త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sridhar Babu | సీఎం చేతుల మీదుగా త్వ‌ర‌లో కేయూ హ‌బ్‌: మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు

Sridhar Babu | వ‌రంగ‌ల్ న‌గ‌రంలో సీఎం చేతుల మీదుగా త్వ‌ర‌లో కేయూ హ‌బ్ ఏర్పాటు చేస్తామ‌ని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు అన్నారు. నిరుద్యోగుల కోసం ఐటీ టవర్స్ ప్రారంభిస్తామన్నారు.

S

Telangana | Published On Oct 17, 2026, 4.29 pm IST

Sridhar Babu | సీఎం చేతుల మీదుగా త్వ‌ర‌లో కేయూ హ‌బ్‌: మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు
Advertisement

Sridhar Babu | త్రినేత్ర న్యూస్: వ‌రంగ‌ల్ న‌గ‌రంలో సీఎం చేతుల మీదుగా త్వ‌ర‌లో కేయూ హ‌బ్ (KU Hub) ఏర్పాటు చేస్తామ‌ని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు అన్నారు. నిరుద్యోగుల కోసం ఐటీ టవర్స్ ప్రారంభిస్తామన్నారు. భద్రకాళి ఆలయం మాడవీధుల నిర్మాణానికి రూ.40 కోట్లు కేటాయించిన‌ట్లు తెలిపారు. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రానికి ధీటుగా వ‌రంగ‌ల్‌ను అభివృద్ధి చేస్తామ‌న్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. అనంత‌రం మంత్రి మాట్లాడారు. ఎల్‌నినో నుంచి రాష్ట్రాన్ని రక్షించాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా ముందస్తు చర్యలు తీసుకుంటుంది. వరంగల్, హనుమకొండ నగరాల్లో భూగర్భ జలాలను పెంపొందించేందుకు ధర్మసాగర్‌ చెరువు నుంచి భద్రకాళి చెరువులోకి గోదావరి జలాలను పంపింగ్ చేస్తున్నాం. దాతల సహకారంతో భద్ర‌కాళీ ఆల‌యంలో కొత్త రథం తయారు చేయించడం అభినందనీయం అని మంత్రి పేర్కొన్నారు. అంత‌కుముందు మంత్రి శ్రీధర్‌బాబుకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

Advertisement
Advertisement