Paradise OTT | ఓటీటీలోకి నాని ప్యారడైజ్ – ఎక్స్ట్రా సీన్లతో నాలుగు భాషల్లో రిలీజ్
కెరీర్ కెరీర్లో ఓ విభిన్నమైన ప్రయత్నంగా ది ప్యారడైజ్ మూవీ నిలిచింది.డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ మూవీ 275 కోట్లకుపైగా వసూళ్లతో కమర్షియల్ హిట్‌గా నిలిచింది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ది ప్యారడైజ్ ఓటీటీలోకి వస్తోంది. అక్టోబర్ 22 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది.
Entertainment | Published On Oct 17, 2026, 4.06 pm IST
Paradise OTT | నాని హీరోగా నటించిన ది ప్యారడైజ్ మూవీ నెగెటివ్ టాక్‌తో సూపర్ హిట్‌గా నిలిచింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాలో కయదు లోహర్ హీరోయిన్గా నటించింది. కీర్తి సురేష్ ఓ స్పెషల్ సాంగ్ చేసింది. నాని కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీగా ది ప్యారడైజ్ మూవీ దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. తొలిరోజు నుంచే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్. ఈ విమర్శలతో సంబంధం లేకుండా నాని మూవీ బాక్సాఫీస్ వద్ద 275 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది.
నాలుగు భాషల్లో...
ప్యారడైజ్ మూవీ ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను థియేట్రికల్ రిలీజ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తాజాగా అక్టోబర్ 22 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్యారడైజ్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల అవుతోంది. థియేట్రికల్ వెర్షన్‌తో పోలిస్తే ఓటీటీలో కొన్ని మార్పులతో ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు సమాచారం. కొన్ని కొత్త సీన్లతో పాటు ఓ పాటను యాడ్ చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి.
సీనియర్ నటుడు విలన్‌గా
ది ప్యారడైజ్ మూవీలో టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్‌బాబు విలన్‌గా నటించగా...రాఘవ్ జుయాల్, సంపూర్ణేష్‌బాబు, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. నాని తల్లి పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సోనాలి కులకర్ణి కనిపించింది. అనిరుధ్ మ్యూజిక్ అందించాడు. అణిచివేతకు గురైన తమ జాతి కోసం పోరాటం సాగించిన ఓ యువకుడి కథతో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను తెరకెక్కించారు. ప్యారడైజ్‌లో జడల్ పాత్ర కోసం నాని మేకోవర్, ట్రాన్స్ఫర్మేషన్ అయిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. సోనాలి కులకర్ణి, మోహన్‌బాబుతో పాటు కేసీఆర్‌ను పోలిన పాత్రలో ప్రియదర్శి నటనకు ప్రశంసలు వచ్చాయి. ఎమోషనల్ కనెక్టివిటీ మిస్సవ్వడంతో పాటు సినిమాలో వయలెన్స్ ఎక్కువగా ఉందనే విమర్శలు వచ్చాయి.
సమ్మక్క పోరాటం...
సమ్మక్క (సోనాలి కులకర్ణి) సవారీ జాతికి చెందిన ఓ మహిళ. తన జాతి వాళ్లతో కలిసి ప్యారడైజ్ అనే ఏరియాలో బతుకుతుంటుంది. తమ జాతి గుర్తింపు కోసం సమ్మక్క సాగిస్తోన్న పోరాటాన్ని అడ్డుకుంటుంటాడు శిఖంజా మాలిక్(మోహన్‌బాబు). సవారీ జాతిని బానిసల్లా చూస్తుంటాడు. సవారీ ప్రజలకు నాయకుడిగా తన కొడుకు జడల్ (నాని) ఉండాలని సమ్మక్క కలలు కంటుంది. కానీ చిన్నతనంలోనే ఓ హత్య చేసి జైలుకు వెళతాడు. జైలు నుంచి విడుదలైన జడల్ శిఖాంజా మాలిక్‌తో అతడి కొడుకు విక్రమ్ మాలిక్‌లను ఎందుకు టార్గెట్ చేశాడు? తల్లి త్యాగం గురించి జడల్‌కు ఎలా తెలిసింది? జడల్ ఎదుగుదలను సహించని శిఖంజా మాలిక్ ఎలాంటి ఎత్తు వేశాడు? జడల్ పోరాటంలో అతడికి అండగా నిలిచిన సుబ్బలక్ష్మి (కయదు లోహర్) తో పాటు ఎమ్మెల్యే శంకరన్న (ప్రియదర్శి) ఎవరు? తల్లి సమ్మక్క కోరినట్లుగానే సవారీ జాతికి జడల్ గుర్తింపును తీసుకొచ్చాడా? లేదా? అన్నదే ప్యారడైజ్‌లో మిగిలిన కథ.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

OTT Releases | శుక్రవారం ఒక్కరోజే ఓటీటీలో 30 సినిమాలు రిలీజ్ – ఒక్కోటి ఒక్కో జానర్
అక్టోబర్ 16, 2026

Aafia Sayed | నితిన్ అలియాస్ రుక్మిణికి హీరోయిన్ దొరికిందోచ్ – బాలీవుడ్ బ్యూటీ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా!
అక్టోబర్ 13, 2026

Rukmini Vasanth | వరుసగా ఎనిమిది ఫ్లాప్‌లు – అయినా ఛాన్స్‌లు – హీరో నాని ప్రేమకథలో రుక్మిణి వసంత్
అక్టోబర్ 13, 2026
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | ప్రయాణికుల రద్దీని బట్టి అదనపు బస్సులు
- ●MLA Anirudh Reddy | కోమటిరెడ్డి కోసం ప్రాణాలిస్తా.. నీళ్లను తరలిస్తే ఆయనతోనే యుద్ధం చేస్తా
- ●Govind Mohan | దేశంలో స్వదేశీ ఉగ్రవాదం దాదాపు అంతమైపోయింది : హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్
- ●RS Praveen Kumar | ఖేలో ఇండియా గేమ్స్.. గిరిజన బిడ్డలకు అవమానమే
- ●CJI Justice Surya Kant | న్యాయం కోసం ధైర్యంగా నిలబడాలి
- ●IRDAI | లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు ఐఆర్డీఏఐ ఊరట.. ప్రీమియం చెల్లింపులకు రుణాలు..

Ponnam Prabhakar | ప్రయాణికుల రద్దీని బట్టి అదనపు బస్సులు

MLA Anirudh Reddy | కోమటిరెడ్డి కోసం ప్రాణాలిస్తా.. నీళ్లను తరలిస్తే ఆయనతోనే యుద్ధం చేస్తా

Govind Mohan | దేశంలో స్వదేశీ ఉగ్రవాదం దాదాపు అంతమైపోయింది : హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్

RS Praveen Kumar | ఖేలో ఇండియా గేమ్స్.. గిరిజన బిడ్డలకు అవమానమే



