Tamil Nadu | తమిళనాడు సర్కార్ బంపర్ ఆఫర్.. ప్రతి ఇంటికీ రూ.22వేల వరకు సోలార్ పథకం సబ్సిడీ..
Tamil Nadu | తమిళనాడు ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య ఘర్ రూఫ్‌టాప్ సోలార్ పథకానికి అదనంగా రాష్ట్ర స్థాయిలో రూ.22 వేల వరకు రాయితీ అందించేందుకు నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలో ఇళ్లపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటు మరింత పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Tamil Nadu | తమిళనాడు ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య ఘర్ రూఫ్‌టాప్ సోలార్ పథకానికి అదనంగా రాష్ట్ర స్థాయిలో రూ.22 వేల వరకు రాయితీ అందించేందుకు నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలో ఇళ్లపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటు మరింత పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల ప్రకారం 1 కిలోవాట్ వ్యవస్థకు రూ.5వేలు, 2 కిలోవాట్లకు రూ.10వేలు, 3 కిలోవాట్లకు రూ.22వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అదనపు రాయితీ ఇవ్వనుంది. ఇది కేంద్ర ప్రభుత్వం అందించే రాయితీకి అదనంగా లభిస్తుంది. ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం కింద వరుసగా రూ.30వేలు, రూ.60వేలు, రూ.78వేల వరకు కేంద్ర సబ్సిడీ ఇప్పటికే అందుబాటులో ఉంది.
వెనుకబడ్డ తమిళనాడు..
తమిళనాడు పెద్ద స్థాయి పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో మంచి పనితీరు కనబరుస్తున్నప్పటికీ, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గృహాలపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటు విషయంలో వెనుకబడి ఉందని పరిశ్రమ ప్రతినిధులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అదనపు ఆర్థిక సహాయం సరైన దిశలో తీసుకున్న చర్యగా వారు పేర్కొంటున్నారు. అయితే పథకంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టడం కూడా కీలకమని సూచిస్తున్నారు. తమిళనాడు సోలార్ ఎనర్జీ డెవలపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, శ్రీరామ్ సోలార్ సీఈవో పి.శివకుమార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాయితీలను కలిపితే ఇంటి పైకప్పుపై సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు ఖర్చు దాదాపు సగం వరకు తగ్గే అవకాశం ఉందన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తున్న వేగంతోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటా నిధులను త్వరగా విడుదల చేయడం కీలకమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమలుకు రూ.50 కోట్లను కేటాయించినట్లు వెల్లడించారు.
ప్రచారంపై దృష్టి లేదు..
ఇప్పటివరకు తమిళనాడు ప్రభుత్వం ఈ పథకంపై ప్రకటనలు లేదా అవగాహన ప్రచార కార్యక్రమాలను ప్రారంభించలేదని శివకుమార్ తెలిపారు. అదనపు రాయితీ ప్రారంభ పెట్టుబడి భారాన్ని తగ్గించడంతోపాటు పథకం ద్వారా లభించే ఆర్థిక ప్రయోజనాలను మెరుగుపరుస్తుందని, అయితే ప్రజల్లో అవగాహన, నమ్మకాన్ని పెంచడం కూడా అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లో గృహాలపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటును పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు అవసరమని చెప్పారు. స్వెలెక్ట్ ఎనర్జీ సిస్టమ్స్ లిమిటెడ్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ అరుల్కుమార్ షణ్ముగసుందరం మాట్లాడుతూ కేవలం రాయితీ మొత్తమే కాకుండా అర్హత నిబంధనలు, రుణ సదుపాయాలు, దరఖాస్తు ప్రక్రియ సౌలభ్యం, రాయితీ చెల్లింపు వేగం, నెట్ మీటరింగ్ విధానం వంటి అంశాలు కూడా ప్రజలు సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. తమిళనాడులో ఇప్పటికే కొన్ని వర్గాల గృహ వినియోగదారులకు సబ్సిడీ లేదా ఉచిత విద్యుత్ ప్రయోజనాలు ఉండడంతో, సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుపై తక్షణ ఆర్థిక ప్రేరణ కొంత తగ్గి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఏయే రాష్ట్రాల్లో ఎంత సబ్సిడీ..
ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి పైకప్పుపై సౌర విద్యుత్ వ్యవస్థను కేవలం తక్షణ విద్యుత్ బిల్లు తగ్గింపుగా కాకుండా, దీర్ఘకాలికంగా ఇంధన స్వావలంబనకు చేసే పెట్టుబడిగా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని అరుల్కుమార్ తెలిపారు. దేశంలోని మరికొన్ని రాష్ట్రాలు కూడా గృహాలపై సౌర విద్యుత్ వ్యవస్థలకు అదనపు రాయితీలు అందిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఒక్కో కిలోవాట్‌కు రూ.15వేల చొప్పున, ఒక్కో ఇంటికి గరిష్ఠంగా రూ.30వేల వరకు అదనపు రాయితీ ఉంది. గుజరాత్‌లో ఒక్కో కిలోవాట్‌కు రూ.10వేల చొప్పున, ఒక్కో గృహ వినియోగదారుడికి గరిష్ఠంగా రూ.20వేల వరకు ప్రోత్సాహకం అందుతోంది. మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ప్రోత్సాహక పథకాలు అమల్లో ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం కింద తమిళనాడులో 60,151 సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాట్లు నమోదయ్యాయి. ఇదే సమయంలో గుజరాత్‌లో 5,94,966, మహారాష్ట్రలో 4,90,666, ఉత్తరప్రదేశ్‌లో 4,21,093, కేరళలో 2,09,716 వ్యవస్థలు నమోదయ్యాయి. దీంతో గృహాలపై సౌర విద్యుత్ విస్తరణలో తమిళనాడు ఇతర కీలక రాష్ట్రాల కంటే వెనుకబడి ఉన్న పరిస్థితి స్పష్టమవుతోంది.
అప్పట్లో ప్రకటించినా..
అయితే తమిళనాడు ప్రభుత్వం గృహ సౌర విద్యుత్‌కు రాష్ట్ర స్థాయిలో రాయితీ ప్రకటించడం ఇదే తొలిసారి కాదు. 2013లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత గృహ వినియోగదారుల్లో సౌర విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు క్యాపిటల్ ఇన్సెంటివ్ స్కీమ్ ను ప్రకటించారు. ఇందులో భాగంగా గ్రిడ్‌కు అనుసంధానించిన ఫొటోవోల్టాయిక్ వ్యవస్థలకు ఒక్కో కిలోవాట్‌కు రూ.20వేల చొప్పున మూలధన రాయితీ అందించే విధానాన్ని ప్రవేశపెట్టారు. కానీ ప్రభుత్వాలు ప్రచారంపై పెద్దగా దృష్టి సారించకపోవడం, ప్రజలకు కొన్ని వర్గాలకు ఉచిత విద్యుత్‌ను అందించడం రాష్ట్రంలో సోలార్ పరిశ్రమ వృద్ధికి ప్రతిబంధకాలుగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
సంబంధిత వార్తలు

