IPL 2027 | ముంబయి ఇండియన్స్ కోచ్ పదవికి జయవర్ధనే గుడ్‌బై
IPL 2027 | ఐపీఎల్-2027కు ముందు ముంబయి ఇండియన్స్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జట్టు హెచ్‌కోచ్ పదవి నుంచి మహేల జయవర్ధనే తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ శనివారం ప్రకటించింది. దీంతో వచ్చే సీజన్లో జట్టు కోచింగ్ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారన్న దానితోపాటు రోహిత్ శర్మ కెప్టెన్సీపై కూడా ఆసక్తి నెలకొంది. అయితే, రోహిత్ పాత్రపై ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
- ఐపీఎల్-2027కు ముందు కీలక మార్పులు..
- రోహిత్ కెప్టెన్సీపై ఉత్కంఠ
IPL 2027 | ఐపీఎల్-2027కు ముందు ముంబయి ఇండియన్స్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జట్టు హెచ్‌కోచ్ పదవి నుంచి మహేల జయవర్ధనే తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ శనివారం ప్రకటించింది. దీంతో వచ్చే సీజన్లో జట్టు కోచింగ్ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారన్న దానితోపాటు రోహిత్ శర్మ కెప్టెన్సీపై కూడా ఆసక్తి నెలకొంది. అయితే, రోహిత్ పాత్రపై ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. జయవర్ధనే 2017–2022 మధ్య, తిరిగి 2024–2026 వరకు ముంబయి ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించాడు. అతని మార్గదర్శకత్వంలో జట్టు 2017, 2019, 2020లో ఐపీఎల్ టైటిల్స్ సాధించింది. జట్టు సంస్కృతి, ఆటగాళ్ల మధ్య సమన్వయం, క్రమశిక్షణ పెంపొందించడంలో జయవర్ధనే కీలక పాత్ర పోషించాడని ఫ్రాంచైజీ పేర్కొంది.
రోహిత్‌కు మళ్లీ పగ్గాలా?
ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్‌కు ఐదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మ కెప్టెన్సీ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. 2013, 2015, 2017, 2019, 2020లో అతడి సారథ్యంలో ముంబయి ఛాంపియన్‌గా నిలిచింది. అయితే, 2024 సీజన్‌కు ముందు రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. హార్దిక్ నాయకత్వంలో 2024లో జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పరిమితమైంది. 2025లో ప్లేఆఫ్స్‌కు చేరి పుంజుకుంది. వచ్చే సీజన్‌కు రోహిత్‌కు మళ్లీ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారంటూ ప్రచారం జరుగుతున్నప్పటికీ, దీనిపై స్పష్టత లేదు. జయవర్ధనే నిష్క్రమణ తర్వాత కోచింగ్ వ్యవస్థను ఖరారు చేయడంతోపాటు జట్టు నాయకత్వంపై ముంబయి యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
జయవర్ధనేకు నీతా అంబానీ ధన్యవాదాలు
ముంబయి ఇండియన్స్‌తో జయవర్ధనేకు దశాబ్దానికి పైగా అనుబంధం ఉంది. అతడి సేవలను జట్టు యజమాని నీతా అంబానీ ప్రశంసించారు. ప్రశాంతమైన నాయకత్వం, నిజాయితీ, క్రికెట్‌పై మక్కువతో జట్టుకు ఎంతో విలువైన సేవలందించాడని పేర్కొన్నారు. ముంబయి ఇండియన్స్ కుటుంబంలో జయవర్ధనేకు ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుందని తెలిపారు. తన ప్రయాణంలో ముంబడి ఇండియన్స్ ప్రత్యేకమైన భాగమని జయవర్ధనే పేర్కొన్నాడు. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, అభిమానులు, యాజమాన్యం అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపాడు. 2022లో ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ గ్రూప్ గ్లోబల్ హెడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్‌గా బాధ్యతలు చేపట్టిన జయవర్ధనే.. వివిధ దేశాల్లోని జట్ల అభివృద్ధి, ఉమ్మడి క్రికెట్ వ్యూహాల రూపకల్పనలోనూ కీలక పాత్ర పోషించాడు. తాజాగా నిష్క్రమణతో ఐపీఎల్-2027కు ముందు ముంబయి ఇండియన్స్ ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
𝗠𝘂𝗺𝗯𝗮𝗶 𝗜𝗻𝗱𝗶𝗮𝗻𝘀 𝗕𝗶𝗱 𝗮 𝗛𝗲𝗮𝗿𝘁𝗳𝗲𝗹𝘁 𝗙𝗮𝗿𝗲𝘄𝗲𝗹𝗹 𝘁𝗼 𝗠𝗮𝗵𝗲𝗹𝗮 𝗝𝗮𝘆𝗮𝘄𝗮𝗿𝗱𝗲𝗻𝗲
Mahela has been much more than a Head Coach to Mumbai Indians. Under his leadership as Head Coach, Mumbai Indians won 3 IPL titles.
Read more 👉 https://t.co/GvYuetCKW5
— Mumbai Indians (@mipaltan) October 17, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●IIT placements 2026 | ఐఐటీల్లో ఏఐ జాబ్స్ జోరు.. ఆ నైపుణ్యం ఉంటేనే ఆఫర్!
- ●Paradise OTT | ఓటీటీలోకి నాని ప్యారడైజ్ - ఎక్స్ట్రా సీన్లతో నాలుగు భాషల్లో రిలీజ్
- ●Ponnam Prabhakar | ప్రయాణికుల రద్దీని బట్టి అదనపు బస్సులు
- ●MLA Anirudh Reddy | కోమటిరెడ్డి కోసం ప్రాణాలిస్తా.. నీళ్లను తరలిస్తే ఆయనతోనే యుద్ధం చేస్తా
- ●Govind Mohan | దేశంలో స్వదేశీ ఉగ్రవాదం దాదాపు అంతమైపోయింది : హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్
- ●RS Praveen Kumar | ఖేలో ఇండియా గేమ్స్.. గిరిజన బిడ్డలకు అవమానమే

IIT placements 2026 | ఐఐటీల్లో ఏఐ జాబ్స్ జోరు.. ఆ నైపుణ్యం ఉంటేనే ఆఫర్!

Paradise OTT | ఓటీటీలోకి నాని ప్యారడైజ్ - ఎక్స్ట్రా సీన్లతో నాలుగు భాషల్లో రిలీజ్

Ponnam Prabhakar | ప్రయాణికుల రద్దీని బట్టి అదనపు బస్సులు

MLA Anirudh Reddy | కోమటిరెడ్డి కోసం ప్రాణాలిస్తా.. నీళ్లను తరలిస్తే ఆయనతోనే యుద్ధం చేస్తా






