Odesa Port Attack | ఉక్రెయిన్ రాయబారికి భారత్ సమన్లు
Odesa Port Attack | నల్ల సముద్ర ప్రాంతంలో భారతీయ నావికుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌లోని ఒడెస్సా పోర్ట్‌లో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న ఎంవీ ఏజీఎన్ రాగ్నార్ కార్గో నౌకపై జరిగిన దాడి నేపథ్యంలో సోమవారం ఉక్రెయిన్ రాయబారి డాక్టర్ ఒలెక్సాండర్ పోలిష్చుక్‌ను విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసి వివరణ కోరింది.
- నల్ల సముద్రంలో నావికుల భద్రతపై కేంద్రం ఆందోళన
- ఇద్దరు భారతీయుల కోసం గాలింపు
Odesa Port Attack | నల్ల సముద్ర ప్రాంతంలో భారతీయ నావికుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌లోని ఒడెస్సా పోర్ట్‌లో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న ఎంవీ ఏజీఎన్ రాగ్నార్ కార్గో నౌకపై జరిగిన దాడి నేపథ్యంలో సోమవారం ఉక్రెయిన్ రాయబారి డాక్టర్ ఒలెక్సాండర్ పోలిష్చుక్‌ను విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసి వివరణ కోరింది. శనివారం జరిగిన ఈ దాడి సమయంలో నౌకలో నలుగురు భారతీయ నావికులు ఉన్నారు. వారిలో ఇద్దరు సురక్షితంగా ఉన్నట్లు భారత రాయబార కార్యాలయం వెల్లడించగా.. మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. ఘర్షణ ప్రాంతాల్లో పనిచేస్తున్న భారతీయుల భద్రతకే అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.
ఈ ఘటన నేపథ్యంలో ఆదివారం విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక సూచనలు జారీ చేసింది. యుద్ధ ప్రభావిత సముద్ర ప్రాంతాల్లో ప్రయాణించే వాణిజ్య నౌకల్లో ఉద్యోగాలకు వెళ్లే ముందు భద్రతాపరమైన ప్రమాదాలను పూర్తిగా అంచనా వేసుకోవాలని భారతీయులకు సూచించింది. అలాంటి ప్రాంతాల్లో పనిచేస్తున్న నావికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. గత వారం ఎంవీ గోల్డెన్ లియో వాణిజ్య నౌకపై రష్యా జరిపిన దాడిలో నలుగురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనపై కూడా కేంద్రం రష్యా తాత్కాలిక రాయబారి వ్లాదిమిర్ లదనోవ్‌ను పిలిపించి నిరసన తెలిపింది. జూలై 18 నుంచి ఇప్పటివరకు నల్ల సముద్ర ప్రాంతంలో జరిగిన దాడుల్లో మొత్తం ఐదుగురు భారతీయ నావికులు మృతిచెందారు. వారం రోజుల్లో భారతీయ సిబ్బందితో ఉన్న నౌకలపై మూడు తీవ్రమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే, భారతీయుల భద్రత విషయంలో రాజీపడబోమని కేంద్రం ఉక్రెయిన్, రష్యా ప్రభుత్వాలకు స్పష్టమైన సంకేతాలను పంపింది. సంబంధిత దేశాల అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Lucky Zodiac Signs | శారదీయ నవరాత్రుల్లో సూర్య సంచారం.. ఈ మూడురాశుల వారికి శుభ ఫలితాలు!
అక్టోబర్ 4, 2026

Russian Drone Attack Sumy | ఉక్రెయిన్‌లో రష్యా డ్రోన్ల బీభత్సం: ఇండియన్ ఫార్మా ప్లాంట్ ధ్వంసం.. ఒకరు మృతి, రూ.400 కోట్ల నష్టం
అక్టోబర్ 4, 2026

Weekly Horoscope | అక్టోబర్ 5 నుంచి 11 వరకు.. ఈ రాశుల వారికి శుభ ఫలితాలు
అక్టోబర్ 4, 2026
తాజావార్తలు
- ●V Srinivas Goud | ఓబీసీ కుల గణన చేయకుంటే ఢిల్లీని దిగ్బంధిస్తాం
- ●Mamitha Baiju | "ప్రేమలు" హీరోయిన్‌కు జాక్‌పాట్ - నాని సినిమాతో రేట్ పెంచేసిన మమితా బైజు!
- ●Rakesh Reddy | ప్రతీ పట్టభద్రుడు ఓటరుగా నమోదు కావాలి
- ●Pink Victory Run Hyderabad | పింక్ విక్టరీ రన్ 10వ వార్షికోత్సవం: మహిళల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.. చిన్నజీయర్ స్వామిజీ, వైద్య నిపుణుల పిలుపు
- ●Food Delivery | ఫుడ్ డెలివరీ ఆలస్యమైందని.. డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి.. వీడియో
- ●Mahabubnagar | గొంతులో ఇరుక్కున్న బిస్కెట్.. ఏడాదిన్నర బాలుడు మృతి

V Srinivas Goud | ఓబీసీ కుల గణన చేయకుంటే ఢిల్లీని దిగ్బంధిస్తాం

Mamitha Baiju | "ప్రేమలు" హీరోయిన్‌కు జాక్‌పాట్ - నాని సినిమాతో రేట్ పెంచేసిన మమితా బైజు!

Rakesh Reddy | ప్రతీ పట్టభద్రుడు ఓటరుగా నమోదు కావాలి

Pink Victory Run Hyderabad | పింక్ విక్టరీ రన్ 10వ వార్షికోత్సవం: మహిళల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.. చిన్నజీయర్ స్వామిజీ, వైద్య నిపుణుల పిలుపు



