త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | రేవంత్.. రూ. 1000 కోట్లు ఇస్తే మా ఆస్తి మొత్తం రాసిస్తా

KTR | మాజీ సీఎం కేసీఆర్ ల‌క్ష‌ల కోట్ల భూములు కొల్ల‌గొట్టార‌ని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. లక్ష కోట్లు అంటున్న రేవంత్ రెడ్డికి ఒక మాట చెప్తున్న.. రూ. 1000 కోట్లు మాకు ఇస్తే మా ఆస్తి మొత్తం రాసిస్తాన‌ని కేటీఆర్ బ‌హిరంగ స‌వాల్ విసిరారు.

S

Telangana | Published On Sep 18, 2026, 12.10 pm IST

KTR | రేవంత్.. రూ. 1000 కోట్లు ఇస్తే మా ఆస్తి మొత్తం రాసిస్తా
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : మాజీ సీఎం కేసీఆర్ ల‌క్ష‌ల కోట్ల భూములు కొల్ల‌గొట్టార‌ని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. లక్ష కోట్లు అంటున్న రేవంత్ రెడ్డికి ఒక మాట చెప్తున్న.. రూ. 1000 కోట్లు మాకు ఇస్తే మా ఆస్తి మొత్తం రాసిస్తాన‌ని కేటీఆర్ బ‌హిరంగ స‌వాల్ విసిరారు. ఫార్ములా ఈ రేస్ కేసులో నాంప‌ల్లి కోర్టులో విచార‌ణ‌కు హాజ‌రైన అనంత‌రం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్ కుటుంబం ల‌క్ష‌ల కోట్ల భూములు కొల్ల‌గొట్టింద‌ని నీకు బాకా ఊదే పేప‌ర్ల‌లో రాయించుకున్నావు.. ఇప్పుడు చెబుతున్న‌.. రూ. 1000 కోట్లు ఇస్తే మా ఆస్తి మొత్తం రాసిస్తా. మిగ‌తా రూ. 99 వేల కోట్ల‌తో ఈ రాష్ట్రంలోని పెండింగ్‌లో ఉన్న ఫీ రియింబ‌ర్స్‌మెంట్ చెల్లించు.. ప్ర‌తి హామీని నెర‌వేర్చు. హైద‌రాబాద్ న‌గ‌రానికి 75 కిలోమీట‌ర్ల దూరంలో దాదాపు 20 ఏండ్ల కింద కేసీఆర్ భూములు కొన్నారు. అప్పుడు ఎక‌రం భూమి ధ‌ర రూ. 3 నుంచి 5 ల‌క్ష‌లు. ఇక నిన్న‌టి దాకా చిల్ల‌ర వాగుడు వాగుతూ.. కేసీఆర్ ప‌దివేల ఎక‌రాలు ఆక్ర‌మించాడ‌ని, వెయ్యి ఎక‌రాల్లో ఫామ్ హౌజ్ నిర్మించుకున్నాడ‌ని చెబితివి. నిన్ననేమో అసెంబ్లీలో మాట్లాడుతూ.. కేసీఆర్‌కు 67 ఎక‌రాలు ఉంద‌ని చెప్పిన‌వ్. మ‌రి మిగ‌తా 933 ఎక‌రాలు నీ అయ్యా, నీ అబ్బ ఎత్తుకుపోయిండా..? ఎవ‌డు ఎత్తుకుపోయిండు.. ఈ రోజు నువ్వు వాగిన చెత్త వాగుడికి స‌మాధానం ఎవ‌డు చెబుత‌డు.. కేసీఆర్‌కు క్ష‌మాప‌ణ చెప్పు. 933 ఎక‌రాలు ఎక్క‌డ ఉందో చెప్పు. ల‌క్ష కోట్ల సంగ‌తేందో చెప్పు. వెయ్యి కోట్ల‌కు మొత్తం రాసిస్తా.. నువ్వు ఎక్క‌డ సంత‌కం పెట్ట‌మంటే అక్క‌డ సంత‌కం పెడుతా అని కేటీఆర్ బ‌హిరంగ స‌వాల్ విసిరారు.

నువ్వు అస‌మ‌ర్థ పాల‌కుడివి

మిగ‌తా 99 వేల కోట్ల‌తో ఈ రాష్ట్రంలో ద‌ళితుల‌కు ఇచ్చిన‌ హామీలు అమ‌లు చేయ్.. కేసీఆర్ 10 ల‌క్ష‌లు ఇస్తే నేను 12 ల‌క్ష‌ల ఇస్తా అన్న‌వ్.. ఇచ్చి చూపెట్టు. గిరిజ‌న బంధు పెడుతా అన్న‌వ్ ఇచ్చి చూపెట్టు. చిల్ల‌ర ప్ర‌య‌త్నాలు బంద్ జేయ్.. 22ఏలో చేసిన దోపిడీ బ‌య‌ట‌ప‌డుత‌ద‌ని డ్రామాలు ఆడుతున్న‌వ్. 30 శాతం క‌మీష‌న్ల కోసం నీ ప్ర‌భుత్వం నాట‌క ఆడుతోంది. దృష్టి మ‌ళ్లించేందుకు ఇలాంటి ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌వ్.. నీ వ‌ల్ల ఏం కాదు అని ప్ర‌జ‌ల‌కు తెలిసిపోయింది. నువ్వు అస‌మ‌ర్థ పాల‌కుడిగా చ‌రిత్ర‌లో చ‌రిత్ర‌హీనుడిగా మిగిలిపోతావ్ అని కేటీఆర్ విమ‌ర్శించారు.

కోర్టు ఎన్ని సార్లు పిలిచినా హాజ‌ర‌వుతాను

ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్‌కు, రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే విషయం. ఎలక్ట్రిక్ వాహన రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నమే ఫార్ములా ఈ రేస్. పెట్టుబడులు తెచ్చే ప్రయత్నంలో భాగంగానే ఫార్ములా ఈ రేస్ ఏర్పాటు చేస్తే దానిపై విషం చిమ్ముతున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో రెండు సార్లు కోర్టుకు హాజ‌ర‌య్యారు. కోర్టుకు నేను సహకరిస్తాను.. ఎన్నిసార్లు పిలిచినా వచ్చి విచారణకు హాజరవుతాను అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement