Tollywood | నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్ల వివాదం – రామ్‌చరణ్ పెద్దిపై ఎఫెక్ట్ – మెగా ఫ్యాన్స్‌లో టెన్షన్
ఎగ్జిబిటర్లు, నిర్మాతల వివాదం రోజురోజుకు మరింత తీవ్రమవుతోంది. పర్పెంటేజ్ విధానం అమలు చేయాల్సిందేనని ఎగ్జిబిటర్లు వాదిస్తుండగా... నిర్మాతలు మాత్రం ససేమిరా అంటున్నారు. పర్సెంటేజ్ వివాదం ఎఫెక్ట్ రామ్ చరణ్ పెద్ది రిలీజ్‌పై గట్టిగానే పడే అవకాశం ఉన్నట్లు ప్రచారంజరుగుతోంది.
Entertainment | Published On May 14, 2026, 12.25 pm IST
Tollywood | పర్సెంటేజ్ షేరింగ్ విధానానికి సంబంధించి గత కొద్ది రోజులుగా టాలీవుడ్ నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు మధ్య వివాదం నడుస్తోంది. సింగిల్ స్క్రీన్స్‌లో పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలని... లేదంటే థియేటర్ల మనుగడ కష్టమవుతోందని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. పర్సెంటేజ్ విధానానికి అంగీకరించకపోతే ప్రభుత్వం నుంచి జీవోలు తెచ్చిన సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్ ధరలను పెంచేది లేదని హెచ్చరించారు. ఎగ్జిబిటర్ల డిమాండ్స్‌పై టాలీవుడ్ ప్రొడ్యూసర్లు రియాక్ట్ అయ్యారు.
పెద్ది టైమ్‌లో...
ప్రస్తుతం ఎగ్జిబిటర్లు మాత్రమే కాదు...నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కూడా కష్టాల్లోనే ఉన్నారని, ఒకరికొకరు సపోర్ట్ ఉండాల్సిన టైమ్‌లో ఇలా వివాదాలకు దిగడం కరెక్ట్ కాదని నిర్మాతలు వాదిస్తున్నారు. రామ్‌చరణ్ పెద్ది లాంటి భారీ బడ్జెట్ మూవీ రిలీజ్ టైమ్‌లో ఇలా సమస్యలు సృష్టిస్తే అందరికి నష్టాలే మిగలడం తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదని అంటున్నారు.
హరిహరవీరమల్లు టైమ్‌లో...
"'హరి హర వీరమల్లు' విడుదల సమయంలో పర్సెంటేజీ సమస్య తెరపైకి వచ్చింది. అప్పటినుంచి ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. ఇన్ని సినిమాలకు లేని సమస్య మళ్ళీ ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఇప్పుడే జరిగిపోవాలని ఎందుకు పట్టుబడుతున్నారు? ఇలా చేయడం కరెక్ట్ కాదు" అని పెద్ది నిర్మాత రవిశంకర్ పేర్కొన్నారు.
కండీషన్లు పెట్టడం ఏంటి?
ఎగ్జిబిటర్లు కండీషన్లు పెట్టడం వల్ల నిర్మాతల నుంచి ఇంకా కంటెంట్ తగ్గిపోతుంది తప్ప, దాని వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదని సూర్యదేవర నాగవంశీ అన్నారు. "చాలా మంది నిర్మాతలవి 50 శాతానికి పైగా షూటింగ్ అయిపోయిన సినిమాలు కనీసం 25 వరకు ఉన్నాయి. వీటిలో చిన్న, పెద్ద అన్ని సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే 70-80 శాతం బడ్జెట్ ఖర్చు పెట్టి ఉన్నాము. ఇలాంటి సమయంలో కొత్త విధానం తీసుకొస్తామంటే అది సబబుగా ఉండదు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న సినిమాల విషయంలో ఆ విధానాన్ని అంగీకరించలేము. కొత్తగా నిర్మించబోయే సినిమాల విషయంలో ఈ విధానంపై ఆలోచిస్తాము" అని సూర్యదేవర నాగవంశీ అన్నారు.
