త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IndiGo | ఇండిగో ప్రయాణికులకు షాక్.. పెరిగిన ఛార్జీలు..

IndiGo | ఇండిగో విమాన ప్రయాణికులకు అదనపు భారం పడనుంది. దేశీయ విమాన ప్రయాణాల్లో పలు రకాల అదనపు ఛార్జీలను ఇండిగో పెంచినట్లు సీఎన్‌బీసీ టీవీ18 వెల్లడించింది. టికెట్ ధరకు అదనంగా ఈ కొత్త ఛార్జీలు వర్తించనున్నాయి. దేశీయ విమానాల్లో ప్రయాణించే శిశువులకు సంబంధించిన ఛార్జీని ఇండిగో పెంచింది.

S

Business | Published On Sep 18, 2026, 12.02 pm IST

IndiGo | ఇండిగో ప్రయాణికులకు షాక్.. పెరిగిన ఛార్జీలు..
Advertisement

IndiGo | ఇండిగో విమాన ప్రయాణికులకు అదనపు భారం పడనుంది. దేశీయ విమాన ప్రయాణాల్లో పలు రకాల అదనపు ఛార్జీలను ఇండిగో పెంచినట్లు సీఎన్‌బీసీ టీవీ18 వెల్లడించింది. టికెట్ ధరకు అదనంగా ఈ కొత్త ఛార్జీలు వర్తించనున్నాయి. దేశీయ విమానాల్లో ప్రయాణించే శిశువులకు సంబంధించిన ఛార్జీని ఇండిగో పెంచింది. ఇంతకుముందు ఉన్న ఛార్జీతో పోలిస్తే శిశు ప్రయాణికుల రుసుమును రూ.1వేయి నుంచి రూ.3వేల వరకు పెంచింది.

అదనపు ల‌గేజ్ పై కూడా ఛార్జీ పెరిగింది. అదనపు ల‌గేజ్‌కు కిలోకు రూ.700గా ఉన్న రుసుమును రూ.800కు పెంచింది. దీంతో నిర్ణీత పరిమితికి మించి ల‌గేజ్ ను తీసుకెళ్లే ప్రయాణికులపై అదనపు భారం పడనుంది. అదేవిధంగా ప్రాధాన్యత చెక్-ఇన్, బోర్డింగ్ సేవలకు సంబంధించిన ఛార్జీని కూడా ఇండిగో పెంచింది. ఈ రుసుమును రూ.650కు పెంచినట్లు తెలిపింది. టికెట్ ధరకు ఇవన్నీ అదనపు ఛార్జీలుగా వర్తిస్తాయని ఇండిగో పేర్కొంది. దీంతో విమాన టికెట్ బుక్ చేసుకునే సమయంలో ప్రయాణికులు ప్రాథమిక టికెట్ ధరతోపాటు వర్తించే అదనపు సేవా రుసుములను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement