త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ISRO Apprentice | సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లో 400 అప్రెంటిస్‌లు

ISRO Apprentice | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని శ్రీహ‌రికోట‌లో ఉన్న స‌తీశ్ ధావ‌న్ స్పేస్ సెంట‌ర్ (SDSC SHAR)లో వివిధ విభాగాల్లో అప్రెంటిస్ (Apprentice) పోస్టుల భర్తీకి భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ (ISRO) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. మొత్తం 400 ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ది.

G

National | Published On Nov 14, 2026, 5.05 pm IST

ISRO Apprentice | సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లో 400 అప్రెంటిస్‌లు
Advertisement

ISRO Apprentice | త్రినేత్ర న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని శ్రీహ‌రికోట‌లో ఉన్న స‌తీశ్ ధావ‌న్ స్పేస్ సెంట‌ర్ (SDSC SHAR)లో వివిధ విభాగాల్లో అప్రెంటిస్ (Apprentice) పోస్టుల భర్తీకి భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ (ISRO) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. మొత్తం 400 ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ది. ఆస‌క్తి క‌లిగిన‌వారు నవంబర్‌ 26 వరకు అధికారిక వెబ్‌సైట్‌లో ద‌రఖాస్తు (ISRO Apprentice) చేసుకోవ‌చ్చు. మెకానికల్‌, ఏరోస్పేస్‌, ప్రొడక్షన్‌, ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌, కన్‌స్ట్ర‌క్షన్‌ ఇంజినీరింగ్‌ టెక్నాలజీ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఎలాంటి రాత‌ప‌రీక్ష లేకుండా, మెరిట్ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఏడాదిపాటు శిక్ష‌ణ అందిస్తారు. ఎంపికైన‌వారికి ప్ర‌తినెల రూ.9600 నుంచి రూ.12,300 వ‌ర‌కు స్టెయిఫండ్ చెల్లిస్తారు.

మొత్తం ఖాళీలు: 400

ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌- 50
నాన్‌ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌- 60
టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ (డిప్లొమా)- 35
డిప్లొమా (డీసీసీపీ)- 60
ట్రేడ్‌ అప్రెంటిస్‌- 180
ఒకేషనల్‌ అప్రెంటిస్‌- 15

అర్హత: సంబంధిత విభాగాల్లో డిప్లొమా, బీఎస్సీ, బీకాం, బీఏ, బీఈ లేదా బీటెక్‌, ఒకేష‌న‌ల్ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా కేటగిరీల వారీగా మెరిట్‌ జాబితా రూపొందిస్తారు. సంబంధిత విభాగం లేదా ట్రేడ్‌ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసి, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. ఇందులో అర్హత సాధించినవారిని ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
అప్లికేష‌న్ ఫీజు: ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివ‌రితేదీ: నవంబర్‌ 26
వెబ్‌సైట్‌: https://apps.shar.gov.in/sdscshar/index.jsp

Advertisement
Advertisement