త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | ప్ర‌యాణికుల ర‌ద్దీని బ‌ట్టి అద‌న‌పు బ‌స్సులు

S

Telangana | Published On Oct 17, 2026, 3.59 pm IST

Ponnam Prabhakar | ప్ర‌యాణికుల ర‌ద్దీని బ‌ట్టి అద‌న‌పు బ‌స్సులు
Advertisement

రాష్ట్ర వ్యాప్తంగా 7 వేల ప్ర‌త్యేక బ‌స్సులు
తిరుగు ప్ర‌యాణానికి కూడా అద‌న‌పు బ‌స్సులు
ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ వెల్ల‌డి

Ponnam Prabhakar | త్రినేత్ర న్యూస్ : బ‌తుక‌మ్మ‌, ద‌స‌రా పండుగ‌ల నేప‌థ్యంలో న‌గ‌ర వాసులంతా సొంతూర్ల‌కు వెళ్తున్న నేప‌థ్యంలో ప్ర‌యాణికుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆర్టీసీ అధికారుల‌ను మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ఆదేశించారు. ప్ర‌యాణికుల ర‌ద్దీకి అనుగుణంగా ఆయా రూట్ల‌లో అద‌న‌పు బ‌స్సుల‌ను అందుబాటులో ఉంచుతామ‌న్నారు.

పండుగల నేపథ్యంలో ఆర్టీసీ చేపట్టిన ప్రత్యేక బస్సుల నిర్వహణ, ప్రయాణికుల రద్దీ నియంత్రణ, ఇతర ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నాను. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఈడీలు, రీజినల్ మేనేజర్లు, ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడి క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న చర్యలను సమీక్షించిన‌ట్లు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తెలిపారు.

దసరా పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా 7 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నాం. ఈ నెల 10వ తేదీ నుంచి ప్రత్యేక బస్సుల నిర్వహణ చేపట్టిన‌ట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే బస్‌స్టేషన్లలో అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి, బస్సుల లభ్యత, రాకపోకల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించిన‌ట్లు చెప్పారు.

దసరా పండుగ ముగిసిన అనంతరం ప్రయాణికులు ఒకేసారి తిరుగు ప్రయాణం చేసే అవకాశం ఉన్నందున, రద్దీని ముందుగానే అంచనా వేసి ప్రత్యేక ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించిన‌ట్లు తెలిపారు. తిరుగు ప్రయాణంలో ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం వేచి ఉండే పరిస్థితులు రాకుండా అవసరమైన మార్గాల్లో అదనపు బస్సులను సిద్ధంగా ఉంచాలని సూచించాను. ఆర్టీసీ ఎండీ నుంచి క్షేత్రస్థాయి అధికారుల వరకు అందరూ అప్రమత్తంగా ఉండి, ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాలని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement