Gold And Silver Rates Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. యుద్ధం ఎఫెక్ట్ మొదలైందా..?
Gold And Silver Rates Today | ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతుండడంతో పసిడి, వెండి ధరలు ఆకాశాన్నంటుతాయని పెట్టుబడిదారులు భావించారు. కానీ ఆశ్చర్యకరంగా ఆయా లోహాల ధరలు గత 5 రోజుల ట్రేడింగ్ సెషన్లలోనూ కాస్త తగ్గాయి. అయితే శుక్రవారం నాటి ట్రేడింగ్ సెషన్ అనంతరం శనివారం మాత్రం వాటి ధరలు స్వల్పంగా పెరిగాయి.
Gold And Silver Rates Today | ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతుండడంతో పసిడి, వెండి ధరలు ఆకాశాన్నంటుతాయని పెట్టుబడిదారులు భావించారు. కానీ ఆశ్చర్యకరంగా ఆయా లోహాల ధరలు గత 5 రోజుల ట్రేడింగ్ సెషన్లలోనూ కాస్త తగ్గాయి. అయితే శుక్రవారం నాటి ట్రేడింగ్ సెషన్ అనంతరం శనివారం మాత్రం వాటి ధరలు స్వల్పంగా పెరిగాయి. దీంతో ఈ లోహాల ధరలపై యుద్ధం ఎఫెక్ట్ మొదలైనట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు. బంగారం, వెండి ధరలు భారీగా పెరగడం ఖాయమని అంటున్నారు. యుద్ధం తీవ్రతరం కావడం, చమురు ధరలు పెరగడంతో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులవైపు మొగ్గు చూపుతున్నారని, కనుక ఆయా లోహాల ధరలు వచ్చే వారం పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక శనివారం బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
బంగారం, వెండి ధరలు..
శుక్రవారంతో పోలిస్తే 24 క్యారెట్ల 100 గ్రాముల బంగారం ధర రూ.25,100 పెరిగింది. ప్రస్తుతం దీని ధర రూ.16,36,400గా ఉంది. 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,640 ఉండగా, 8 గ్రాముల బంగారం ధర రూ.1,30,912గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ.16,364గా ఉంది.
అలాగే 22 క్యారెట్ల బంగారం 100 గ్రాముల ధర రూ.23వేలు పెరిగింది. ప్రస్తుతం దీని ధర రూ.15 లక్షలుగా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1.50 లక్షలు ఉండగా, 8 గ్రాముల ధర రూ.1.20 లక్షలు, 1 గ్రాము ధర రూ.15వేలుగా ఉంది.
అదేవిధంగా 18 క్యారెట్ల బంగారం 100 గ్రాముల ధర రూ.18,800 పెరిగింది. దీని ధర ప్రస్తుతం రూ.12,27,300గా ఉంది. ఇక 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,22,730 ఉండగా, 8 గ్రాముల ధర రూ.98,184, 1 గ్రాము ధర రూ.12,273గా ఉంది.
కాగా వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. వెండి కిలో రూ.2,85,000 ఉండగా, తులం ధర రూ.2,850గా ఉంది.
ఎంసీఎక్స్‌లో ఎలా..
ఎంసీఎక్స్‌లో ఏప్రిల్‌కు చెందిన గోల్డ్ ఫ్యూచర్ కాంట్రాక్టు ధరలో 1.25 శాతం మేర పెరుగుదల చోటు చేసుకుంది. 2002 పాయింట్ల మేర పెరిగింది. శుక్రవారం రాత్రి మార్కెట్ ముగిసే సమయానికి 1,61,675.00 వద్ద ఉంది. అలాగే ఎంసీఎక్స్‌లో మే నెలకు చెందిన సిల్వర్ ఫ్యూచర్ కాంట్రాక్టులో 2.43 శాతం ధర పెరిగింది. 6378 పాయింట్ల పెరుగుదల నమోదైంది. శుక్రవారం రాత్రి మార్కెట్ ముగిసే సమయానికి 2,68,569.00 వద్ద ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Pradeep Rawat | టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత - రాజమౌళి సినిమాతో ఫేమస్ - ఐదు భాషల్లో సినిమాలు
- ●CM Revanth Reddy | పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
- ●Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం
- ●Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం
- ●TGIIC Land Auction 2026 | ఎకరం కనీస ధర రూ.175 కోట్లు.. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో TGIIC భారీ ఈ-వేలం!
- ●Fertilizer | తెలంగాణలో ఎరువుల కొరత లేదు.. వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

Pradeep Rawat | టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత - రాజమౌళి సినిమాతో ఫేమస్ - ఐదు భాషల్లో సినిమాలు

CM Revanth Reddy | పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం

Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం






