EC orders special drive | సర్ తర్వాత ఓటర్ల జాబితాలో పేరు లేదా..? ప్రత్యేక డ్రైవ్‌కు ఈసీ ఆదేశం
EC orders special drive | కేంద్ర ఎన్నికల సంఘం (EC) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్ల జాబితా నుంచి పేరు గల్లంతైన వారికి మరో అవకాశం కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది (EC orders special drive).
EC orders special drive | త్రినేత్ర న్యూస్ : కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) దేశ వ్యాప్తంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతయ్యాయంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్ల జాబితా నుంచి పేరు గల్లంతైన వారికి మరో అవకాశం కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది. ఓటర్ల జాబితా సవరణ పూర్తైన రాష్ట్రాల్లో ఈ డ్రైవ్ నిర్వహించాలని రాష్ట్రాల ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది.
ఈ డ్రైవ్‌లో భాగంగా బూత్ స్థాయి అధికారులు (BLOs) ప్రస్తుత ఓటర్ల జాబితాలను, SIR ప్రక్రియకు ముందున్న పాత జాబితాలతో క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. పాత జాబితాలో ఓటు ఉండి సర్ తర్వాత కనిపించని వారి జాబితాను సిద్ధం చేస్తారు. ఆ తర్వాత బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి ఆయా వ్యక్తుల ప్రస్తుత పరిస్థితిని తెలుసుకుని అర్హులైన వారి పేర్లను ఫారం-6 ద్వారా మళ్లీ ఓటరుగా నమోదు చేయనున్నారు. ఈ ప్రక్రియ నెలరోజుల్లోగా పూర్తి చేయాలని ఈసీ ఆదేశించింది. ప్రతి వారం కనీసం 20-25 మంది ఓటర్ల ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించేలా బూత్ లెవెల్ ఆఫీసర్‌లను ఎన్నికల సంఘం ఆదేశించింది.
జాబితాలో పేర్లు లేనివారు, మొదటిసారి ఓటు హక్కు పొందేవారు, యువ ఓటర్ల నమోదు కోసం ఫారమ్-6ను అక్కడికక్కడే పూర్తి చేసేలా బీఎల్‍వోలు చర్యలు తీసుకోనున్నారు. ఓటర్ల నమోదు అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని ఎన్నికల సంఘం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. SIR ప్రక్రియ సమయంలో పేరు రాలేదన్న కారణంతో ఏ ఒక్క అర్హత గల పౌరుడు కూడా ఓటు హక్కును కోల్పోకూడదని నొక్కిచెప్పింది.
కాగా, దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్ ప్రక్రియలో భాగంగా దాదాపు 13 కోట్ల మంది పేర్లు జాబితా నుంచి గల్లంతైన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతిపక్షాలు ఈసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు దేశ వ్యాప్త ఆందోళనలకు సైతం పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం తాజా నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read..
భారత్-సౌదీ మధ్య సముద్రగర్భ విద్యుత్ లైన్.. రూ.80 వేల కోట్ల ప్రాజెక్ట్..
ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపుకు మోదీ వద్ద మంచి ఆలోచనలు ఉన్నాయ్ : పుతిన్
సంబంధిత వార్తలు

Telangana CEO Form 6 Declaration | ఓటర్లకు సీఈవో కీలక ఆదేశాలు: ఆ ఒక్కటి లేకుంటే ఓటు కట్
అక్టోబర్ 1, 2026

Danam Nagendar | హైదరాబాద్‌ల మామూల్గ ఉండదు.. ఎలక్షన్ కమిషన్ తగలబడిపోతది
అక్టోబర్ 1, 2026

INDIA bloc | జ్ఞానేశ్ రాజీనామా చేయాల్సిందే.. ‘సేవ్ డెమొక్రసీ’ నిరసనలకు పిలుపునిచ్చిన ఇండీ కూటమి
సెప్టెంబర్ 30, 2026
తాజావార్తలు
- ●Ramchandar Rao | మీ ఆరోపణలు పక్కనబెట్టి.. ప్రజలు ఏం సంపాదించుకున్నరో చెప్తే బాగుంటది
- ●CM Vijay | బస్సు కండక్టర్‌గా సీఎం విజయ్.. స్వయంగా టికెట్లు ఇచ్చి
- ●ISRO | గువాహటికి ఇస్రో కొత్త కేంద్రం.. అంతరిక్ష భద్రతకు మరింత బలం..
- ●Captain Smit Machchhar | 140 కోట్ల మంది భారతీయుల గౌరవాన్ని పెంచారు.. పైలట్ స్మిత్‌తో ప్రధాని మోదీ
- ●Raghunandan Rao | రేవంత్, కేటీఆర్ ఆస్తులపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: రఘునందన్ రావు
- ●Poland | భారత్‌తో రక్షణ బంధం.. కీలక నిర్ణయం తీసుకున్న పోలాండ్..

Ramchandar Rao | మీ ఆరోపణలు పక్కనబెట్టి.. ప్రజలు ఏం సంపాదించుకున్నరో చెప్తే బాగుంటది

CM Vijay | బస్సు కండక్టర్‌గా సీఎం విజయ్.. స్వయంగా టికెట్లు ఇచ్చి

ISRO | గువాహటికి ఇస్రో కొత్త కేంద్రం.. అంతరిక్ష భద్రతకు మరింత బలం..

Captain Smit Machchhar | 140 కోట్ల మంది భారతీయుల గౌరవాన్ని పెంచారు.. పైలట్ స్మిత్‌తో ప్రధాని మోదీ



