Mallu Ravi | పేదలకు ఇండ్లు కట్టిస్తున్నందుకు రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహా?: కేటీఆర్‌కు మల్లు రవి కౌంటర్
Mallu Ravi | ఎంతో కష్టపడి, త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రానికి ఒక తెలంగాణ (Telangana) ద్రోహి ముఖ్యమంత్రిగా ఉన్నారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలకు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి (Mallu Ravi) కౌంటర్ ఇచ్చారు.
Mallu Ravi | త్రినేత్ర.న్యూస్: ఎంతో కష్టపడి, త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రానికి ఒక తెలంగాణ (Telangana) ద్రోహి ముఖ్యమంత్రిగా ఉన్నారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలకు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి (Mallu Ravi) కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డిని (Revanth Reddy) తెలంగాణ ద్రోహి కేటీఆర్ అంటున్నారని, ఆయన ముఖ్యమంత్రిగా ప్రజాపాలన చేస్తున్నారు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నారని తెలిపారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి మల్లు రవి మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రజలకు స్వేచ్ఛాయుత పాలన అందిస్తున్నారి చెప్పారు. కేసీఆర్ పాలనలో నిర్బంధాలు విధించారని విమర్శించారు. పది సంవత్సరాలలో తెలంగాణకు ద్రోహం చేసిన నాయకుడు కేసీఆర్ అని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు బిక్కు బిక్కుమంటూ భయపడ్డారని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి కుటుంబంలో తండ్రి లాగ ప్రజలకోసం పని చేస్తున్నారని వెల్లడించారు.
రాష్ట్రంలో కులగణన నిర్వహించి, అసెంబ్లీలో తీర్మాణం చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రానికి బిల్లు పంపించిందుకా రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని ప్రశ్నించారు. పదేండ్లు మీరు ప్రభుత్వంలో ఉండి కులగణన చేయకుండా కాకిలెక్కలతో ఒక్కరోజులో చేశారని కేటీఆర్‌పై మండిపడ్డారు. 99 రోజుల కార్యక్రమం పెట్టి ప్రజల దగ్గరకు ప్రభుత్వాన్ని పంపించారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అని స్వయంగా కేసీఆర్ అన్నారని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా సామాజిక న్యాయం కోసం పాటుపడుతుందని స్పష్టం చేశారు
మహిళలకు ఉచిత రవాణా, ఆర్థిక స్వావలంబన కోసం రేవంత్ రెడ్డి కృషి చేశారన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారని, ఒకేరోజు లక్ష ఇండ్ల గృహ ప్రవేశం చేసి చరిత్ర సృష్టించారని చెప్పారు. రెండున్నరేండ్లలో 70 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణాలు చేస్తున్నారని వెల్లడించారు.
పేదలకు సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారని తెలిపారు. రెండు గదులు ఇండ్లు కట్టిస్తున్నందుకు, రూ.500కే గ్యాస్, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇలా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న రేవంత్ రెడ్డి ద్రోహి నా?. ప్రజలను వంచించి పదేళ్లు రాష్ట్రాన్ని ఆగమాగం చేసిన కేసీఆర్ ద్రోహినా? అని ప్రశ్నించారు. ప్రజలు అర్థం చేసుకున్నారని తెలిపారు. అందుకే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో, 2024 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో, రెండు ఉప ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌కు తగిన బుద్ధి చెప్పారన్నారు.
నాగర్ కర్నూల్ ఎంపీ శ్రీ మల్లు రవి గారి ప్రెస్ మీట్ - గాంధీభవన్ https://t.co/iKc1QypVu3
— Telangana Congress (@INCTelangana) June 4, 2026
తాజావార్తలు
- ●Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హఠాన్మరణం
- ●Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..
- ●Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..
- ●Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హఠాన్మరణం

Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..

Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..

Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?






