త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Truecaller Lite | ఎంట్రీ లెవ‌ల్ ఫోన్ల కోసం.. ట్రూకాల‌ర్ కొత్త యాప్‌.. 10ఎంబీ ఉన్నా చాలు..

Truecaller Lite | స్మార్ట్‌ఫోన్లలో స్టోరేజీ, ర్యామ్ తక్కువగా ఉన్న వినియోగదారుల కోసం ట్రూకాలర్ సంస్థ ట్రూకాలర్ లైట్ యాప్‌ను భారత్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం 10 ఎంబీ స్టోరేజీతో పనిచేసేలా రూపొందించిన ఈ యాప్‌లో కాలర్ గుర్తింపు, స్పామ్ కాల్స్ నిరోధం వంటి కీలక సదుపాయాలు ఉంటాయి.

S

Technology | Published On Oct 28, 2026, 12.12 pm IST

Truecaller Lite | ఎంట్రీ లెవ‌ల్ ఫోన్ల కోసం.. ట్రూకాల‌ర్ కొత్త యాప్‌.. 10ఎంబీ ఉన్నా చాలు..
Advertisement

Truecaller Lite | స్మార్ట్‌ఫోన్లలో స్టోరేజీ, ర్యామ్ తక్కువగా ఉన్న వినియోగదారుల కోసం ట్రూకాలర్ సంస్థ ట్రూకాలర్ లైట్ యాప్‌ను భారత్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం 10 ఎంబీ స్టోరేజీతో పనిచేసేలా రూపొందించిన ఈ యాప్‌లో కాలర్ గుర్తింపు, స్పామ్ కాల్స్ నిరోధం వంటి కీలక సదుపాయాలు ఉంటాయి.

భారత్‌లో పండుగల షాపింగ్ సీజన్ నేపథ్యంలో మోసపూరిత ఫోన్ కాల్స్, నకిలీ డెలివరీ సందేశాలు, తప్పుడు ప్రమోషనల్ ఆఫర్లు, కేవైసీ పేరుతో జరిగే మోసాలు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తక్కువ సామర్థ్యం ఉన్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ల వినియోగదారులకు కూడా మెరుగైన కాల్ భద్రత అందించాలనే లక్ష్యంతో ట్రూకాలర్ లైట్‌ను సంస్థ ప్రవేశపెట్టింది. సుమారు 10 ఎంబీ స్టోరేజీని మాత్రమే ఆక్రమించే ఈ యాప్‌ను, గరిష్ఠంగా 4 జీబీ ర్యామ్ ఉన్న ఫోన్లలో పనిచేసేలా రూపొందించారు. ఫొటోలు, వీడియోలు, ఇతర ఫైళ్లతో ఫోన్ స్టోరేజీ నిండిపోయినప్పటికీ కాల్స్‌ను గుర్తించడం, స్పామ్ కాల్స్‌ను అడ్డుకోవడం వంటి సేవలను వినియోగించుకునే అవకాశం ఉంటుంది.

త‌క్కువ హార్డ్‌వేర్ సామ‌ర్థ్యాలు ఉన్న ఫోన్ల కోసం..

ట్రూకాలర్ లైట్ అనేది సాధారణ ట్రూకాలర్ యాప్‌లో కొన్ని ఫీచర్లను తొలగించి రూపొందించిన వెర్షన్ మాత్రమే కాదని సంస్థ వెల్లడించింది. తక్కువ హార్డ్‌వేర్ సామర్థ్యాలు ఉన్న ఫోన్ల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన స్వతంత్ర నేటివ్ ఆండ్రాయిడ్ యాప్ ఇది. సాధారణ ట్రూకాలర్ యాప్ ఉపయోగించే డేటాబేస్, మోసాలను గుర్తించే వ్యవస్థ, గోప్యతా విధానాలనే ఇది ఉపయోగిస్తుంది. ఇన్‌కమింగ్ కాల్‌కు సమాధానం ఇచ్చే ముందే కాలర్ వివరాలను చూపించడం, వినియోగదారుల నివేదికల ఆధారంగా అనవసరమైన, మోసపూరిత కాల్స్‌ను నిరోధించడం దీని ప్రధాన సదుపాయాలు. అలాగే కాల్ హిస్టరీ, కాంటాక్ట్స్, ఫోన్ నంబర్ల శోధన కోసం ఇంటిగ్రేటెడ్ డయలర్, ఇన్‌కమింగ్‌, అవుట్‌గోయింగ్ కాల్స్ అనంతరం కాలర్ వివరాలను చూపించే సదుపాయాలు కూడా ఉన్నాయి.

సాధార‌ణ యాప్‌తో పోలిస్తే తేడా ఏమిటి..

తక్కువ మెమరీ, స్టోరేజీ, డేటా వినియోగాన్ని లక్ష్యంగా చేసుకుని రూపొందించినందున సాధారణ ట్రూకాలర్ యాప్‌లోని కొన్ని అదనపు ఫీచర్లను లైట్ వెర్షన్‌లో తొలగించారు. యాప్‌లో మెసేజింగ్, వాయిస్‌మెయిల్, ఫ్యామిలీ ప్రొటెక్షన్, కృత్రిమ మేధ ఆధారిత అసిస్టెంట్ ఇందులో ఉండవు. కాల్స్ నిర్వహణ, కాలర్ గుర్తింపు, స్పామ్ నివారణపైనే ప్రధానంగా దృష్టి సారించారు. ట్రూకాలర్ లైట్‌ను భారత్‌లోని అర్హత కలిగిన ఆండ్రాయిడ్ ఫోన్ల వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ను దశలవారీగా రాబోయే వారాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌కు మాత్రమే పరిమితమ‌ని సంస్థ తెలిపింది.

Advertisement
Advertisement