Defamation Case | రాహుల్ కోర్టుకు హాజరుకావాల్సిందే..!
Defamation Case | కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah)పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై దాఖలైన పరువు నష్టం కేసు (Defamation Case)లో విచారణ ముగిసింది. ఇరుపక్షాల వాదనలు విన్న ప్రత్యేక మేజిస్ట్రేట్ శుభం వర్మ.. ఈ కేసులో తీర్పును అక్టోబర్ 26న వెలువరించనున్నట్లు ప్రకటించారు. తీర్పు రోజున రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది.
- అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యల కేసు
- పరువు నష్టం కేసులో విచారణ పూర్తి
- ఈ నెల 26న తీర్పు వెలువరించనున్న కోర్టు
Defamation Case | కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah)పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై దాఖలైన పరువు నష్టం కేసు (Defamation Case)లో విచారణ ముగిసింది. ఇరుపక్షాల వాదనలు విన్న ప్రత్యేక మేజిస్ట్రేట్ శుభం వర్మ.. ఈ కేసులో తీర్పును అక్టోబర్ 26న వెలువరించనున్నట్లు ప్రకటించారు. తీర్పు రోజున రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది.
ఇరువైపుల వాదనలు పూర్తయ్యాయని రాహుల్ గాంధీ తరఫు న్యాయవాది కాశీ శుక్లా తెలిపారు. తీర్పు వెలువరించే రోజు రాహుల్ కోర్టుకు హాజరవుతారని వెల్లడించారు. మరోవైపు ఫిర్యాదుదారు, బీజేపీ నేత విజయ్ మిశ్రా తరఫు న్యాయవాది సంతోష్ పాండే మాట్లాడుతూ.. రాహుల్ తరఫు న్యాయవాదులు రాతపూర్వక వాదనలు సమర్పించగా.. తాను కౌంటర్ వాదనలు దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. ఘటన జరిగిన రోజు చేసిన ప్రసంగాన్ని రాహుల్ తరఫు వారు తమ రాతపూర్వక వాదనల్లో అంగీకరించారని తెలిపారు.
తీర్పు రోజున రాహుల్ గాంధీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 437-ఏ నిబంధనను కూడా పాటించాల్సి ఉంటుందని న్యాయవాది సంతోష్ పాండే వెల్లడించారు. ఈ నిబంధన ప్రకారం.. తీర్పు అనంతరం అప్పీల్ దాఖలైతే ఉన్నత న్యాయస్థానంలో హాజరవుతామనే హామీతో వ్యక్తి బెయిల్ బాండ్, పూచీకత్తు సమర్పించాల్సి ఉంటుంది. ఈ బాండ్ ఆరు నెలలపాటు అమలులో ఉంటుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

ICC Women’s ODI Rankings | స్మృతి మంధాన టాప్ ప్లేస్ పదిలం..! ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం..
అక్టోబర్ 13, 2026

Pushkar Singh Dhami | చొరబాటుదారులకు మద్దతిచ్చే మీరు..శివుడితో పోల్చుకుంటారా?
అక్టోబర్ 13, 2026

Richa Parashar | సుప్రీం వద్ద కవరేజ్‌లో చేయి పట్టి లాగి నన్ను రాహుల్ గాంధీ తోసేశారు : గర్భిణి జర్నలిస్ట్ ఆరోపణలతో దుమారం
అక్టోబర్ 13, 2026
తాజావార్తలు
- ●ICC Women's ODI Rankings | స్మృతి మంధాన టాప్ ప్లేస్ పదిలం..! ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం..
- ●Maheshkumar Goud | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. కాంగ్రెస్ ఇంఛార్జ్‌ల నియామకం
- ●AIADMK MLAs Resignation | ఆ ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామాల ఆమోదం సరైనదే.. స్పీకర్ నిర్ణయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
- ●NPCI | దీపావళి తర్వాతే యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు
- ●Ranabaali Censor Review | రణబాలి సెన్సార్ రివ్యూ - జీరో కట్స్ - రఫ్పాడించిన విజయ్ - యాక్షన్ ఫీస్ట్
- ●Telangana Municipalities | తెలంగాణ మున్సిపాలిటీలకు భారీ ఊరట..!

ICC Women's ODI Rankings | స్మృతి మంధాన టాప్ ప్లేస్ పదిలం..! ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం..

Maheshkumar Goud | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. కాంగ్రెస్ ఇంఛార్జ్‌ల నియామకం

AIADMK MLAs Resignation | ఆ ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామాల ఆమోదం సరైనదే.. స్పీకర్ నిర్ణయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

NPCI | దీపావళి తర్వాతే యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు



