త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Air India Express | విమానం 36 వేల అడుగుల‌ ఎత్తులో ఉండ‌గా.. ఇంజిన్‌-1లో త‌గ్గిపోయిన ఆయిల్‌

Air India Express | కొచ్చి నుంచి అబుదాబి బ‌య‌ల్దేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) విమానంలో సాంకేతిక స‌మ‌స్య త‌లెత్తింది. విమానం దాదాపు 36 వేల అడుగులు ఎత్తులో ప్ర‌యాణిస్తుండ‌గా ఇంజిన్‌లోని ఆయిల్ స్థాయిలు ఒక్క‌సారిగా ప్ర‌మాద‌క‌ర‌స్థాయికి ప‌డిపోయింది (fall in the oil quantity of Engine 1).

D

National | Published On Sep 7, 2026, 3.54 pm IST

Air India Express | విమానం 36 వేల అడుగుల‌ ఎత్తులో ఉండ‌గా.. ఇంజిన్‌-1లో త‌గ్గిపోయిన ఆయిల్‌
Advertisement

Air India Express | త్రినేత్ర‌.న్యూస్ : ఎయిర్ ఇండియా (Air India) సంస్థ‌కు చెందిన ఎక్స్‌ప్రెస్ విమానంలో సాంకేతిక స‌మ‌స్య త‌లెత్తింది. విమానం గాల్లో ఉండ‌గా ఇంజిన్‌లోని ఆయిల్ స్థాయి ఒక్క‌సారిగా ప‌డిపోయింది (fall in the oil quantity of Engine 1). దీంతో అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది విమానాన్ని కొచ్చి ఎయిర్‌పోర్టులో ఎమ‌ర్జెన్సీ ల్యాండ్ చేశారు.

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) బోయింగ్ 737 విమానం సోమ‌వారం ఉద‌యం కేర‌ళ‌లోని కొచ్చి ఎయిర్‌పోర్టు నుంచి అబుదాబికి (Cochin To Abu Dhabi) బ‌య‌ల్దేరింది. టేకాఫ్ అయిన 50 నిమిషాల త‌ర్వాత విమానం దాదాపు 36,000 అడుగుల ఎత్తులో ప్ర‌యాణిస్తోంది. ఆ స‌మ‌యంలో మొద‌టి ఇంజిన్‌లో ఆయిల్ స్థాయిలు త‌గ్గ‌డాన్ని పైల‌ట్‌, కో పైల‌ట్ గ‌మ‌నించారు. కాసేప‌టికే ఆయిల్ పరిమాణం మ‌రింత త‌గ్గింది. ప‌రిస్థితి ప్ర‌మాద‌క‌రంగా మార‌డంతో ఇంజిన్‌ను ఆపేశారు. అయితే, ఒకే ఇంజిన్‌తో అబుదాబి వెళ్ల‌డం క‌ష్టంగా భావించిన పైల‌ట్‌.. విమానాన్ని వెన‌క్కి మ‌ళ్లించాల‌ని నిర్ణ‌యించారు.

వెంట‌నే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు స‌మాచారం ఇచ్చారు. ఒకే ఇంజిన్ సాయంతో దాదాపు 45 నిమిషాలు ప్ర‌యాణించిన విమానం చివ‌రికి సుర‌క్షితంగా కొచ్చి ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది. ఈ ఘ‌ట‌న‌తో విమాన సిబ్బంది, ప్ర‌యాణికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. అయితే, విమానం సేఫ్‌గా ల్యాండ్ కావ‌డంతో ఊపిరిపీల్చుకున్నారు. ఆ స‌మ‌యంలో విమానంలో ఎంత‌మంది ప్ర‌యాణికులు, సిబ్బంది ఉన్నార‌న్న దానిపై క్లారిటీ లేదు. ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది.

Also Read..

నా రిటైర్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారా..? ఆరావళిపై హైప‌వ‌ర్ కమిటీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్

రేవంత్ ముక్కు నేలకు రాసినా క్షమించని నేరం చేసిండు

ఐక్యూ జ‌డ్11ఎక్స్‌ఏ 5జి వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..

Advertisement
Advertisement