త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Withdraw Case | కేసు ఉప‌సంహ‌రించుకోనందుకు.. కుటుంబంపై దాడి

Withdraw Case | గ‌త 13 ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసును ఉపసంహ‌రించుకునేందుకు (Withdraw Case) నిరాక‌రించ‌డంతో కుటుంబంపై దాడికి పాల్ప‌డ్డారు. ఇంటిపై రాళ్లు రువ్వ‌డంతోపాటు కుటుంబ స‌భ్యుల ఫోన్లు ఎత్తుకెళ్లారు.

G

National | Published On Nov 13, 2026, 10.48 am IST

Withdraw Case | కేసు ఉప‌సంహ‌రించుకోనందుకు.. కుటుంబంపై దాడి
Advertisement

Withdraw Case | త్రినేత్ర న్యూస్‌: గ‌త 13 ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసును ఉపసంహ‌రించుకునేందుకు (Withdraw Case) నిరాక‌రించ‌డంతో కుటుంబంపై దాడికి పాల్ప‌డ్డారు. ఇంటిపై రాళ్లు రువ్వ‌డంతోపాటు కుటుంబ స‌భ్యుల ఫోన్లు ఎత్తుకెళ్లారు. గ‌త నెల 30న‌ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఝాన్సీలో (Jhansi ) జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

బాధితురాలు సోమ్‌ల‌త కుటుంబం ఝాన్సీలో నివాసం ఉంటున్న‌ది. 2013 నుంచి ఓ విష‌య‌మై (కేసుకు సంబంధించిన వివరాలు తెలియ‌రాలేదు) కేసు న‌డుస్తున్న‌ది. ఆ కేసును (Pending Case) ఉప‌సంహించుకోవాల‌ని ప్ర‌త్య‌ర్థులు బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నారు. రాజీ కోసం ప‌దేప‌దే ఒత్తిడి తెస్తుండ‌టంతో నిరంత‌రం వేధింపులు, వివాదాలు త‌లెత్తుకున్నారు. అయిన‌ప్ప‌టికీ కేసును ఉప‌సంహ‌రించుకునేందుకు వారు నిరాక‌రించ‌డంతో (Refused) అక్టోబ‌ర్ 30న నిందితులు సోమ్‌ల‌త కుటుంబంపై దాడికి పాల్ప‌డ్డారు. ఇంటిపై రాళ్లు రువ్వ‌డంతోపాటు, రెండు మొబైల్ ఫోన్లు లాక్కున్నారు. ఇదంతా ఇంటికి అమ‌ర్చిన సీసీ కెమెరాల్లో న‌మోదైంది.

పోలీసుల స‌మ‌క్షంలోనే..

అయితే నిందితులు దాడికి పాల్ప‌డిన‌ప్ప‌డు పోలీసులు కూడా అక్క‌డే ఉన్నార‌ని, వారి స‌మ‌క్షంలోనే త‌మ‌పై బెదిరింపుల‌కు పాల్ప‌డిన‌ప్ప‌ట‌కీ వారు ప‌ట్టించుకోల‌ద‌ని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై ఫిర్యాదు చేసిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేద‌ని చెప్పారు. దీంతో ఈ విష‌యంలో జోక్యం చేసుకోవాలంటూ సోమ్‌ల‌తా త‌న కుటుంబంతో క‌లిసి ఈ నెల 12న జిల్లా సీనియ‌ర్ సూప‌రింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP)కి ఫిర్యాదు చేశారు. త‌మ ఫోన్లు తిరిగి ఇప్పించాల‌ని, నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, త‌మ కుటుంబానికి ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరారు.

Advertisement
Advertisement