Singapore | సెమీ కండక్టర్ల పరిశ్రమకు సింగపూర్ సిద్ధం
Singapore | తెలంగాణలో సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు సింగపూర్ సిద్ధంగా ఉందని ఆ దేశ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు తెలిపారు. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇంధన వాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ అయ్యింది.
- సీఎం రేవంత్‌రెడ్డితో వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రతినిధుల భేటీ..
- తెలంగాణలో పెట్టుబడులకు సానుకూలత
Singapore | తెలంగాణలో సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు సింగపూర్ సిద్ధంగా ఉందని ఆ దేశ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు తెలిపారు. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇంధన వాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. రాష్ట్రంలో పెట్టుబడులకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని సీఎం వారికి వివరించారు. పెట్టుబడులు, రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సహకారం అందించాలని కోరారు. దీనిపై సింగపూర్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. సమావేశంలో తెలంగాణలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సీఎం వారికి వివరించారు. ముఖ్యంగా మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలను వెల్లడించారు. మూసా, ఈసా నదుల సంగమం నుంచి గాంధీ సరోవర్ వరకు తొలిదశలో మూసీ పునరుజ్జీవన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. రివర్‌ఫ్రంట్ అభివృద్ధితోపాటు నైట్ ఎకానమీని ప్రోత్సహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు.
హైదరాబాద్‌ను పర్యాటక నగరంగానే కాకుండా నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని సీఎం చెప్పారు. హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలు, ఎంఐటీ, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్‌లో ఆఫ్‌షోర్ క్యాంపస్‌ల ఏర్పాటుకు అంగీకరించాయని తెలిపారు. ఫ్యూచర్ సిటీని నెట్‌జీరో సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సింగపూర్ ప్రతినిధులకు సీఎం వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సహకారం అందించాలని కోరారు. పెట్టుబడులకు అవసరమైన అన్ని రకాల సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డిసెంబర్‌లో ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు సింగపూర్ ప్రతినిధులను సీఎం ఆహ్వానించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, దక్షిణాసియా సీనియర్ డైరెక్టర్ డాక్టర్ ఫ్రాన్సిస్ చోంగ్, కాన్సుల్ జనరల్ విలియం చిక్ తదితర సింగపూర్ ప్రతినిధులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

Special Trains | వినాయక చవితి రద్దీ.. ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
సెప్టెంబర్ 16, 2026

Tummala Nageswara Rao | ఆయిల్‌పామ్‌కు సంబంధించి మార్కెటింగ్, ఎగుమతుల సమస్య లేదు: మంత్రి తుమ్మల
సెప్టెంబర్ 16, 2026

Telangana Congress | ఈ నెల 18న తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇంచార్జి..!
సెప్టెంబర్ 16, 2026
తాజావార్తలు
- ●Pak Ship Collides With Indian Navy Unit | అంతర్జాతీయ జలాల్లో అనూహ్య పరిణామం.. భారత నౌకను ఢీ కొట్టిన పాక్ నౌక
- ●Special Trains | వినాయక చవితి రద్దీ.. ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
- ●Dinesh Chowdary vs Balmoor Venkat | అప్పుడు నువ్వు కేటీఆర్ కాళ్లు మొక్కింది నిజం కాదా?
- ●Mecca | చరిత్రలోనే తొలిసారి.. హౌతీల దాడులతో మక్కాలో హై అలర్ట్
- ●Speaker Gaddam Prasad Kumar | దౌర్జన్యంగా మైక్ లాక్కున్నారు.. సభలో స్పీకర్ ఆవేదన
- ●UPI | వినియోగదారులకు పేటీఎం గుడ్‌న్యూస్.. యూపీఐ చార్జిలు విధించబోమని ప్రకటన..

Pak Ship Collides With Indian Navy Unit | అంతర్జాతీయ జలాల్లో అనూహ్య పరిణామం.. భారత నౌకను ఢీ కొట్టిన పాక్ నౌక

Special Trains | వినాయక చవితి రద్దీ.. ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

Dinesh Chowdary vs Balmoor Venkat | అప్పుడు నువ్వు కేటీఆర్ కాళ్లు మొక్కింది నిజం కాదా?

Mecca | చరిత్రలోనే తొలిసారి.. హౌతీల దాడులతో మక్కాలో హై అలర్ట్



