KTR | రైతుబంధు ఇయ్యకుండా రాహుల్ బంధు కడుతుండు
KTR | రైతులకు రైతుబంధు పడకపోయినా, రాహుల్ బంధు మాత్రం సమయానికి అందుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు.
- రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు.. రెన్యువల్ సీఎం
- నెల నెలా ఢిల్లీకి ఈఎంఐ కడితేనే ఆయన పదవి రెన్యువల్ అయితది
- దోపిడీకి తెలంగాణ వేదికగా మారిపోయింది
- కేసీఆర్ వస్తేనే తెలంగాణ గట్టెక్కుతది
- తెలంగాణ భవన్ సమావేశంలో కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ నిప్పులు
KTR | త్రినేత్ర న్యూస్: రైతులకు రైతుబంధు పడకపోయినా, రాహుల్ బంధు మాత్రం సమయానికి అందుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. రేవంత్‌రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని.. ఆయన రెన్యువల్ సీఎం అని ఎద్దేవా చేశారు. నెల నెలా ఢిల్లీకి ఈఎంఐ కడితేనే ఆయన పదవి రెన్యువల్ అయతదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంగళవారం హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల కష్టాలను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు.
రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ దోపిడీ వేదికగా మారిపోయిందని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.
ఇద ప్రకృతి తెచ్చిన కరువు కాదు.. రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు. కాళేశ్వరం పంపులు ఆన్ చేయకుండా రైతుల పంటలు ఎండబెడుతున్నారు. కేసీఆర్ తిరిగి వస్తేనే తెలంగాణ మళ్లీ గట్టెక్కుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థ పాలన, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. రేవంత్ రెడ్డి తన వైఫల్యాలతో ప్రజల నెత్తిన రుద్దిన కరువిది. రాష్ట్రంలో సాగునీటి కొరత, విద్యుత్ సమస్యలు, యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
నదుల్లో నీళ్లు పారుతున్నా వాటిని సాగుకు వినియోగించుకోకుండా సముద్రంలోకి వదిలేస్తున్నారని, అందుబాటులో ఉన్న నీటిని రైతులకు అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని ఎప్పుడు చేసుకుందామా అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది. గాడిదను చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుంది అని వ్యాఖ్యానించారు.
పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణకు 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి సదుపాయాలు అందించామని కేటీఆర్ గుర్తుచేశారు. రైతుబంధు, కేసీఆర్ కిట్, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలతో ప్రజలకు అండగా నిలిచామని పేర్కొన్నారు. కరోనా సంక్షోభ సమయంలోనూ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి ఆదుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అన్ని హామీలను అమలు చేస్తామని చెప్పిన నాయకులు, ఇప్పుడు వాటి అమలుపై ప్రశ్నిస్తే తప్పించుకునే ధోరణిలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
హామీలు అమలు చేయలేకపోతే ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పాలని, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేయవద్దని అన్నారు. హామీల అమలుపై ప్రశ్నిస్తే మూడు నెలల్లో పిల్లలు పుడతారా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడటం బాధ్యతారాహిత్యమని కేటీఆర్ విమర్శించారు. మూడు నెలల్లోనే అన్నీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, మూడేళ్లు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.
గోదావరి, కృష్ణా నదుల్లో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోకుండా వృథాగా సముద్రంలోకి వదిలేస్తున్నారని విమర్శించారు. జూన్ 19, 2026న కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించినప్పుడు లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోందని, పంపులు ఆన్ చేసి నీటిని ఎత్తిపోయాలని ప్రభుత్వాన్ని కోరామని గుర్తుచేశారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. కాళేశ్వరం పంపులు ఆన్ చేస్తే ప్రాజెక్టుపై ఇంతకాలం చేసిన ఆరోపణలు తప్పని తేలిపోతాయనే భయంతోనే బటన్ నొక్కడం లేదని ఆరోపించారు.
దేవుడు పంపిస్తే ఈ పూజారి అడ్డుపడుతుండు..
దేవుడు తెలంగాణ ప్రజల కోసం నీళ్లు పంపిస్తే, మధ్యలో పూజారి రేవంత్ రెడ్డి అడ్డుపడి బటన్ నొక్కకుండా అడ్డుకున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గోదావరి నుంచి 750 టీఎంసీలు, కృష్ణా నుంచి 250 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లిందని తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ నీటిని వినియోగించుకుని ఉంటే కోటి ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉండేదని అన్నారు. ఒకవైపు పంటలు కళ్ల ముందే ఎండిపోతుండటంతో రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకుని పంటలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు రైతుబంధు సకాలంలో అందడం లేదని, కరెంటు, యూరియా, సాగునీటి సమస్యలు మరింత తీవ్రంగా మారాయని పేర్కొన్నారు.
అంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో చేరిన నిర్మల్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులకు కేటీఆర్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
సంబంధిత వార్తలు

Global Summit 2026 | ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్.. 550కి పైగా దిగ్గజ సంస్థలకు ఆహ్వానం
అక్టోబర్ 27, 2026

Couples Suicide | గోడపై రాశారు.. రెండేళ్ల పాపను చంపి తనువులు చాలించారు.. అసలేం జరిగిందంటే!
అక్టోబర్ 27, 2026

Maheshkumar Goud | తెలంగాణల మళ్లా మేమే గెలుస్తం.. బీజేపీకి ఆ ఛాన్స్ లేనేలేదు
అక్టోబర్ 27, 2026
తాజావార్తలు
- ●Husharu 2 | "హుషారు 2"లో ఆర్ నారాయణమూర్తి - మంచి పాత్రలు వస్తే నటిస్తానంటూ పీపుల్స్ స్టార్ కామెంట్స్
- ●Telangana BJP | NEXT తెలంగాణ షురూ.. కార్యాచరణ మొదలు పెట్టిన బీజేపీ
- ●Global Summit 2026 | ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్.. 550కి పైగా దిగ్గజ సంస్థలకు ఆహ్వానం
- ●Couples Suicide | గోడపై రాశారు.. రెండేళ్ల పాపను చంపి తనువులు చాలించారు.. అసలేం జరిగిందంటే!
- ●Dharmapuri Arvind | నిధులు లేవంటున్న సీఎంకు భిక్షాటన సొమ్ము పంపిస్తం
- ●Vande Mataram Controversy 2026 | వందేమాతరంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు: వివాదాస్పద పిటిషన్లపై కేంద్రానికి నోటీసులు

Husharu 2 | "హుషారు 2"లో ఆర్ నారాయణమూర్తి - మంచి పాత్రలు వస్తే నటిస్తానంటూ పీపుల్స్ స్టార్ కామెంట్స్

Telangana BJP | NEXT తెలంగాణ షురూ.. కార్యాచరణ మొదలు పెట్టిన బీజేపీ

Global Summit 2026 | ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్.. 550కి పైగా దిగ్గజ సంస్థలకు ఆహ్వానం

Couples Suicide | గోడపై రాశారు.. రెండేళ్ల పాపను చంపి తనువులు చాలించారు.. అసలేం జరిగిందంటే!





