UPI | వినియోగదారులకు పేటీఎం గుడ్‌న్యూస్.. యూపీఐ చార్జిలు విధించబోమని ప్రకటన..
UPI | యూపీఐ పర్సన్-టు-మర్చంట్ (పీ2ఎం) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) అమలుకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) జారీ చేసిన సర్క్యులర్ అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానుంది. సర్క్యులర్ అమల్లోకి వచ్చిన తర్వాత దాని ప్రభావం ఏ మేరకు ఉంటుందో అంచనా వేసి, అవసరమైతే మరిన్ని వివరాలను వెల్లడిస్తామని పేటీఎం తెలిపింది.
UPI | యూపీఐ పర్సన్-టు-మర్చంట్ (పీ2ఎం) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) అమలుకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) జారీ చేసిన సర్క్యులర్ అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానుంది. సర్క్యులర్ అమల్లోకి వచ్చిన తర్వాత దాని ప్రభావం ఏ మేరకు ఉంటుందో అంచనా వేసి, అవసరమైతే మరిన్ని వివరాలను వెల్లడిస్తామని పేటీఎం తెలిపింది. రూ.2వేల కంటే ఎక్కువ విలువ కలిగిన యూపీఐ పీ2ఎం లావాదేవీలపై గరిష్ఠంగా 0.4 శాతం వరకు ఎండీఆర్ ప్రవేశపెట్టడం వల్ల గతంలో ఉచితంగా ఉన్న అనేక చెల్లింపు లావాదేవీల నుంచి మర్చంట్ వ్యాపారానికి అదనపు ఆదాయం లభిస్తుందని పేటీఎం వెల్లడించింది. నియంత్రణ సంస్థకు సమర్పించిన ప్రకటనలో పేటీఎం.. గతంలో ఉచితంగా ఉన్న అనేక చెల్లింపు లావాదేవీల ద్వారా మర్చంట్ వ్యాపారం నుంచి అదనపు ఆదాయం సమకూరుతుందని పేర్కొంది.
వినియోగదారులకు ఉచితంగానే చెల్లింపులు..
అలాగే యూపీఐ చెల్లింపులపై వినియోగదారుల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయబోమని ఎన్‌పీసీఐ సర్క్యులర్ స్పష్టం చేసిందని పేటీఎం తెలిపింది. వినియోగదారులకు యూపీఐ చెల్లింపులు ఉచితంగానే కొనసాగుతాయని పేర్కొంది. పెద్ద మొత్తాల యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ప్రవేశపెట్టడం భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ దీర్ఘకాలికంగా స్థిరంగా కొనసాగేందుకు కీలకమైన చర్య అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పేర్కొంది. దేశవ్యాప్తంగా వినియోగదారులు, వ్యాపారాలకు సేవలందిస్తూ యూపీఐ మరింత విస్తరించడానికి, కొత్త ఆవిష్కరణలు కొనసాగించడానికి ఇది దోహదపడుతుందని ఆర్బీఐ ఎక్స్‌లో పెట్టిన పోస్టులో తెలిపింది. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో భాగస్వాముల మధ్య ఎండీఆర్‌ను న్యాయబద్ధంగా, సముచితంగా పంపిణీ చేయడం ద్వారా సాంకేతికత, మౌలిక సదుపాయాలు, చెల్లింపుల స్వీకరణ నెట్‌వర్క్‌లలో నిరంతర పెట్టుబడులకు మద్దతు లభిస్తుందని ఆర్బీఐ వివరించింది.
అయితే వినియోగదారులకు మాత్రం యూపీఐ లావాదేవీలన్నీ ఉచితంగానే కొనసాగుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే పీ2పీ లావాదేవీలతోపాటు వ్యక్తి నుంచి వ్యాపారికి జరిగే పీ2ఎం లావాదేవీలపై కూడా వినియోగదారుల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయరు. అలాగే రూ.2వేల లోపు విలువ కలిగిన పీ2ఎం యూపీఐ లావాదేవీలు కూడా ఉచితంగానే కొనసాగుతాయని ఆర్బీఐ వెల్లడించింది.
తాజావార్తలు
- ●Meta One | మెటా వన్.. ఇక వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌కు పెయిడ్ ప్లాన్స్..
- ●CM Revanth Reddy | అసెంబ్లీ సెక్రటరీ ఆదేశాలతోనే ప్రతిపక్ష నేతలను అడ్డుకున్నారు
- ●KTR Speech OP Jindal Global University | "స్టార్టప్ స్టేట్"గా తెలంగాణ ప్రయాణం సాగింది ఇలా
- ●Aadarsha Kutumbam | వెంకీ ‘ఆదర్శ కుటుంబం’లో వినేతా, డింపుల్..! ప్రత్యేక పాత్రల్లో ఇద్దరు భామలు..!
- ●Congress MLA Rammohan Reddy | మన గౌరవ ముఖ్యమంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అధ్యక్షా
- ●Pak Ship Collides With Indian Navy Unit | అంతర్జాతీయ జలాల్లో అనూహ్య పరిణామం.. భారత నౌకను ఢీ కొట్టిన పాక్ నౌక

Meta One | మెటా వన్.. ఇక వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌కు పెయిడ్ ప్లాన్స్..

CM Revanth Reddy | అసెంబ్లీ సెక్రటరీ ఆదేశాలతోనే ప్రతిపక్ష నేతలను అడ్డుకున్నారు

KTR Speech OP Jindal Global University | "స్టార్టప్ స్టేట్"గా తెలంగాణ ప్రయాణం సాగింది ఇలా

Aadarsha Kutumbam | వెంకీ ‘ఆదర్శ కుటుంబం’లో వినేతా, డింపుల్..! ప్రత్యేక పాత్రల్లో ఇద్దరు భామలు..!






