త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NEET Aspirant Suicide | మ‌ళ్లీ ప‌రీక్ష రాయాలంటే భ‌యంగా ఉంది.. మ‌రో నీట్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌

NEET Aspirant Suicide | నీట్ పరీక్ష మరో విద్యార్థిని ప్రాణం (NEET Aspirant Suicide) తీసింది. గ‌త రెండు రోజుల్లో 12వ త‌ర‌గ‌తి టాప‌ర్ స‌హా మ‌రో విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం మ‌రువ‌క ముందే తాజాగా త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూర్‌లో (Coimbatore) ఓ విద్యార్థిని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది.

G

National | Published On Jun 18, 2026, 10.21 am IST

NEET Aspirant Suicide | మ‌ళ్లీ ప‌రీక్ష రాయాలంటే భ‌యంగా ఉంది.. మ‌రో నీట్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌
Advertisement

NEET Aspirant Suicide | త్రినేత్ర‌.న్యూస్‌: నీట్ పరీక్ష మరో విద్యార్థిని ప్రాణం (NEET Aspirant Suicide) తీసింది. గ‌త రెండు రోజుల్లో 12వ త‌ర‌గ‌తి టాప‌ర్ స‌హా మ‌రో విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం మ‌రువ‌క ముందే తాజాగా త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూర్‌లో (Coimbatore) ఓ విద్యార్థిని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది.

నీట్ ప‌రీక్ష ఒత్తిడి (NEET re-examination) త‌ట్టుకోలేక‌ కోయంబత్తూరుకు చెందిన అనుకీర్తన (Anu Keerthana-19) ఆత్మహత్య చేసుకుంది. ఇప్పటికే రెండుసార్లు నీట్ రాసిన కీర్త‌న‌.. ఇటీవల పేపర్ లీక్ కారణంగా పరీక్ష రద్దు కావడంతో తీవ్ర మనోవేదనకు గురైంది. మళ్లీ పరీక్ష రాయాల్సి రావడంతో ఒత్తిడికిలోనై ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆత్మ‌హ‌త్య‌కు ముందు త‌న మేన‌మాతో స‌హా మ‌రికొంద‌రు ద‌గ్గ‌రి బంధువుల‌కు కీర్త‌న వాట్సాప్ మెసేజ్ పంపించింది. `నేను నీట్ ప‌రీక్ష రాశాను. మెడిక‌ల్ కాలేజీలో చేరేందుకు వేచి చూస్తున్నాను. కానీ ప‌రీక్ష ర‌ద్దయింది. ఇప్పుడు నేను మ‌ళ్లీ ప‌రీక్ష రాయాలంటే భ‌యంగా ఉంది. ఇప్ప‌టికే మా నాన్న నా కోసం చాలా డ‌బ్బులు ఖ‌ర్చు చేశారు. ఆయ‌న మొహాన్ని ఎలా చూడాలో నాకు తెలియ‌డం లేదు` అని అందులో పేర్కొంది.

ఈ మెసేజ్‌ను చూసిన బంధువులు వెంట‌నే ఆమె ఇంటికి వెళ్లారు. ఆమె త‌న గ‌ది త‌ప్పులు కొట్టిన‌ప్ప‌టికీ తెర‌వ‌క‌పోవ‌డంతో దానిని బ‌ద్ద‌కొట్టారు. అయితే అప్ప‌టికే విషం తీసుకున్న ఆమె అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లింది. దీంతో హుటాహుటిన ద‌వాఖాన‌కు తీసుకెళ్లిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేకుండా పోయింది.

Dehradun NEET Aspirant and Class 12 Topper Dies By Suicide

డెహ్రాడూన్‌లో స్కూల్ టాప‌ర్‌..

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో 12వ తరగతిలో స్కూల్ టాపర్‌గా నిలిచిన 23 ఏళ్ల యువతి తన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చదువుల ఒత్తిడిని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడిన ఆమె.. "ఐ లవ్ యూ మమ్మీ, పాపా" అంటూ రాసిన సూసైడ్ నోట్ రాసింది. ఆమె 1999 కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడిన ఓ రిటైర్డ్ ఆర్మీ జవాను కుమార్తె కావడం గమనార్హం.

మృతురాలి పేరు రియా కుమారి థాపా. మంగళవారం మధ్యాహ్నం భోజనానికి పిలిచేందుకు తల్లి ఆమె రూమ్ దగ్గరికి వెళ్లడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లి ఎంతసేపు పిలిచినా లోపలి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఆమె తలుపులు కూడా తీయకపోవడంతో అనుమానం వచ్చి వెంటనే తండ్రికి సమాచారం ఇచ్చింది. కుటుంబ సభ్యులు కంగారుగా తలుపులు పగలగొట్టి లోపలికి చూడగా, అప్పటికే రియా ఉరివేసుకుని విగతజీవిగా కనిపించింది.

రాజ‌స్థాన్‌లో..

రాజస్థాన్‌లో ఉమేష్ (22) అనే నీట్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. `నన్ను క్షమించండి.. నేను చాలా దూరం వెళ్లిపోతున్నాను` అంటూ సూసైడ్ నోట్ రాసి బ‌ల‌వ‌న్మ‌ర‌ణం చెందాడు. దేశంలో నీట్ పరీక్షల చుట్టూ జరుగుతున్న వివాదాలు, విద్యార్థుల్లో పెరుగుతున్న మానసిక వేదనకు ఈ ఘటనే సజీవ సాక్ష్యమని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, దేశవ్యాప్తంగా నీట్ రీఎగ్జామ్ ఈనెల 21న జరగనుంది.

Advertisement
Advertisement