త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | 22ఏ సమస్యల పరిష్కారం కోసం హైలెవల్ కమిటీ ఏర్పాటు

Ponguleti Srinivas Reddy | రాష్ట్రంలో 22ఏ సమస్యల పరిష్కారం కోసం ముగ్గురు అధికారులతో హైలెవల్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన‌ట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శాస‌న‌స‌భా వేదిక‌గా ప్ర‌క‌టించారు.

S

Telangana | Published On Sep 18, 2026, 12.43 pm IST

Ponguleti Srinivas Reddy | 22ఏ సమస్యల పరిష్కారం కోసం హైలెవల్ కమిటీ ఏర్పాటు
Advertisement

Ponguleti Srinivas Reddy | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో 22ఏ సమస్యల పరిష్కారం కోసం ముగ్గురు అధికారులతో హైలెవల్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన‌ట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శాస‌న‌స‌భా వేదిక‌గా ప్ర‌క‌టించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైలెవల్ కమిటీకు ఛైర్మన్‌గా సీసీఎల్‌ఏ కమిషనర్​ను నియమించింది.

ఈ ఉన్నత స్థాయి కమిటీకి చైర్మన్‌గా సీసీఎల్‌ఏ కమిషనర్ లోకేశ్ కుమార్‌, సభ్యులుగా లా సెక్రటరీ పాపిరెడ్డి, స్టాంప్స్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు వ్యవహరించనున్నారు. ఈ కమిటీ నిషేధిత భూముల జాబితాలోని అంశాలపై సమగ్రంగా చర్చించి, క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించేందుకు తగిన కార్యాచరణను రూపొందించనుంది.

ఎల్బీన‌గ‌ర్‌లో 9 వేల ప్లాట్ల‌కు గ్రీన్ సిగ్న‌ల్

ఎల్బీనగర్‌లో 9 వేల ప్లాట్లకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న జీవో 118 భూముల సమస్యకు పరిష్కారం చూపింది. ఈ మేర‌కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శాస‌న‌స‌భ‌లో ప్ర‌క‌ట‌న చేశారు. మంత్రి ప్ర‌క‌ట‌న‌తో గత 15, 20 ఏళ్లుగా ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు భారీ ఊరట లభించినట్లైంది. క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న వారి అర్జీలను త్వరలోనే పరిష్కరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జీవోను కూడా విడుదల చేసింది.

Advertisement
Advertisement