CJP Protest | ఢిల్లీలో ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు
CJP Protest | దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతాపార్టీ చేపట్టిన నిరసన (CJP Protest) ఉద్రిక్తతకు దారి తీసింది. ఆకాశవాణి భవన్ వద్ద నిరసనకారులు పోలీసులపై రాళ్లు విసిరారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి.
CJP Protest | ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar)కు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతాపార్టీ చేపట్టిన నిరసన (CJP Protest) ఉద్రిక్తతకు దారి తీసింది. ఆకాశవాణి భవన్ వద్ద నిరసనకారులు పోలీసులపై రాళ్లు విసిరారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నిరసనకారుల దాడిలో గాయపడ్డ సబ్-ఇన్‌స్పెక్టర్ బజరంగ్ జాదవ్ మాట్లాడుతూ.. అల్లరి మూకలను పట్టుకునే క్రమంలో తనను తోసేశారని ఆరోపించారు. ఈ క్రమంలోనే తనకు గాయాలైనట్లు చెప్పారు. ఈ దాడికి పాల్పడిన 30 మంది నిరసనకారులను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు సెంట్రల్ ఢిల్లీలో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) కార్యకర్తలు పోలీసు బారికేడ్లను కూల్చారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే బారికేడ్లను సరిచేశారు. ఈ సందర్భంగా తనపై పోలీసు సిబ్బంది దాడి చేశారంటూ ఓ నిరసనకారుడు తీవ్ర ఆరోపణలు చేశాడు. ఇదిలా ఉండగా.. నగరంలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వెలుపల ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA), వామపక్ష పార్టీల కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు. పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. కొన్ని ప్రాంతాల్లో పోలీసులను నిరసనకారులు అడ్డుకుంటున్నారు. పోలీసు వ్యాన్లను ముందుకు కదలనీకుండా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. సీఈసీ రాజీనామా చేయాల్సిందే అంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్
నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఢిల్లీ సరిహద్దులు, సెంట్రల్ ఢిల్లీ, నిరసనకారులు గుమిగూడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ప్రధాన రహదారులను బారికేడ్లతో దిగ్బంధించారు. ఆగ్నేయ ఢిల్లీలోని మోహన్ ఎస్టేట్‌లో రాకపోకలను నియంత్రించేందుకు పోలీసులు రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్‌ను (మేకుల పట్టీ) ఏర్పాటు చేశారు. పోలీసులు బారికేడ్లతో పాటు స్పైక్ స్ట్రిప్స్‌ను ఏర్పాటు చేశారు.
Also Read..
లాఠీలు కాదు.. సమాధానాలు కావాలి.. ఢిల్లీలో ఆంక్షలపై థరూర్ ఆగ్రహం
రద్దీగా మారిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
శామ్‌సంగ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. రూ.75 వేల వరకు తగ్గింపు..
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●PV Kiran | కర్నూల్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు మృతి
- ●Bhatti Vikramarka | గట్టిగ పని చేద్దాం.. సర్వోత్తమ్‌రెడ్డిని ఎమ్మెల్సీ చేద్దాం
- ●Gajwel MRO | నువ్వు ఇంకా బతికే ఉన్నావా.. పురుగుల మందు తాగలేదా..!
- ●Nani | గ్యాంగ్‌స్టర్‌గా నాని - మలయాళ బ్యూటీతో రొమాన్స్ - బ్రేక్ లేకుండా షూటింగ్
- ●RBI | ఆర్బీఐ కీలక నిర్ణయం.. బ్యాంకులకు కొత్త సీఆర్ఆర్ నిబంధన..
- ●TGSRTC | రద్దీగా మారిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు

PV Kiran | కర్నూల్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు మృతి

Bhatti Vikramarka | గట్టిగ పని చేద్దాం.. సర్వోత్తమ్‌రెడ్డిని ఎమ్మెల్సీ చేద్దాం

Gajwel MRO | నువ్వు ఇంకా బతికే ఉన్నావా.. పురుగుల మందు తాగలేదా..!

Nani | గ్యాంగ్‌స్టర్‌గా నాని - మలయాళ బ్యూటీతో రొమాన్స్ - బ్రేక్ లేకుండా షూటింగ్






