త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jacqueline Fernandez | జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఊరట.. వర్క్ వీసా రెన్యూవల్‌కు కోర్టు గ్రీన్ సిగ్నల్

Jacqueline Fernandez | బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. వర్క్ వీసా పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకునేందుకు ఆమెకు న్యాయస్థానం నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌ (ఎన్‌ఓసీ) జారీ చేసింది. వీసా రెన్యూవల్‌ కోసం సంబంధిత అధికారులను ఆశ్రయించేందుకు కోర్టు అనుమతించింది.

P

Entertainment | Published On Oct 7, 2026, 9.15 pm IST

Jacqueline Fernandez | జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఊరట.. వర్క్ వీసా రెన్యూవల్‌కు కోర్టు గ్రీన్ సిగ్నల్
Advertisement

Jacqueline Fernandez | బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. వర్క్ వీసా పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకునేందుకు ఆమెకు న్యాయస్థానం నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌ (ఎన్‌ఓసీ) జారీ చేసింది. వీసా రెన్యూవల్‌ కోసం సంబంధిత అధికారులను ఆశ్రయించేందుకు కోర్టు అనుమతించింది. అదనపు సెషన్స్‌ జడ్జి గగన్‌దీప్‌ సింగ్‌ అక్టోబర్‌ 6న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీలంక పౌరురాలైన జాక్వెలిన్‌ 2009 నుంచి ఉద్యోగ వీసాపై భారత్‌లో ఉంటున్నారని కోర్టు పేర్కొంది. ప్రస్తుతం ఆమె వీసా గడువు ముగిసిందని తెలిపింది.

భారత్‌లోనే పలు ప్రొఫెషనల్‌ కమిట్‌మెంట్స్‌

జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ వినోద రంగంలో చురుకుగా పనిచేస్తున్నారని, భారత్‌లో ఆమెకు పలు వృత్తిపరమైన బాధ్యతలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. మనీలాండరింగ్‌ కేసులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆమె కోర్టు విచారణకు హాజరు కావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. వీసా పునరుద్ధరణ కోసం 2025 ఫిబ్రవరి 20న శ్రీలంక కాన్సులేట్‌కు తన పాస్‌పోర్ట్‌ను రీ-ఇష్యూ కోసం సమర్పించినట్లు కోర్టు దృష్టికి వచ్చింది. అయితే, కోర్టు నుంచి ఎన్‌ఓసీ లేకుండా వర్క్‌ వీసాను రెన్యూవల్‌ చేయడానికి ఫారినర్స్‌ రీజినల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌ (ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ) అంగీకరించడం లేదని జాక్వెలిన్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

రూ.200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు

ఇదిలా ఉంటే.. రూ.200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేశ్‌ చంద్రశేఖర్‌తో పాటు మరో 15 మందిపై ఢిల్లీ కోర్టు జూన్‌లో అభియోగాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజా దరఖాస్తును పరిశీలించిన కోర్టు.. జాక్వెలిన్‌ వీసా రెన్యూవల్‌ కోసం సంబంధిత అధికారులను సంప్రదించేందుకు ఎన్‌ఓసీ మంజూరు చేసింది. అయితే వీసా పునరుద్ధరణపై తుది నిర్ణయం సంబంధిత అధికారులు చట్టాలు, నిబంధనలు, సర్క్యులర్లు, బైలాస్‌ ప్రకారం స్వతంత్రంగా తీసుకోవాలని స్పష్టం చేసింది.

Advertisement
Advertisement