త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR Farm house | కేసీఆర్ ఫామ్ హౌజ్ చుట్టూ ఉన్న భూముల వివ‌రాలివే.. య‌జ‌మానులు వీరే

KCR Farm house | రాష్ట్ర రాజకీయాల్లో ఎర్రవెల్లి భూముల వ్యవహారం పొలిటికల్ హీట్‌ను పెంచిన సంగ‌తి తెలిసిందే. 325 సర్వే నెంబర్.. 388 ఎకరాలపై అధికార, ప్రతిపక్ష నేత‌ల మ‌ధ్య‌ ఆరోపణలు, ప్రత్యారోపణలు తారాస్థాయికి చేరుకున్నాయి.

S

Telangana | Published On Sep 18, 2026, 12.32 pm IST

KCR Farm house | కేసీఆర్ ఫామ్ హౌజ్ చుట్టూ ఉన్న భూముల వివ‌రాలివే.. య‌జ‌మానులు వీరే
Advertisement

KCR Farm house | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర రాజకీయాల్లో ఎర్రవెల్లి భూముల వ్యవహారం పొలిటికల్ హీట్‌ను పెంచిన సంగ‌తి తెలిసిందే. 325 సర్వే నెంబర్.. 388 ఎకరాలపై అధికార, ప్రతిపక్ష నేత‌ల మ‌ధ్య‌ ఆరోపణలు, ప్రత్యారోపణలు తారాస్థాయికి చేరుకున్నాయి. రాజ‌కీయ ఆరోప‌ణ‌లు ఇలా ఉంటే.. మ‌రోవైపు రెవెన్యూ అధికారులు ఆ భూముల లెక్క తేల్చే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు.

ఎర్రవెల్లి ఫాం హౌస్‌లో 325 సర్వే నెంబర్‌కు సంబంధించిన 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని ఈ భూముల లెక్క తెల్చాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. మొదటి రోజు ఎర్రవెల్లి, శివార వెంకటాపూర్, యూసుబ్ గానిపల్లి- గంగాపూర్, వరదరాజ్ పూర్ గ్రామ శివార్ల‌లో 2 గంటల పాటు అధికారులు సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. రెండో రోజు మర్కుక్ తహశీల్దార్ కార్యాలయంలో భూ రికార్డుల ఫైల్స్ పరిశీలిస్తున్నారు. సర్వే నెంబర్ 325 లో సుమారు 388 ఎకరాల ప్రభుత్వ భూమి కి సంబంధించిన వివరాల పై ఆరా తీస్తున్నారు.

అయితే 325 సర్వే నెంబర్‌లో రైతులకు అసైన్డ్ చేయబడిన భూములను ఇటీవలే అధికారులు 22 ఏలో చేర్చుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జాబితా ప్ర‌కారం.. కేసీఆర్ ఫామ్ హౌఐజ్ చుట్టూ ఉన్న భూముల వివ‌రాలు.. య‌జ‌మానుల పేర్లు ఈ విధంగా ఉన్నాయి.

Advertisement
Advertisement