త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dusha Salian Murdered Case | దిశా శాలియ‌న్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్‌.. ఎఫ్ఐఆర్‌లో మాజీ సీఎం కొడుకు, న‌టుల పేర్లు

Dusha Salian Murdered Case | బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా శాలియన్ (Disha Salian) మృతి కేసులో సంచ‌లన విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి.

S

National | Published On Sep 14, 2026, 6.14 pm IST

Dusha Salian Murdered Case | దిశా శాలియ‌న్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్‌.. ఎఫ్ఐఆర్‌లో మాజీ సీఎం కొడుకు, న‌టుల పేర్లు
Advertisement

Dusha Salian Murdered Case | త్రినేత్ర‌.న్యూస్‌: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా శాలియన్ (Disha Salian) మృతి కేసులో సంచ‌లన విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. తాజాగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఎఫ్‌ఐఆర్ నమోదు చేయ‌గా అందులో మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే (Aaditya Thackeray), నటులు డినో మోరియా, రియా చక్రవర్తి (Rhea Chakraborty) పేర్లను చేర్చిన‌ట్లు అధికారులు తెలిపారు. హత్య, సామూహిక అత్యాచారం, సాక్ష్యాలను ధ్వంసం చేయడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్ల‌డించారు. బాంబే హైకోర్టు ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన రెండు వారాల తర్వాత న‌మోదైన‌ ఎఫ్‌ఐఆర్‌లో వారి పేర్లు చేర్చ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

కాగా ఈ ఘటన జరిగిన సమయంలో ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. దీంతో కేసును బయటకు పొక్క‌కుండా ఉండ‌డానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత సాక్ష్యాలను కప్పిపుచ్చడంలోనూ కీలకంగా వ్య‌వ‌హ‌రించారు. ఆయన ఆదేశాల మేరకే ప్రభుత్వ అధికారులు, పోలీసులు కేసు ఫైళ్లు, ఇతర ప్రభుత్వ రికార్డులను ధ్వంసం చేశారు. దీంతో వారందరూ విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని అధికారులు ఎఫ్‌ఐఆర్‌లో వెల్ల‌డించారు. ఇదిలా ఉండ‌గా మరోవైపు దిశ శాలియ‌న్‌ మరణానికి సంబంధించిన అన్ని ఫైళ్లు, రికార్డులను తమకు అందించాలని సీబీఐ పోలీసులకు లేఖ రాసింది.

ఇదిలా ఉండ‌గా దిశా శాలియన్ 2020, జూన్ 8న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విష‌యం తెలిసిందే. అప్పుడు పోలీసులు ఆమెది ఆత్మహత్యగా పేర్కొన్నారు. ఆమె చనిపోయిన రోజులు వ్యవధిలోనే నటుడు సుశాంత్ తన ఫ్లాట్‌లో శవమై కనిపించడంతో ఈ కేసు మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఇదే సమయంలో ముఖ్య‌మంత్రిగా ఉన్న ఉద్ధవ్ ఠాక్రే ఈ కేసును త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు య‌త్నించిన‌ట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ కేసులో తిరిగి రెండు వారాల క్రితం దిశ తండ్రి సతీష్ శాలియన్ మరోసారి బాంబే హైకోర్టు మెట్లెక్కారు. ఈ కేసులో ప్రముఖ వ్యక్తులపై ఆరోపణలున్నాయని.. వారి ప్రభావం వల్లే పోలీసులు దర్యాప్తును ముందుకు కదలనివ్వలేదని ఆరోపించారు. తమ కుమార్తె మృతి విషయంలో మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే, నటులు సూరజ్ పంచోలి, డినో మోరియా మొదలైన వారి ప్రమేయం ఉందని చెప్పుకొచ్చారు. దీంతో ఈ కేసు దర్యాప్తును న్యాయస్థానం సీబీఐకి అప్పగించగా ఎఫ్ఐఆర్‌లో ఆదిత్య ఠాక్రే, డినో మోరియా, రియా చ‌క్ర‌వ‌ర్తి పేర్ల‌ను చేర్చ‌డంతో ఈ కేసు విష‌యం తీవ్ర చర్చ‌కు దారి తీసింది.

Advertisement
Advertisement