త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MBBS Seats | ఫీజుల భారం.. రాష్ట్రంలో ఖాళీగా 175 ఎంబీబీఎస్ సీట్లు

MBBS Seats | రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు (MBBS Seats) భారీగా మిగిలిపోయాయి. నీట్‌ యూజీ కౌన్సెలింగ్ ముగిసిన‌ప్ప‌టికీ విద్యార్థులు చేర‌డానికి ఆస‌క్తి చూప‌క‌పోవ‌డంతో సుమారు 175 సీట్లు మిగిలిపోయాయి.

G

Telangana | Published On Nov 4, 2026, 9.57 am IST

MBBS Seats | ఫీజుల భారం.. రాష్ట్రంలో ఖాళీగా 175 ఎంబీబీఎస్ సీట్లు
Advertisement

MBBS Seats | త్రినేత్ర న్యూస్‌: రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు (MBBS Seats) భారీగా మిగిలిపోయాయి. నీట్‌ యూజీ కౌన్సెలింగ్ ముగిసిన‌ప్ప‌టికీ విద్యార్థులు చేర‌డానికి ఆస‌క్తి చూప‌క‌పోవ‌డంతో సుమారు 175 సీట్లు మిగిలిపోయాయి. ఇవ‌న్నీ ప్రైవేటు మెడిక‌ల్ కాలేజీల్లోని (Private Medical Colleges) మేనేజ్‌మెంట్ కోటాకు (Management Quota) సంబంధించ‌న‌వే కావ‌డం గ‌మ‌నార్హం. రాష్ట్రంలో ఏడాది కొత్తగా 1,010 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 10,450కి చేరింది. ఇందులో 36 ప్ర‌భుత్వ కాలేజీల్లో 4,400 సీట్లు ఉండ‌గా, 30 ప్రైవైటు మెడికల్ కాలేజీల్లో 6050 ఉన్నాయి. దీంతో దేశంలో అత్యధిక ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఐదో స్థానానికి చేరింది. అయితే విద్యా సంవ‌త్స‌రం ప్రారంభ‌మైన‌ప్ప‌టికీ ఇంకా సీట్లు మిగిలిపోవ‌డం, దానికి అధిక ఫీజులే కార‌ణ‌మ‌ని తెలుస్తున్న‌ది.

ఫీజుల భారం..

మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (MCC) ప్రకటించిన షెడ్యూల్ ప్ర‌కారం వైద్య క‌ళాశాల‌ల్లో అన్నిర‌కాల‌ ప్ర‌వేశాల గ‌డువు (NEET-UG counselling) అక్టోబ‌ర్ 26తో ముగిసిపోయింది. రాష్ట్రంలోని 36 ప్ర‌భుత్వ కాలేజీల్లో ఉన్న 4,400 సీట్లు భ‌ర్తీ కాగా, ప్రైవేటు కాలేజీల్లోనే క‌న్వీన‌ర్ కోటా (Category-A) సీట్లు కూడా విద్యార్థుల‌తో నిండిపోయాయి. అయితే మేనేజ్‌మెంట్ కోటా (Category-B), ఎన్‌ఆర్‌ఐ కోటా (Category-C) ఖాళీగా మిగిలిపోయాయి. బీ కేటగిరీ ఫీజు ఏడాదికి రూ.11.15 ల‌క్ష‌ల నుంచి రూ.13 లక్షల వరకు ఉంది. సీ క్యాటగిరీ సీటు ఫీజు రూ.24 ల‌క్ష‌ల నుంచి రూ.25 లక్షల మధ్య ఉంది. దీనికి హాస్టల్‌, మెస్‌, లైబ్రరీ, ఇతర కాలేజీ ఖర్చులు అదనం. దీంతో ఎంబీబీఎస్‌ పూర్తయ్యేసరికి సుమారు రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు ఖర్చు అవుతుండ‌టంతో విద్యార్థులు వెన‌క‌డుగు వేస్తున్నార‌ని వైద్యవిద్య నిపుణులు చెబుతున్నారు.

ఇంత భారీస్థాయిలో సీట్లు మిగిలిపోవడానికి కారణం బీ, సీ కేటగిరీ సీట్ల ఫీజులు భారీగా పెరగటమేనని అంటున్నారు. దీనికితోడు జాతీయ వైద్య కమిషన్‌ (NMC) సీ క్యాటగిరీ విషయంలో తీసుకొచ్చిన నియమ నిబంధనలు కూడా విద్యార్థులను నిరుత్సాహపరుస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 10 వేలు దాటిన‌ప్ప‌టికీ, వాటిలో ఎక్కువగా ప్రైవేటు కాలేజీల్లో ఉండ‌టం, వైద్య విద్యకు ఆర్థిక భారాలు ఎంతలా అడ్డంకిగా మారుతున్నాయో మిగిలిపోయిన సీట్లే (Medical College Seats) అద్దంప‌డుతున్నాయి.

అద‌న‌పు వ‌సూళ్లు..

ప్రభుత్వం నిర్ణయించిన ట్యూషన్ ఫీజు మాత్రమే కాకుండా, విద్యార్థులపై ఇతర ఆర్థిక భారాలు కూడా భారీగా ఉన్నాయని తెలుస్తున్న‌ది. కేటగిరీ-ఏ విద్యార్థులకు నిర్ణీత ఫీజు రూ.60,000 లోపు ఉంటే, కొన్ని ప్రైవేట్ కాలేజీలు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక కేటగిరీ బీ, సీ విద్యార్థుల నుంచి కూడా అనుమతించిన ఫీజుల కంటే అదనంగా వసూలు చేస్తున్నట్లు స‌మాచారం. దీనికి తోడు హాస్టల్ వసతి, ఇతర ఖర్చులు భారాన్ని మరింత పెంచుతున్నాయి.

ఇంత‌లా మిగ‌ల‌డం ఇదే మొద‌టిసారి..

ఇంత పెద్ద సంఖ్యలో సీట్లు ఖాళీగా మిగిలిపోవడం ఇదే తొలిసార‌ని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (KNRUHS) జాయింట్ రిజిస్ట్రార్ జే. వెంకటేశ్వర్లు చెప్పారు. ప్రభుత్వ కాలేజీల్లో ఫీజులు చాలా తక్కువగా ఉండటం వ‌ల్ల వాటికి ఎప్పుడూ విపరీతమైన డిమాండ్ ఉంటుంద‌ని చెప్పారు. దీంతో అక్కడ అన్ని సీట్లు భర్తీ అయ్యాయని తెలిపారు.

భారీగా ఖ‌ర్చు చేసినా.. జీతాలు త‌క్కువే..!

తీరా భారీగా ఖ‌ర్చు చేసి వైద్య విద్య‌ను పూర్తిచేసిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత ల‌భించే ఉపాధి అవ‌కాశాలు, జీతాలు త‌క్కువేన‌ని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (TGMC) సభ్యుడు డాక్టర్ జి. శ్రీనివాస్ అన్నారు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల‌కు ల‌క్ష‌ల్లో ప్యాకేజీలు ల‌భిస్తుండ‌గా, ఒక డ్యూటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్ నెలకు రూ.20,000 నుంచి రూ.30,000 మాత్రమే లభిస్తున్న‌ద‌ని చెబుతున్నారు. అయితే ఎండీ (MD) లేదా డీఎం (DM) చేసిన త‌ర్వాతే మంచి జీతం అందుకోవ‌చ్చ‌ని చెప్పారు.

ట్యాగ్స్:

KNRUHSManagement QuotaMBBS SeatsMCCNEET UGNMCPrivate Medical CollegesTelangana
Advertisement
Advertisement