‌లి స‌మావేశాలు ఇప్పటివరకు జూబ్లీహాల్‌ వేదికగా జరుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఇప్ప‌టినుంచి పునరుద్ధరించిన పాత అసెంబ్లీ భవనంలో జరగనున్నాయి.

Advertisement
Advertisement