Karimnagar PMJ Jewellery Case | కరీంనగర్ నగల దుకాణం దోపిడీ కేసులో పురోగతి.. ముగ్గురు నిందితుల అరెస్టు
Karimnagar PMJ Jewellery Case | దాదాపు పది రోజుల తర్వాత కరీంనగర్ నగల దోపిడీ కేసులో పురోగతి లభించింది. ఎట్టకేలకు ముగ్గురి నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ దోపిడీ కేసులో సుబోధ్ సింగ్ ప్రధాన నిందితుడని వారు తెలిపారు.
Karimnagar PMJ Jewellery Case | త్రినేత్ర.న్యూస్: దాదాపు పది రోజుల తర్వాత కరీంనగర్ నగల దోపిడీ కేసులో పురోగతి లభించింది. ఎట్టకేలకు ముగ్గురి నిందితులను గురువారం అరెస్టు చేశారు. ఈ దోపిడీ కేసులో సుబోధ్ సింగ్ ప్రధాన నిందితుడని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ అలం తెలిపారు. బంగారం వ్యాపారితో పాటు నిందితులను అరెస్టు చేశామని వెల్లడించారు. మొత్తం 161 తులాల బంగారం, 112 క్యారెట్ల వజ్రాభరణాలు, 82 క్యారెట్ల బంగారం చోరీ చేశారని తెలిపారు.
పశ్చిమ బెంగాల్ అమ్ముకున్న దొంగలు..
చోరీ అనంతరం దుండగులు కరీంనగర్ నుంచి బీహార్ అటునుంచి పశ్చిమ బెంగాల్ కు పారిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్ లో ఓ బంగారు వ్యాపారికి నగలు అమ్మారని చెప్పారు. సదరు వ్యాపారితో పాటు ముగ్గురి నిందితులను అరెస్టు చేసినట్లు వివరించారు. పరారీలో ఉన్న మరో నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. పట్టుబడిన నిందితులను, బంగారాన్ని తెలంగాణకు తీసుకొస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
నగల దుకాణంలో జరిగిన చోరీలో 13 మంది నిందితులు పాల్గొన్నారు. దోపిడీకి ముందు నిందితులు ధర్మపురిలో ఆశ్రయం పొందారు. చోరీ తర్వాత 3 బృందాలుగా విడిపోయి ధర్మపురి వద్ద వాహనాలు వదిలి పరారయ్యారు. రైలు, బస్సు ద్వారా తప్పించుకునేందుకు యత్నించారు. నిందితుల వద్ద నుంచి ఇప్పటి వరకు రూ.51 వేలు, 2 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. రెండు నెలల క్రితమే నాలుగు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి చివరికి కరీంనగర్‌లో దోపిడీ చేశారు. బీహార్, బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో సుబోధ్ సింగ్ ముఠా చోరీలకు పాల్పడింది. తెలంగాణలో ఇలాంటి తరహా దోపిడీ జరగడం మొదటిసారి అని సీపీ గౌస్ అలం వివరించారు.
ఈనెల మొదటి వారంలో కరీంనగర్ పట్టణంలోని జ్యోతి నగర్ ఉన్న పీఎంజే జ్యువెలరీ షోరూమ్ లో ఐదుగురు దొంగలు కస్టమర్ల వేషంలో లోపలికి ప్రవేశించారు. గన్స్‌తో సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసి ఏడెనిమిది రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ముగ్గురు నుండి నలుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించారు. దొంగలు పెద్దపల్లిలో బస చేసినట్లు, నకిలీ గుర్తింపు కార్డులు ఉపయోగించినట్లు సీపీ గౌస్ ఆలం పేర్కొన్నారు.
కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్
నిందితుల నుంచి పిస్టల్స్, వెహికల్స్, భారీగా ఆభరణాలు సీజ్
నగలు దోచుకొని బైకులపై మహారాష్ట్ర నుంచి బెంగాల్‌కు పరారైన దొంగలు
బిహార్, బెంగాల్లో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
బీహార్‌కు చెందిన ది గోల్డెన్ థీఫ్… https://t.co/QDS7Ra219O pic.twitter.com/mI7rKZ2ymN
— Telugu Scribe (@TeluguScribe) May 14, 2026
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●KCR | సాగునీటి కోసం మరో యుద్ధానికి సిద్ధం : కేసీఆర్
- ●Ananthika | మార్షల్ ఆర్ట్స్‌తో క్రమశిక్షణ : అనంతిక
- ●Harish Rao | వార్డు మెంబర్ కూడా కాని.. తిరుపతి రెడ్డికి రూ. 40 కోట్లతో భద్రత అవసరమా..?
- ●Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్.. రేవంతే రాజీనామా చేయాలి
- ●KCR | బూతులు మాట్లాడేవారితో చర్చా.. అసెంబ్లీకి కాదు.. ప్రజల్లోకి వెళ్దాం
- ●Malvika Sharma | ఇంత ప్రేమ దక్కుతుందని ఊహించలేదు.. అభిమానుల రెస్పాన్స్‌కు మాళవిక శర్మ ఫిదా..!

KCR | సాగునీటి కోసం మరో యుద్ధానికి సిద్ధం : కేసీఆర్

Ananthika | మార్షల్ ఆర్ట్స్‌తో క్రమశిక్షణ : అనంతిక

Harish Rao | వార్డు మెంబర్ కూడా కాని.. తిరుపతి రెడ్డికి రూ. 40 కోట్లతో భద్రత అవసరమా..?

Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్.. రేవంతే రాజీనామా చేయాలి




