Air India Flight | మత్తులోనే ఎయిర్ ఇండియా పైలట్.. ఏఏఐబీ దర్యాప్తులో వెల్లడి!
Air India Flight | ఆగస్టు 4న ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ2379 విమానం తీవ్ర కుదుపులకు గురైన విషయం తెలిసిందే. ఒక్కసారిగా విమానం 300 అడుగుల మేర కిందకు దిగడంతో ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటనపై ఏఏఐబీ చేపట్టిన దర్యాప్తులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
Air India Flight | ఆగస్టు 4న ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ2379 విమానం తీవ్ర కుదుపులకు గురైన విషయం తెలిసిందే. ఒక్కసారిగా విమానం 300 అడుగుల మేర కిందకు దిగడంతో ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటనపై ఏఏఐబీ చేపట్టిన దర్యాప్తులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. విమాన పైలట్ మధ్యం సేవించినట్లు దర్యాప్తు సంస్థ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సిబ్బందిలో ఒకరి సైకోఆక్టివ్ పదార్థాల పరీక్షలో నెగెటివ్ ఫలితం రాలేదని వెల్లడించింది. ఘటన సమయంలో ఎయిర్‌బస్ ఏ320 మోడల్‌కు చెందిన ఎయిర్ ఇండియా విమానంలో ఇద్దరు పైలట్లు, ఆరుగురు క్యాబిన్ సిబ్బందితో కలిపి మొత్తం 145 మంది ఉన్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో విమానం దిగిన అనంతరం 24 మంది ప్రయాణికులకు వైద్య సాయం అందించారు. వీరిలో నలుగురికి తీవ్ర గాయాలైనట్లు 10 పేజీల ప్రాథమిక నివేదికలో ఏఏఐబీ పేర్కొంది.
విమానం ఒక్కసారిగా కిందికి పడిపోవడంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా.. పైలట్ సైకోఆక్టివ్ పదార్థాలు వినియోగించినట్లు నిర్ధారణ కావడం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని ఏఏఐబీ పేర్కొంది. ఈ వ్యవహారంలో డీజీసీఏ తగిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. విమాన సిబ్బంది సైకోఆక్టివ్ పదార్థాలను దుర్వినియోగం చేయకుండా నిరోధించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించింది. పైలట్ మద్యం సేవించినట్లు తేలడంతో ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని ఏఏఐబీ స్పష్టం చేసింది. ఘటనకు సంబంధించిన సాంకేతిక, ఇతర అంశాలపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది. ఈ వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకుంటామని డీజీసీఏ కూడా హెచ్చరించింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Fire breaks out at Hospital | ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 9 మంది నవజాత శిశువులు సహా..
- ●KTR | లక్సెంబర్గ్ వెంచర్ డేస్‌లో ఉపన్యాసమివ్వండి.. కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం
- ●Giorgia Meloni | మెలోనీ సరికొత్త రికార్డు.. ఇటలీ చరిత్రలోనే అత్యధిక కాలం పనిచేసిన ప్రభుత్వంగా రికార్డు
- ●Harish Rao | వెయ్యి రోజుల పాలనలో అభివృద్ధి మటుమాయమైంది.. వెయ్యి పడగలతో అవినీతి రాజ్యమేలుతోంది
- ●Harish Rao | తాగునీరు లేక విద్యార్థుల అవస్థలు.. కాగజ్‌నగర్ ఎస్టీ బాయ్స్ ఆశ్రమ పాఠశాలను సందర్శించిన హరీశ్ రావు
- ●Uttam Kumar Reddy | సమ్మక్క సారక్క బ్యారేజీకి ఎన్ఓసీ ఇవ్వండి.. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి

Fire breaks out at Hospital | ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 9 మంది నవజాత శిశువులు సహా..

KTR | లక్సెంబర్గ్ వెంచర్ డేస్‌లో ఉపన్యాసమివ్వండి.. కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం

Giorgia Meloni | మెలోనీ సరికొత్త రికార్డు.. ఇటలీ చరిత్రలోనే అత్యధిక కాలం పనిచేసిన ప్రభుత్వంగా రికార్డు

Harish Rao | వెయ్యి రోజుల పాలనలో అభివృద్ధి మటుమాయమైంది.. వెయ్యి పడగలతో అవినీతి రాజ్యమేలుతోంది