ఒక పెద్ద ఎగ్జిబిటర్, ఆయనకు 300 మల్టీప్లెక్స్ లు ఉన్నాయి. ఎన్నో సింగిల్ స్క్రీన్ థియేటర్ల ఆదాయానికి గండి కొడుతున్న అలాంటి ఆయన.. సింగిల్ స్క్రీన్ థియేటర్ల కష్టాల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా అనిపించదని సునీల్ నారంగ్‌పై నాగవంశీ సెటైర్లు వేశారు. ప్రతిసారీ ఒక పెద్ద సినిమా వస్తున్నప్పుడు ఏదో ఒక ఆటంకం కలిగిద్దామనే ఉద్దేశంతో చేస్తున్నట్టుగా అనిపిస్తుందని సాహు గారపాటి అన్నారు.
పెద్దిపై ఎఫెక్ట్ తప్పదా?
ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య వివాదం అటు తిరిగి ఇటు తిరిగి మైత్రీ మూవీ మేకర్స్ వర్సెస్ ఎగ్జిబిటర్లుగా మారింది. పర్సెంటేజ్ విధానాన్ని ప్రధానంగా మైత్రీ నిర్మాతలే వ్యతిరేకిస్తున్నారని ఎగ్జిబిటర్లు ఆగ్రహంతో ఉన్నారు. ఈ వివాదం ఎఫెక్ట్ రామ్ చరణ్ పెద్దిపై గట్టిగానే పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. జూన్ 4న రామ్‌చరణ్ పెద్ది రిలీజ్ కాబోతుంది. దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో వృద్ది సినిమాస్‌తో కలిసి మైత్రీ మూవీస్ ఈ సినిమాను నిర్మించింది. ఎగ్జిబిటర్లు ఎక్కువగా మైత్రీ మూవీస్‌నే టార్గెట్ చేసిన నేపథ్యంలో....పెద్ది రిలీజ్ టైమ్‌లోగా ఈ సమస్య పరిష్కారం అవుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
రిలీజ్ అవుతుందా?
రామ్‌చరణ్ పెద్దికి రెండు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వొచ్చు. కానీ పర్సెంటేజ్ విధానానికి అంగీకరించకపోతే పెంచిన ధరలను సింగిల్ స్క్రీన్స్‌లో అమలు చేయమని అంటున్నారు. అదే జరిగితే ఓపెనింగ్స్ భారీగా తగ్గుతాయి. మరోవైపు రెవెన్యూ షేరింగ్ అమలులో ఉన్న సింగిల్ స్క్రీన్స్‌లో తమ కంటెంట్‌ను ప్రదర్శించమని నిర్మాతలు పట్టుపడుతున్నారు. దాంతో పెద్ది సింగిల్ స్క్రీన్స్‌లో రిలీజ్ అవుతుందా? లేదా? అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఫస్ట్ డే ఫస్ట్ షోలలో మల్టీప్లెక్స్‌లతో పోలిస్తే సింగిల్ స్క్రీన్స్‌లోనే హంగామా ఎక్కువగా కనిపిస్తుంది. ఓపెనింగ్ కలెక్షన్స్ కూడా నైజాంలో మల్టీప్లెక్స్‌లతో పోలిస్తే సింగిల్ స్క్రీన్స్ నుంచే ఎక్కువగా వస్తాయి. అందులో రామ్‌చరణ్ వంటి మాస్ హీరో సినిమా అంటే ఫస్ట్ మూడు రోజులు సింగిల్ స్క్రీన్స్ చాలా వరకు హౌజ్‌ఫుల్స్ ఉంటాయి. ఈ వివాదం ఇలాగే కొనసాగితే సందడితో పాటు కలెక్షన్స్ మిస్సయ్యే అవకాశాలు ఉంటాయి. దాంతో మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. చరణ్ సినిమాను టార్గెట్ చేసి ఈ వివాదాన్ని సృష్టిస్తున్నారని టాలీవుడ్ పెద్దలపై ఫైర్ అవుతున్నారు. పర్సెంటేజ్ వివాదం చిరంజీవి వద్దకు చేరుకోనున్నట్లు సమాచారం. ఎగ్జిబిటర్లు, నిర్మాతలు వేర్వేరుగా చిరంజీవిని కలవనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిరు జోక్యంతోనైనా ఈ కాంట్రవర్సీకి పుల్‌స్టాప్ పడుతుందా? లేదా? అన్నది చూడాల్సిందే.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



