CEC Gyanesh Kumar | బెంగాల్‌లో ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి.. అధికారులకు ఈసీ ఆదేశాలు
CEC Gyanesh Kumar | ఎన్నికల నిర్వహణపై బెంగాల్‌లోని ఉన్నతాధికారులకు కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు.
CEC Gyanesh Kumar | పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యంగా రెండు రోజుల క్రితం మాల్దా జిల్లాలో సర్ విధుల్లో ఉన్న ఏడుగురు అధికారులను నిరసనకారులు నిర్బంధించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ ఘటనపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు బెంగాల్ ప్రభుత్వంపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై బెంగాల్‌లోని ఉన్నతాధికారులకు కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు.
ఓటర్లు తమ ఓటు హక్కును ఎలాంటి భయం లేకుండా వినియోగించుకునేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, కోల్‌కతా పోలీస్ కమిషనర్, డివిజనల్ కమిషనర్లు, ఏడీజీపీలు, ఐజీలు, జిల్లా మెజిస్ట్రేట్లు, సీపీలు, ఎస్ఎస్‌పీలు, ఎస్పీలతో సహా సీనియర్ అధికారులను ఆదేశించారు. "ఎన్నికలు హింస, భయాందోళనలు, ప్రలోభాలకు తావులేకుండా జరగాలి. క్రాస్ ఓటింగ్, బూత్ క్యాప్చరింగ్, బూత్ జ్యామింగ్ వంటి అక్రమాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలి. విధి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోము. తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తప్పవు" అని సీఈసీ హెచ్చరించారు.
కాగా, ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో బెంగాల్ ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలు వెల్లడించనున్నారు. అయితే, ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకూ రాష్ట్రంలో కేంద్ర బలగాలు మోహరించి ఉంటాయని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల భద్రత కోసం అదనంగా కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించనున్నట్లు తెలిపింది.
Also Read..
మేం యుద్ధంలో ఉన్నాం.. విమానాలు కూలినా ఇరాన్‌తో చర్చలు ఆగవు : ట్రంప్
స్టాక్ మార్కెట్లలో బ్యాడ్ ఫేజ్ ముగిసినట్లే..? 40 శాతం ర్యాలీకి సిద్ధమవండి..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026

R. G. Kar Medical College | సందీప్ ఘోష్ ప్రాసిక్యూషన్‌కు అనుమతి.. ఆర్జీకర్ కేసులో బిగుస్తున్న ఉచ్చు
మే 19, 2026

West Bengal Annapurna Scheme | బెంగాల్ సర్కార్ భారీ నజరానా: మహిళలకు నెలకు రూ.3000, ఉచిత బస్సు ప్రయాణం!
మే 18, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



