Dera Baba | జర్నలిస్ట్ హత్య కేసు.. డేరా బాబాను నిర్దోషిగా ప్రకటించిన కోర్టు
Dera Baba |2002లో జరిగిన జర్నలిస్ట్ హత్య కేసులో (Journalist Murder Case) డేరా సచ్చా సౌదా అధినేత (Dera Sacha Sauda Chief) గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (Gurmeet Ram Rahim Singh)కు ఊరట లభించింది.
Dera Baba |2002లో జరిగిన జర్నలిస్ట్ హత్య కేసులో (Journalist Murder Case) డేరా సచ్చా సౌదా అధినేత (Dera Sacha Sauda Chief) గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (Gurmeet Ram Rahim Singh)కు ఊరట లభించింది. ఈ కేసులో డేరా బాబాను హర్యానా హైకోర్టు (Haryana High Court) నిర్దోషిగా తేల్చింది. ఇక ఈ కేసులో డేరా బాబాకు జీవితఖైదు పడిన విషయం తెలిసిందే. దీంతో ఏడేళ్లుగా శిక్ష అనుభవిస్తున్నారు. అయితే, ఈ కేసుపై విచారణ జరిపిన హర్యానా హైకోర్టు గతంలో విధించిన జీవిత ఖైదు శిక్షను రద్దు చేసింది. ఇదే కేసులో మరో ఇద్దరు చేసిన అప్పీల్‌ను కోర్టు తిరస్కరించింది. జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ విక్రమ్ అగర్వాల్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది.
ఇదీ కేసు నేపథ్యం..
హర్యానాలోని సిర్సాలో ఉన్న డేరా ప్రధాన కార్యాలయంలో మహిళా అనుచరులపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి రామ్ చందర్ ఛత్రపతి అనే జర్నలిస్ట్ తన పూరా సచ్ పత్రికలో ప్రచురించారు. ఆ తర్వాత ఛత్రపతిని తన ఇంటి వెలుపల దుండుగులు కాల్చి చంపారు. ఈ హత్యకు సంబంధించి 2019లో డేరా బాబాతోపాటూ మరో ముగ్గురిని కోర్టు దోషులుగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. ఈ కేసులోనే హర్యానా కోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. మరోవైపు డేరా బాబా ప్రస్తుతం ఇద్దరు శిష్యులపై అత్యాచారానికి పాల్పడిన కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ఆయన హర్యానాలోని రోహ్‌తక్ సమీపంలోగల సునారియా జైలులో ఉన్నారు.
Also Read..
Gold And Silver Rates Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. యుద్ధం ఎఫెక్ట్ మొదలైందా..?
Bear Market | 5 రోజుల్లో రూ.19 లక్షల కోట్లు ఆవిరి.. బేర్ మార్కెట్ ప్రారంభమైందా..?
Maoists | సీఎం రేవంత్ రెడ్డి ముందు లొంగిపోనున్న 124 మంది మావోయిస్టులు
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Waking up at 3 am | రోజూ ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య మెలకువ వస్తోందా? మీ బాడీ ఇస్తున్న వార్నింగ్ ఇదే!
- ●Pradeep Rawat | టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత - రాజమౌళి సినిమాతో ఫేమస్ - ఐదు భాషల్లో సినిమాలు
- ●CM Revanth Reddy | పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
- ●Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం
- ●Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం
- ●TGIIC Land Auction 2026 | ఎకరం కనీస ధర రూ.175 కోట్లు.. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో TGIIC భారీ ఈ-వేలం!

Waking up at 3 am | రోజూ ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య మెలకువ వస్తోందా? మీ బాడీ ఇస్తున్న వార్నింగ్ ఇదే!

Pradeep Rawat | టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత - రాజమౌళి సినిమాతో ఫేమస్ - ఐదు భాషల్లో సినిమాలు

CM Revanth Reddy | పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం




