త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Train Ticket | రైళ్ల‌లో ఇక టిక్కెట్ లేకుండా ప్ర‌యాణిస్తే రెట్టింపు జ‌రిమానా.. జూలై 1 నుంచి కొత్త రూల్స్‌..

Train Ticket | రైళ్ల‌లో టిక్కెట్లు లేకుండా ప్ర‌యాణం చేస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌. ఎందుకంటే ఇక‌పై అలా ప్ర‌యాణం చేస్తే రెట్టింపు మొత్తంలో జ‌రిమానా విధిస్తారు. ఈ మేర‌కు భార‌తీయ రైల్వే కొత్త రూల్స్‌ను అమ‌లు చేయ‌నుంది. ప్ర‌స్తుతం టిక్కెట్ లేకుండా ప్ర‌యాణించే వారిపై రూ.250 జరిమానా విధిస్తుండ‌గా, ఆ మొత్తాన్ని రూ.500కు పెంచింది.

S

Business | Published On Jun 22, 2026, 1.21 pm IST

Train Ticket | రైళ్ల‌లో ఇక టిక్కెట్ లేకుండా ప్ర‌యాణిస్తే రెట్టింపు జ‌రిమానా.. జూలై 1 నుంచి కొత్త రూల్స్‌..
Advertisement

Train Ticket | రైళ్ల‌లో టిక్కెట్లు లేకుండా ప్ర‌యాణం చేస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌. ఎందుకంటే ఇక‌పై అలా ప్ర‌యాణం చేస్తే రెట్టింపు మొత్తంలో జ‌రిమానా విధిస్తారు. ఈ మేర‌కు భార‌తీయ రైల్వే కొత్త రూల్స్‌ను అమ‌లు చేయ‌నుంది. ప్ర‌స్తుతం టిక్కెట్ లేకుండా ప్ర‌యాణించే వారిపై రూ.250 జరిమానా విధిస్తుండ‌గా, ఆ మొత్తాన్ని రూ.500కు పెంచింది. స‌వ‌రించిన నిబంధ‌న‌ల‌ను జూలై 1 నుంచి అమ‌లు చేయ‌నున్నారు. ఇక ప‌లు ఇత‌ర నిబంధ‌న‌ల్లోనూ కీల‌క మార్పులు చోటు చేసుకున్నాయి. చెల్లుబాటు కానీ లేదా ఇప్ప‌టికే వినియోగించిన టిక్కెట్టుతో తిరిగి రైలులో ప్ర‌యాణిస్తే టిక్కెట్ చార్జీల‌తోపాటు అద‌నంగా రూ.500 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. అంత‌కు ముందు ఇది కూడా రూ.250గా ఉండేది. ఇప్పుడు రెట్టింపు చేశారు.

ఏయే సంద‌ర్భాల్లో ఎంత జ‌రిమానా..

ఇత‌రుల పేరిట టిక్కెట్ కొని ప్ర‌యాణిస్తే ఆ టిక్కెట్టు చెల్ల‌దు. ప్ర‌యాణికుడు అలాంటి సంద‌ర్భాల్లోనూ రూ.500 జ‌రిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ జ‌రిమానా చెల్లించ‌క‌పోతే చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటారు. అనుమ‌తి లేకుండా ప్ర‌యాణికులు లేదా విక్రేత‌లు రైళ్ల‌లో లేదా రైల్వే స్టేష‌న్‌లో తినుబండారాలు, ఇత‌ర వ‌స్తువుల‌ను విక్ర‌యించ‌రాదు. నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే రూ.2వేల జ‌రిమానా విధిస్తారు. అలాగే రైల్వే కోచ్‌ల‌లో, స్టేష‌న్‌ల‌లో భిక్షాట‌న‌ను నిషేధించారు. ఏడాదిలో ప‌దే ప‌దే రైల్వే నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే అలాంటి వారికి జైలు శిక్ష విధిస్తారు. రైల్వే స్టేష‌న్‌లో లేదా రైలు ప్ర‌యాణంలో తోటి ప్ర‌యాణికుల‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించినా, దూషించినా అలాంటి వారికి భారీగా జరిమానాలు విధిస్తారు. అలాగే మ‌హిళ‌ల‌కు కేటాయించిన బెర్త్‌లు, కోచ్‌ల‌లో పురుషులు ప్ర‌వేశించినా, ప్ర‌యాణం చేసినా అలాంటి వారికి రూ.2500 వ‌ర‌కు జరిమానా విధిస్తారు. స‌వ‌రించిన ఈ నిబంధ‌న‌ల‌ను జూలై 1 నుంచి అమ‌లు చేయ‌నున్నారు.

Advertisement
Advertisement