త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dinesh Chowdary vs Balmoor Venkat | అప్పుడు నువ్వు కేటీఆర్ కాళ్లు మొక్కింది నిజం కాదా?

కేటీఆర్‌ను కలిసి పార్టీలోకి చేర్చుకోమని ప్రాధేయపడ్డావా లేదా అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్‌కు బీఆర్ఎస్ నేత దినేశ్ చౌదరి సవాల్ విసిరారు.

J

Telangana | Published On Sep 16, 2026, 1.19 pm IST

Dinesh Chowdary vs Balmoor Venkat | అప్పుడు నువ్వు కేటీఆర్ కాళ్లు మొక్కింది నిజం కాదా?

సంక్షిప్త సారాంశం

కేటీఆర్‌పై, దళితులపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత దినేశ్ చౌదరి తీవ్రంగా మండిపడ్డారు. గతంలో కేటీఆర్‌ను కలిసి బీఆర్ఎస్‌లో చేర్చుకోవాలని ప్రాధేయపడ్డారంటూ ఆయనపై సంచలన ఆరోపణలు గుప్పించారు. ధైర్యముంటే తాను ప్రాధేయపడలేదని తల్లిదండ్రుల మీద ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. దళితుల ముసుగులో బెదిరింపులకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Advertisement
  • బల్మూర్ వెంకట్‌కు బీఆర్ఎస్ నేత దినేశ్ చౌదరి సవాల్

Dinesh Chowdary vs Balmoor Venkat | త్రినేత్ర.న్యూస్ : కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ రావు ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. దళితులను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై దాడులు చేయిస్తామంటూ ఆయన చేసిన కామెంట్స్‌పై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ నేత దినేశ్ చౌదరి తీవ్రస్థాయిలో స్పందించి.. బల్మూర్ వెంకట్‌కు గట్టి సవాల్ విసిరారు.

"కాళ్లు మొక్కి పార్టీలోకి చేర్చుకోమన్నావు కదా!"

బల్మూర్ వెంకట్ తీరును తీవ్రంగా తప్పుబట్టిన దినేశ్ చౌదరి..  గతంలో జరిగిన పరిణామాలను గుర్తుచేశారు. "కేటీఆర్‌ని కలిసి కాళ్లు మొక్కి నన్ను మీ పార్టీలో చేర్చుకోమని ప్రాధేయపడ్డావా లేదా బల్మూర్ వెంకట్?" అంటూ నిలదీశారు. నీకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే ఆ రోజు కేటీఆర్‌ను తాను ప్రాధేయపడలేదని తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్పాలని సవాల్ చేశారు. అప్పట్లో కేటీఆర్ చుట్టూ తిరిగిన వ్యక్తి, ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు.

దాడులు చేయడం మాకు చేతకాదా?

అంతకుముందు బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ.. తమపై దాడులు జరుగుతున్నాయని, త్వరలోనే దళితులతో కేటీఆర్ మీద దాడి చేయిస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన దినేశ్ చౌదరి.. దాడి చేయడం ఒక్క కాంగ్రెస్‌వారికే చేతకాదని హెచ్చరించారు. దళితుల పట్ల కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని, బెదిరింపు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.

Advertisement
Advertisement