PepsiCo Layoffs | వేయి ఉద్యోగాలకు పెప్సికో కోత.. కారణాలివే..
PepsiCo Layoffs | ప్రముఖ శీతల పానీయాలు, స్నాక్స్ తయారీ సంస్థ పెప్సికో ఉత్తర అమెరికాలో సుమారు 1వేయి ఉద్యోగాలను తొలగించాలని నిర్ణయించింది. సంస్థలో నిర్వహణ వ్యవస్థను సరళీకరించడం, నిర్ణయాలు వేగంగా తీసుకోవడం, బాధ్యతలను స్పష్టంగా విభజించడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని నార్త్ అమెరికా సీఈఓ రామ్ కృష్ణన్ తెలిపారు. మరోవైపు పానీయాల విక్రయాలు తగ్గడం, స్నాక్స్ విభాగంలో మార్కెట్ వాటా కోల్పోవడం సంస్థపై ఒత్తిడి పెంచుతున్నాయి.
PepsiCo Layoffs | ప్రముఖ శీతల పానీయాలు, స్నాక్స్ తయారీ సంస్థ పెప్సికో ఉత్తర అమెరికాలో సుమారు 1వేయి ఉద్యోగాలను తొలగించాలని నిర్ణయించింది. సంస్థలో నిర్వహణ వ్యవస్థను సరళీకరించడం, నిర్ణయాలు వేగంగా తీసుకోవడం, బాధ్యతలను స్పష్టంగా విభజించడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని నార్త్ అమెరికా సీఈఓ రామ్ కృష్ణన్ తెలిపారు. మరోవైపు పానీయాల విక్రయాలు తగ్గడం, స్నాక్స్ విభాగంలో మార్కెట్ వాటా కోల్పోవడం సంస్థపై ఒత్తిడి పెంచుతున్నాయి.
కీలకమార్పులు చేయనున్న కంపెనీ..
ఉత్తర అమెరికా కార్యకలాపాల్లో భాగంగా సుమారు 1వేయి ఉద్యోగాలను తగ్గించేందుకు పెప్సికో ప్రణాళికలు సిద్ధం చేసింది. సంస్థలో ప్రస్తుతం నిర్వహణ వ్యవస్థ సంక్లిష్టంగా, విభజితంగా ఉందని నార్త్ అమెరికా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామ్ కృష్ణన్ ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమోలో పేర్కొన్నారు. సంస్థ నిర్మాణాన్ని సరళీకరించడం, బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించడం, వేగంగా నిర్ణయాలు తీసుకునే విధానాన్ని అమలు చేయడం కోసం రాబోయే వారంలో పలు విభాగాల్లో మార్పులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. గతేడాది చివరి నాటికి పెప్సికో ప్రపంచవ్యాప్తంగా సుమారు 3.06 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉంది. వీరిలో దాదాపు 1.25 లక్షల మంది అమెరికాలో పనిచేస్తున్నారు.
బలహీనమైన పనితీరు..
పెప్సికో ఉత్తర అమెరికా పానీయాల విభాగంలో బలహీనమైన పనితీరును ఎదుర్కొంటోంది. మూడో త్రైమాసికంలో సుమారు 770 కోట్ల డాలర్ల మొత్తం అమ్మకాలు నమోదైనప్పటికీ, ఆర్గానిక్ వాల్యూమ్ గ్రోత్ స్వల్పంగా తగ్గింది. ఇది మార్కెట్ నిపుణుల అంచనాలను అందుకోలేకపోయింది. ధరల పెంపు కారణంగా స్నాక్స్ విభాగంలోనూ వినియోగదారుల ఆదరణ తగ్గుతోంది. వినియోగదారులు ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుండడంతో ఉప్పు కలిపిన స్నాక్స్ విక్రయాల్లో మార్కెట్ వాటాను నిలబెట్టుకోవడం సంస్థకు సవాలుగా మారింది. పెప్సికో సీఈఓ రామోన్ లగార్టా సైతం శీతల పానీయాల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పెప్సీ, మౌంటెన్ డ్యూ ఉత్పత్తులతోపాటు పాపీ బ్రాండ్‌పై మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు.
కేఎఫ్‌సీ నిర్ణయంతో ఎదురుదెబ్బ..
కాగా అమెరికాలోని సుమారు 4వేల కేఎఫ్‌సీ రెస్టారెంట్లలో పెప్సికో పానీయాల స్థానంలో కోకాకోలా ఉత్పత్తులను అందించేందుకు ఒప్పందం కుదిరింది. వచ్చే జనవరి నుంచి ఈ మార్పు ప్రారంభమై, వసంతకాలం నాటికి పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. అయితే అంతర్జాతీయ కేఎఫ్‌సీ రెస్టారెంట్లలో మాత్రం పెప్సికో పానీయాలు కొనసాగనున్నాయి. గతేడాది కాస్ట్‌కో తన ఫుడ్ కోర్టుల్లోనూ పెప్సీ స్థానంలో కోకాకోలాను తీసుకొచ్చింది. అంతకుముందు మారియట్ ఇంటర్నేషనల్ కూడా కోకాకోలాతో ఒప్పందం చేసుకుంది. దీంతో పెప్సికోకు కీలక వ్యాపార భాగస్వాములు దూరమవుతున్నారు. కోకాకోలాకు ఇది ఫౌంటెన్ బిజినెస్‌లో పెద్ద విజయమని పానీయాల రంగ నిపుణుడు జాన్ సిచర్ అభిప్రాయపడ్డారు. వరుసగా వ్యాపార అవకాశాలు కోల్పోవడం, అమ్మకాల్లో మందగమనం నేపథ్యంలో పెప్సికో తీసుకున్న ఉద్యోగాల కోత నిర్ణయం సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
- ●Siddhu Jonnalagadda | సిద్ధూ జొన్నలగడ్డకు జోడీగా నయన్ సారిక.. సుకుమార్ బ్యానర్లో కొత్త ప్రేమకథ!
- ●CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి బర్త్‌డే ఫ్లెక్సీ దగ్ధం.. రగిలిన వర్గ విభేదాలు
- ●Sonia Gandhi Belonging Book | సోనియా గాంధీ 'బిలాంగింగ్' పుస్తకంలో కన్నీటి నిజాలు: ఆ త్యాగాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి
- ●Stock Markets | సెన్సెక్స్ 773 పాయింట్లు జంప్.. 25,250 దాటిన నిఫ్టీ..
- ●Union Cabinet | రూ.77,101 కోట్లతో కేంద్రం భారీ ప్యాకేజీ
- ●Mutual Funds | మ్యూచువల్ ఫండ్లలో భారీగా పెట్టుబడులు.. ఒక్క నెలలో రూ.1.73 లక్షల కోట్ల ఇన్‌ఫ్లో..

Siddhu Jonnalagadda | సిద్ధూ జొన్నలగడ్డకు జోడీగా నయన్ సారిక.. సుకుమార్ బ్యానర్లో కొత్త ప్రేమకథ!

CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి బర్త్‌డే ఫ్లెక్సీ దగ్ధం.. రగిలిన వర్గ విభేదాలు

Sonia Gandhi Belonging Book | సోనియా గాంధీ 'బిలాంగింగ్' పుస్తకంలో కన్నీటి నిజాలు: ఆ త్యాగాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి

Stock Markets | సెన్సెక్స్ 773 పాయింట్లు జంప్.. 25,250 దాటిన నిఫ్టీ..



