El Nino | ప్రారంభమైన ఎల్‌నినో పరిస్థితులు.. పొంచి ఉన్న కరువు పరిస్థితులు: ఐఎండీ
El Nino | దేశంలో నైతరుతి రుతుపవనాలు విస్తరిస్తున్న సమయంలో పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో పరిస్థితులు (El Nino) అధికారికంగా ప్రారంభమయ్యయాని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ప్రస్తుత రుతుపవనాల సీజన్‌లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది.
El Nino | త్రినేత్ర.న్యూస్: దేశంలో నైతరుతి రుతుపవనాలు విస్తరిస్తున్న సమయంలో పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో పరిస్థితులు (El Nino) అధికారికంగా ప్రారంభమయ్యయాని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ప్రస్తుత రుతుపవనాల సీజన్‌లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. జూలై నుంచి దీని తీవ్రత మధ్యస్థం నుంచి బలంగా ఉండవచ్చని పేర్కొంది. దీని ప్రభావంతో దేశంలో రుతుపవనాలు బలహీనపడటం, ఉష్ణోగ్రతలు పెరగడంతోపాటు కొన్ని ప్రాంతాల్లో కరువు ముప్పు పొంచి ఉంటుందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఎల్ నినో అంటే..
ఎల్ నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో వేడి పెరడం వల్ల వచ్చే ఒక సహజమైన వాతావరణ మార్పు. సాధారణంగా ఇది ఏర్పడినప్పుడు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో భిన్నమైన పరిస్థితులు తలెత్తుతాయి. దక్షిణ అమెరికా, ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియాలోని చాలా ప్రాంతాల్లో తీవ్రమైన కరువు, కార్చిచ్చులు వస్తాయి. అదే సమయంలో అమెరికాలోని దక్షిణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి వరదలు ముంచెత్తుతాయి.
భారత్‌పై ప్రభావం..
ఎల్ నినో కారణంగా రుతుపవనాలు తీవ్రంగా బలహీనపడతాయి. తక్కువ వర్షాలు కురవడం, ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం, వర్షాలు లేకుండా పొడి వాతావరణం ఏర్పడటం లాంటివి జరుగుతాటాయి. ముఖ్యంగా కొన్నేండ్లపాటు కరువు వచ్చే ప్రమాదం ఉంటుంది. 2000వ సంవత్సరం తర్వాత అంటే 2002, 2009, 2015, 2023లో ఎల్ నినో తరహా వాతావరణ మార్పులు వచ్చాయి.
మనిషి సృష్టిస్తున్న వాతావరణ మార్పులకు, ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడే ఈ ఎల్ నినో కలిస్తే ఎలాంటి విపత్తులు వస్తాయోనని శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. ఈ ఎల్ నినో దెబ్బకి వచ్చే 2027 సంవత్సరం చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది.
తాజావార్తలు
- ●TUWJ | హెల్త్ కార్డుల కోసం జర్నలిస్టుల పోస్టు కార్డు ఉద్యమం
- ●ల్యాప్‌టాప్ షట్‌డౌన్… మైండ్ ఇంకా ఆన్లైన్! ఐటీ ఉద్యోగులను వేధించే బర్నౌట్
- ●Tamil Nadu | తమిళనాడులో హైవే బోర్డులపై హిందీ.. ఇద్దరు అధికారుల సస్పెండ్
- ●V Prakash | ప్రత్యేక దేశం కోసం పోరాడాల్సి వస్తుంది : వీ ప్రకాశ్
- ●Harish Rao | టీజీ-ట్రాన్స్‌కో ప్రైవేటీకరణను ఆపండి.. రాహుల్‌కు హరీశ్‌రావు లేఖ
- ●AISF | ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. అధ్యక్ష, కార్యదర్శిగా మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్

TUWJ | హెల్త్ కార్డుల కోసం జర్నలిస్టుల పోస్టు కార్డు ఉద్యమం

ల్యాప్‌టాప్ షట్‌డౌన్… మైండ్ ఇంకా ఆన్లైన్! ఐటీ ఉద్యోగులను వేధించే బర్నౌట్

Tamil Nadu | తమిళనాడులో హైవే బోర్డులపై హిందీ.. ఇద్దరు అధికారుల సస్పెండ్

V Prakash | ప్రత్యేక దేశం కోసం పోరాడాల్సి వస్తుంది : వీ ప్రకాశ్




