Delhi Govt | ఉద్యోగులు సొంత వాహనాలను వదిలి.. మెట్రోలో ప్రయాణించండి.. ఢిల్లీ ప్రభుత్వం పొదుపుబాట
Delhi Govt | ఢిల్లీలోని సీఎం రేఖా గుప్తా ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు సొంత వాహనాలను వదిలి.. మెట్రో, బస్సుల్లో ప్రయాణించాలని సూచించింది.
Delhi Govt | ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇంధన పొదుపు (save fuel) చేయాలంటూ దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించిన విషయం తెలిసిందే. మోదీ విన్నపం నేపథ్యంలో ఢిల్లీలోని సీఎం రేఖా గుప్తా ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు సొంత వాహనాలను వదిలి.. మెట్రో, బస్సుల్లో ప్రయాణించాలని సూచించింది.
కార్‌పూలింగ్‌ను అలవాటు చేసుకోండి..
మంత్రులు సైతం పొదుపు సూత్రాన్ని పాటించాలని విన్నవించింది. కార్‌పూలింగ్‌ను ఒక అలవాటుగా మార్చుకోవాలని సూచించింది. క్షేత్రస్థాయి పర్యటనలు, తనిఖీలు, ప్రారంభోత్సవాల సమయంలో అధికారులు వేర్వేరు వాహనాల్లో వెళ్లకుండా.. ఒకే వాహనాన్ని వాడుకోవాలని చెప్పింది. ప్రయాణాలను మానుకొని.. వర్చువల్ సమావేశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది.
ఇంధన పొదుపు ప్రజా ఉద్యమంగా మారాలి..
మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ శాఖల అధికారులు తమ అధికారిక వాహనాల వినియోగాన్ని తగ్గించుకోవాలని సీఎం రేఖా గుప్తా (CM Rekha Gupta) సూచించారు. ప్రైవేట్ వాహనాలకు బదులుగా బస్సులు, మెట్రో సేవలను ఉపయోగించుకోవాలని తెలిపారు. ఇంధన పొదుపు అనేది ఒక ప్రజా ఉద్యమంగా మారాలని పిలుపునిచ్చారు. దేశ ప్రయోజనం కోసం మనం పాటించే చిన్నిపాటి నియమాలు పెద్ద మార్పును తీసుకొస్తాయని నొక్కి చెప్పారు.
కాలుష్యం కూడా తగ్గుతుంది..
ఢిల్లీ, రాజధాని ప్రాంతం అంతటా మెట్రో రైళ్లు, డీటీసీ బస్సులు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ప్రజా రవాణాను ఎక్కువగా ఉపయోగించడం వల్ల పెట్రోల్, డీజిల్ చాలా వరకూ ఆదా అవుతుందన్నారు. అంతేకాదు, రాజధానిలో ట్రాఫిక్ రద్దీ, ముఖ్యంగా కాలుష్య స్థాయిలు కూడా గణనీయంగా తగ్గుతాయని సీఎం రేఖా గుప్తా అభిప్రాయపడ్డారు. అంతేకాదు, అధికారులు, మంత్రులు విదేశీ పర్యటనలను కూడా వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అధికారిక లేదా వ్యక్తిగత కారణాలతో విదేశాలకు వెళ్లకూడదని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే మంజూరైన విదేశీ పర్యటనల సెలవులను సైతం రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఈ నిబంధనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
Also Read..
నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్ల వివాదం - రామ్‌చరణ్ పెద్దిపై ఎఫెక్ట్ - మెగా ఫ్యాన్స్‌లో టెన్షన్
కరీంనగర్‌లో నగల దుకాణం దోపిడీ కేసులో పురోగతి.. ముగ్గురు నిందితుల అరెస్టు
బండి భగీరథ్ కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి.. కరీంనగర్‌లో వెలసిన పోస్టర్లు
సంబంధిత వార్తలు

PM Modi SRCC Speech | 13 ఏళ్ల తర్వాత అదే వేదిక.. మళ్లీ అదే ‘గ్లాస్’ కథ.. ఆ కాలేజీలో ప్రధాని మోదీ ఆసక్తికర ప్రసంగం
సెప్టెంబర్ 6, 2026

PM Modi | మంచి వక్త కావాలంటే ఏం చేయాలి..? మోదీ ప్రశ్నకు టీచర్ సమాధానం.. నవ్వేసిన ప్రధాని..!
సెప్టెంబర్ 5, 2026

PM Modi | పిల్లల్ని డిజిటల్ వ్యసనం నుంచి బయటపడేయాలి.. ఉపాధ్యాయులకు ప్రధాని మోదీ సూచన
సెప్టెంబర్ 5, 2026
తాజావార్తలు
- ●Ananthika | మార్షల్ ఆర్ట్స్‌తో క్రమశిక్షణ : అనంతిక
- ●Harish Rao | వార్డు మెంబర్ కూడా కాని.. తిరుపతి రెడ్డికి రూ. 40 కోట్లతో భద్రత అవసరమా..?
- ●Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్.. రేవంతే రాజీనామా చేయాలి
- ●KCR | బూతులు మాట్లాడేవారితో చర్చా.. అసెంబ్లీకి కాదు.. ప్రజల్లోకి వెళ్దాం
- ●Malvika Sharma | ఇంత ప్రేమ దక్కుతుందని ఊహించలేదు.. అభిమానుల రెస్పాన్స్‌కు మాళవిక శర్మ ఫిదా..!
- ●Kayadu Lohar | పొడవాటి జడ.. ట్రెడిషనల్ లుక్.. కయదు అదుర్స్!

Ananthika | మార్షల్ ఆర్ట్స్‌తో క్రమశిక్షణ : అనంతిక

Harish Rao | వార్డు మెంబర్ కూడా కాని.. తిరుపతి రెడ్డికి రూ. 40 కోట్లతో భద్రత అవసరమా..?

Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్.. రేవంతే రాజీనామా చేయాలి

KCR | బూతులు మాట్లాడేవారితో చర్చా.. అసెంబ్లీకి కాదు.. ప్రజల్లోకి వెళ్దాం



