త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | లోక‌ల్‌ రిజ‌ర్వేష‌న్‌కు నాలుగేళ్ల రూల్‌ ఉండాల్సిందే: సుప్రీంకోర్టు తీర్పు

Supreme Court | తెలంగాణలో మెడికల్ ప్రవేశాల కోసం లోక‌ల్‌ రిజర్వేషన్ పొందాలంటే వరుసగా నాలుగేళ్లు రాష్ట్రంలోనే చదివి ఉండాలనే నిబంధన తప్పనిసరి అని సుప్రీంకోర్టు మ‌రోసారి స్ప‌ష్టం చేసింది.

S

Flash news | Published On Sep 28, 2026, 2.01 pm IST

Supreme Court | లోక‌ల్‌ రిజ‌ర్వేష‌న్‌కు నాలుగేళ్ల రూల్‌ ఉండాల్సిందే: సుప్రీంకోర్టు తీర్పు
Advertisement

Supreme Court | త్రినేత్ర న్యూస్: తెలంగాణలో మెడికల్ ప్రవేశాల కోసం లోక‌ల్‌ రిజర్వేషన్ పొందాలంటే వరుసగా నాలుగేళ్లు రాష్ట్రంలోనే చదివి ఉండాలనే నిబంధన తప్పనిసరి అని సుప్రీంకోర్టు మ‌రోసారి స్ప‌ష్టం చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవాల్సిందేనని తేల్చిచెప్పింది. గతంలో జస్టిస్ బీఆర్‌ గవాయ్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఈ సంద‌ర్భంగా పునరుద్ఘాటించింది. ఈ వ్య‌వ‌హారంలో గ‌తంలో తెలంగాణ ప్ర‌భుత్వం జారీ చేసిన జీవోను మ‌రోసారి స‌మ‌ర్థిస్తూ సోమ‌వారం తీర్పు వెలువ‌రించింది.

లోక‌ల్ రిజర్వేషన్‌కు నాలుగేళ్ల విద్యాభ్యాసం తప్పనిసరి నిబంధనను సవాల్‌ చేస్తూ జెల్ల అంకిత పిటిష‌న్ దాఖ‌లు చేయ‌గా సుప్రీంకోర్టు తిర‌స్క‌రించింది. నిబంధన ఏకపక్షంగా ఉందన్న వాదనను జస్టిస్‌ పీఎస్‌ నరసింహ ధర్మాసనం కొట్టివేస్తూ తీర్పు చెప్పింది. ఎంబీబీఎస్‌ అర్హత పరీక్షకు ముందు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చ‌దివితేనే లోక‌ల్ రిజ‌ర్వేష‌న్ వర్తిస్తుందని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం స్పష్టం చేసింది.

స్థానిక కోటా వర్తించాలంటే విద్యార్థులు 9, 10, 11, 12 తరగతులు (ఇంటర్‌ వరకు) వరుసగా నాలుగేళ్లు రాష్ట్రంలోనే చదివి ఉండాలి. ఉద్యోగరీత్యా బదిలీలు అయ్యే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ రంగానికి చెందిన వారి పిల్లలకు నిబంధనల్లో తగిన మినహాయింపులు వర్తిస్తాయని కోర్టు తెలిపింది.

Advertisement
Advertisement