త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Speaker Gaddam Prasad Kumar | దౌర్జ‌న్యంగా మైక్ లాక్కున్నారు.. స‌భ‌లో స్పీక‌ర్ ఆవేద‌న‌

Speaker Gaddam Prasad Kumar | శాస‌న‌స‌భ‌లో బీజేఎల్పీ నేత ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి దౌర్జ‌న్యంగా మైక్ లాక్కుని మాట్లాడార‌ని స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

S

Telangana | Published On Sep 16, 2026, 1.13 pm IST

Speaker Gaddam Prasad Kumar | దౌర్జ‌న్యంగా మైక్ లాక్కున్నారు.. స‌భ‌లో స్పీక‌ర్ ఆవేద‌న‌
Advertisement

Speaker Gaddam Prasad Kumar | త్రినేత్ర‌.న్యూస్ : బీజేఎల్పీ నేత ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి శాస‌న‌స‌భ‌లో 22ఏ భూమూల‌పై మాట్లాడుతూ.. రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన రాఘ‌వ క‌న్‌స్ట్రక్ష‌న్‌పై ఆరోప‌ణ‌లు చేశారు. ఏలేటి వ్యాఖ్య‌ల‌పై శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల మంత్రి శ్రీధ‌ర్ బాబు క‌ల్పించుకుని.. మీరు అడ‌గ్గానే మైక్ ఇచ్చారు(స్పీక‌ర్‌ను ఉద్దేశించి). స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇస్తార‌ని అవ‌కాశం ఇస్తే.. ప‌ర్స‌న‌ల్ అటాక్ మంచిది కాదు. కంక్లూజ‌న్ చేయ‌మ‌నండి అని స్పీక‌ర్‌కు సూచించారు.

నేను మైక్ ఇవ్వ‌లేదు..

స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ క‌ల్పించుకుని.. నేను మైక్ ఇవ్వ‌లేదు.. సాంబ‌శివ‌రావుకు మైక్ ఇచ్చాను. కానీ దౌర్జ‌న్యంగా లాక్కుని మాట్లాడుతున్నారు అని వివ‌ర‌ణ ఇచ్చారు.

ఇలా చేయ‌డం క‌రెక్టేనా..?

ప‌ర్స‌న‌ల్‌గా అటాక్ చేయ‌డం లేదు. బాధ్యాయుత‌మైన ప‌ద‌విలో ఉన్న‌వారు.. ఇలా చేయ‌డం క‌రెక్టేనా అని అడుగుతున్నాను అని ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి అన్నారు.

అది స‌రికాదు.. ముగించండి..

మ‌ళ్లీ శ్రీధ‌ర్ బాబు క‌ల‌గ‌జేసుకుని.. 22ఏకు సంబంధించిన అంశంలో రెవెన్యూ మంత్రి స్ప‌ష్ట‌త ఇచ్చారు. అయిన‌ప్ప‌టికీ ప‌దేప‌దే లేని అంశాన్ని లేవ‌నెత్తుతున్నారు, అది స‌రికాదు.. ముగించండి, మా స‌భ్యులు కూడా మాట్లాడాల్సి ఉంది.. సీఎం వివ‌ర‌ణ ఇవ్వాల్సి ఉంద‌ని శ్రీధ‌ర్ బాబు అన్నారు.

ఒకే మైక్ ఇవ్వ‌కండి..

ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి ప్ర‌సంగం ముగిసిన అనంత‌రం కూనంనేని సాంబ‌శివ‌రావు మాట్లాడుతూ.. ఒకే సీటులో ఇద్ద‌రికి అవ‌కాశం క‌ల్పించ‌డం బాగుంది.. కానీ ఒకే మైక్ ఏర్పాటు చేయ‌డం బాగాలేదు. ఇక నుంచి ప్ర‌తి స‌భ్యుడికి ఒక మైక్ ఏర్పాటు చేయాల‌ని స్పీక‌ర్‌కు విజ్ఞ‌ప్తి చేయ‌గా.. స‌భ‌లో న‌వ్వులు విరిశాయి.

Advertisement
Advertisement