Covid-19 | మళ్లీ విస్తరిస్తున్న కరోనా మహమ్మారి.. నెల రోజుల్లో 13 మందికి పాజిటివ్.. నలుగురు మృతి
Covid-19 | దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా (Covid-19) మళ్లీ విస్తరిస్తున్నది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) మహమ్మారి (Corona Virus) వ్యాప్తి ఆందోళనకలిగిస్తున్నది. గత నెల రోజుల్లోనే కరోనాతో (Corona) నలుగురు చనిపోగా, 13 మంది వైరస్ బారినపడ్డారు.
Covid-19 | త్రినేత్ర.న్యూస్: దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా (Covid-19) మళ్లీ విస్తరిస్తున్నది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) మహమ్మారి (Corona Virus) వ్యాప్తి ఆందోళనకలిగిస్తున్నది. గత నెల రోజుల్లోనే కరోనాతో (Corona) నలుగురు చనిపోగా, 13 మంది వైరస్ బారినపడ్డారు. ఇక తాజా గణాంకాంల ప్రకారం దక్షిణాది రాష్ట్రాలైన కేరళలో 115 కేసులు నమోదవగా, కర్ణాటకలో 64, తమిళనాడులో 39 మంది కరోనాతో బాధపడుతున్నారు. మరోవైపు ఢిల్లీ (18), మహారాష్ట్ర (43), అండమాన్ నికోబార్ దీవుల్లో (13) కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.
ఇక ఏపీలో జూన్ 26 నుంచి జూలై 16 వరకు 13 మంది కరోనా బారినపడగా, నలుగురు చనిపోయారు. ప్రస్తుతం నలుగురు దవాఖానలో చికిత్స పొందుతున్నారు. మిగిలినవారు వైరస్ నుంచి కోలుకుంటున్నారని అధికారులు వెల్లడించారు. మరణించిన వారంతా కడప (Kadapa) జిల్లాకే చెందినవారు కావడం గమనార్హం. అయితే మృతుల్లో ఇప్పటికే ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నవారు ఉన్నట్లు సమాచారం. కడప జిల్లాలోనే జూలై 1 నుంచి 16 వరకు 11 కేసులు నమోదయినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. గుంటూరు జిల్లాలో 2, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి.
ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త..
జ్వరం, గొంతునొప్పి, దగ్గు, ముక్కు కారడం, ఒళ్లు నొప్పులు, అలసట వంటి లక్షణాలు ఉంటే జాగ్రత్తగా ఉండాలని, ఇవి సాధారణ వైరల్ ఫీవర్ లేదా జలుబు లక్షణాలను పోలి ఉండటంతో చాలామంది పరీక్షలు చేయించుకోకుండా నిర్లక్ష్యం చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. అందువల్ల ఈ లక్షణాలు రెండు, మూడు రోజులకుపైగా కొనసాగితే వైద్యులను సంప్రదించడం మంచిదని సూచించారు. కాగా, ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ మంది స్వల్ప లక్షణాలతోనే కోలుకుంటున్నప్పటికీ, 60 ఏండ్లు దాటిన వృద్ధులు, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు, మధుమేహం, కిడ్నీ సమస్యలు ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మాత్రం మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
సంబంధిత వార్తలు

Monsoon Diseases | వర్షాకాలంలో తరచూ వచ్చే 8 రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లు ఇవే.. వీటితో జాగ్రత్త..
సెప్టెంబర్ 14, 2026

Vinayaka chavithi 2026 | వినాయకుడి వైభవం చూడాల్సిందే.. ఏపీ, తెలంగాణలోని ప్రముఖ క్షేత్రాలు ఇవే..!
సెప్టెంబర్ 14, 2026

Dragon Fruit on Terrace | టెర్రస్‌పై డ్రాగన్ ఫ్రూట్ సాగు.. నెలకు రూ. 4 లక్షలు సంపాదిస్తున్న రిటైర్డ్ ప్రధానోపాధ్యాయురాలు
సెప్టెంబర్ 10, 2026
తాజావార్తలు
- ●Apple | ఐఫోన్లను అమ్మేందుకు యాపిల్ పాట్లు.. పెరిగిన ధరలకు కౌంటర్‌గా ఆఫర్లు..
- ●Revanth Reddy Vinayaka Chaviti | కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
- ●Governor worships to Khairathabad Ganesha | ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ దంపతుల తొలి పూజ
- ●Mahesh Kumar Goud | కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి అసలు కారణం అదే
- ●మక్కా డిఫెన్స్ డీల్‌లో అసలు ట్విస్ట్ ఇదే.. హుతీల దెబ్బకు పాక్ ఎందుకు జాగ్రత్తపడుతోంది?
- ●IPO | ఐపీవోలో పెట్టుబడి పెట్టేముందు గమనించాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే.. లేదంటే భారీ నష్టమే..

Apple | ఐఫోన్లను అమ్మేందుకు యాపిల్ పాట్లు.. పెరిగిన ధరలకు కౌంటర్‌గా ఆఫర్లు..

Revanth Reddy Vinayaka Chaviti | కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

Governor worships to Khairathabad Ganesha | ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ దంపతుల తొలి పూజ

Mahesh Kumar Goud | కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి అసలు కారణం అదే



