Ramakrishna Rao | సీఎస్ రామకృష్ణా రావుకు మళ్లీ ఎక్స్ టెన్షన్?
Ramakrishna Rao | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావుకు మరోసారి పదవీకాలం పొడగించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన పదవీ కాలాన్ని రెండు సార్లు కేంద్రం పొడగించింది. ఈ సారి పదవీకాలం పొడగిస్తే అది మూడో సారి అవుతుంది. దేశంలో అరుదైన అతికొద్ది పదవీకాలం పొడగింపుల్లో ఇది ఒకటిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Ramakrishna Rao | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావుకు మరోసారి పదవీకాలం పొడగించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన పదవీ కాలాన్ని రెండు సార్లు కేంద్రం పొడగించింది. ఈ సారి పదవీకాలం పొడగిస్తే అది మూడో సారి అవుతుంది. దేశంలో అరుదైన అతికొద్ది పదవీకాలం పొడగింపుల్లో ఇది ఒకటిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతేడాది ఆగస్టు 31న రామకృష్ణారావు పదవీ కాలం ముగిసింది. అయితే ఆయనను కొనసాగించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో ఏడు నెలలు కేంద్రం పొడిగించింది. ఈ ఏడాది మార్చి 31న ఆ సమయం కూడా ముగియగా మరింత కాలం పొడిగించాలని మరోసారి రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించటంతో ఆ గడువు జూన్ 30న ముగియనుంది. ఈ నేపథ్యంలో పదవీ కాలం మరోసారి పొడగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ ప్రక్రియ, జనగణన నేపథ్యంలో పొడగింపుకు కేంద్రం కూడా సానుకూలంగా ఉందని అంచనా వేస్తున్నారు. మరికాసేపట్లో రామకృష్ణారావు ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలోనే మకాం వేయడంతో ఈ పర్యటన కీలకంగా మారింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●MP Chamala, Jupally | రోప్ వే పనులు త్వరగా పూర్తి చేయండి
- ●SK Hynix | శాంసంగ్‌ను దాటేసిన ఎస్కే హైనిక్స్.. ఒకప్పుడు అప్పుల ఊబిలో, ఇప్పుడు మేటి సంస్థగా..
- ●Ukrainian Drones | రష్యాపై మరోసారి డ్రోన్ల దాడి
- ●India-America Defense | భారత్‌కు రక్షణ సహకారం.. రూ.4,500 కోట్ల సైనిక ప్యాకేజీకి అమెరికా ఆమోదం
- ●Ai Plus Nova | ఏఐ ప్లస్ నోవా 2 నియో, నోవా 2 ప్రో 5జీ ఫోన్లు లాంచ్.. ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ..
- ●Ramchandar Rao | బీజేపీలోకి మెగాస్టార్ చిరంజీవి?

MP Chamala, Jupally | రోప్ వే పనులు త్వరగా పూర్తి చేయండి

SK Hynix | శాంసంగ్‌ను దాటేసిన ఎస్కే హైనిక్స్.. ఒకప్పుడు అప్పుల ఊబిలో, ఇప్పుడు మేటి సంస్థగా..

Ukrainian Drones | రష్యాపై మరోసారి డ్రోన్ల దాడి

India-America Defense | భారత్‌కు రక్షణ సహకారం.. రూ.4,500 కోట్ల సైనిక ప్యాకేజీకి అమెరికా ఆమోదం