Prakash Raj | విజయ్ విషయంలో నాకు చాలా సందేహాలు ఉన్నాయి.. టీవీకే పాలనపై ప్రకాష్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
సెప్టెంబర్ 21, 2026

Annamalai | పెట్టుబడుల కోసం డెడ్ ఎకానమీ దేశానికి వెళ్లడమేంటి..? విజయ్ యూకే పర్యటనపై అన్నామలై విమర్శలు
సెప్టెంబర్ 21, 2026

Supreme Court | హిందీ విషయంలో మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోండి.. తమిళనాడు సర్కార్‌పై సుప్రీం ఆగ్రహం
సెప్టెంబర్ 17, 2026
తాజావార్తలు
- ●Delhi Park | పోలీసులమని బెదిరించి.. ఢిల్లీ పార్క్‌లో మైనర్‌పై గ్యాంగ్ రేప్.. 10 రోజుల్లో నాలుగో ఘటన
- ●Gold And Silver Prices Today | పెట్టుబడిదారులకు అలర్ట్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. కొనేందుకు చాన్స్..?
- ●Bandlaguda RTO | బండ్లగూడ ఆర్టీవో ఆఫీసులో నగదు లెక్కింపు వ్యవహారం.. ముగ్గురు అధికారులపై వేటు
- ●Indian Rock Python | కొండ చిలువతో డ్యాన్స్.. గణేష్ నిమజ్జన వేడుకల్లో విశాఖ డ్యాన్స్ టీమ్ హంగామా.. వీడియో
- ●Googleboook | కొత్త ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేసిన గూగుల్.. ఏఐ ఫీచర్లతో అదిరిపోయాయి..
- ●Stock Markets | పాజిటివ్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారుల్లో అప్రమత్తత..

Delhi Park | పోలీసులమని బెదిరించి.. ఢిల్లీ పార్క్‌లో మైనర్‌పై గ్యాంగ్ రేప్.. 10 రోజుల్లో నాలుగో ఘటన

Gold And Silver Prices Today | పెట్టుబడిదారులకు అలర్ట్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. కొనేందుకు చాన్స్..?

Bandlaguda RTO | బండ్లగూడ ఆర్టీవో ఆఫీసులో నగదు లెక్కింపు వ్యవహారం.. ముగ్గురు అధికారులపై వేటు

Indian Rock Python | కొండ చిలువతో డ్యాన్స్.. గణేష్ నిమజ్జన వేడుకల్లో విశాఖ డ్యాన్స్ టీమ్ హంగామా.. వీడియో



