Revanth Reddy | ఆదిలాబాద్‌లో ఎయిర్‌లైన్ హ్యాంగర్స్ ఏర్పాటు చేయండి.. రాజ్‌నాథ్ సింగ్‌కి సీఎం రేవంత్ విజ్ఞప్తి
Revanth Reddy | ఆదిలాబాద్‌లో ఎయిర్‌లైన్ హ్యాంగర్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు (Rajnath Singh) సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) విజ్ఞప్తి చేశారు.
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: ఆదిలాబాద్‌లో ఎయిర్‌లైన్ హ్యాంగర్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు (Rajnath Singh) సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుల్లో ఒకటైన ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ, యుటిలిటీస్ బదలాయింపు వంటి అంశాల్లో పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌తో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించినందుకుగాను కృతజ్ఞతలు తెలిపారు.
దేశ సమగ్రత, రక్షణకు సంబంధించిన అంశమైనందున రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తామని చెప్పారు. ఆదిలాబాద్‌లో రానున్న భారతీయ వాయు సేన ఎయిర్‌పోర్ట్‌ను భారీగా విస్తరిస్తున్న నేపథ్యంలో.. టెర్మినల్‌తోపాటు ప్రయాణికుల సౌకర్యార్ధం నిర్మించనున్న పౌర విమానయాన శాఖకు చెందిన టెర్మినల్ బిల్డింగ్‌ను, కార్గో, ఎంఆర్‌వో (MRO), హ్యాంగర్ (Hanger) సౌకర్యాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేలా సహకరించాలని కోరారు. ఇటీవల మధ్య ప్రాచ్యంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎయిర్‌లైన్స్ తమ హ్యాంగర్స్‌ను ఏర్పాటు చేసుకోవడానికి అత్యంత అనుకూలమైన ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను ఆ దిశగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలో డీఆర్‌డీవో, డీఆర్‌డీఎల్ ఎంచుకున్న ప్రదేశంలో వారికి సంబంధించిన కీలకమైన ప్రాజెక్ట్‌ను త్వరగా మంజూరు చేయాలని కోరారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●MP Chamala, Jupally | రోప్ వే పనులు త్వరగా పూర్తి చేయండి
- ●SK Hynix | శాంసంగ్‌ను దాటేసిన ఎస్కే హైనిక్స్.. ఒకప్పుడు అప్పుల ఊబిలో, ఇప్పుడు మేటి సంస్థగా..
- ●Ukrainian Drones | రష్యాపై మరోసారి డ్రోన్ల దాడి
- ●India-America Defense | భారత్‌కు రక్షణ సహకారం.. రూ.4,500 కోట్ల సైనిక ప్యాకేజీకి అమెరికా ఆమోదం
- ●Ai Plus Nova | ఏఐ ప్లస్ నోవా 2 నియో, నోవా 2 ప్రో 5జీ ఫోన్లు లాంచ్.. ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ..
- ●Ramchandar Rao | బీజేపీలోకి మెగాస్టార్ చిరంజీవి?

MP Chamala, Jupally | రోప్ వే పనులు త్వరగా పూర్తి చేయండి

SK Hynix | శాంసంగ్‌ను దాటేసిన ఎస్కే హైనిక్స్.. ఒకప్పుడు అప్పుల ఊబిలో, ఇప్పుడు మేటి సంస్థగా..

Ukrainian Drones | రష్యాపై మరోసారి డ్రోన్ల దాడి

India-America Defense | భారత్‌కు రక్షణ సహకారం.. రూ.4,500 కోట్ల సైనిక ప్యాకేజీకి అమెరికా ఆమోదం






