త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivasa Reddy | రాష్ట్రంలో కరువు పరిస్థితులు.. పుట్టినరోజు వేడుకలకు దూరంగా మంత్రి పొంగులేటి

Ponguleti Srinivasa Reddy | రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న నేప‌థ్యంలో పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) నిర్ణయించారు.

G

Telangana | Published On Oct 28, 2026, 11.47 am IST

Ponguleti Srinivasa Reddy | రాష్ట్రంలో కరువు పరిస్థితులు.. పుట్టినరోజు వేడుకలకు దూరంగా మంత్రి పొంగులేటి
Advertisement

Ponguleti Srinivasa Reddy | త్రినేత్ర న్యూస్: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న నేప‌థ్యంలో పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) నిర్ణయించారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈమేర‌కు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో తన అభిమానులు, శ్రేయోభిలాషులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ బొకేలు, శాలువాలు, స్వీట్స్‌తో వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవద్దని విజ్ఞప్తి చేశారు.

అలాగే తన పుట్టినరోజు సందర్భంగా ఎక్కడా ఎలాంటి ఆర్భాటాలు, వేడుకలు నిర్వహించవద్దని, అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సంయమనం పాటించాలని, తన పుట్టినరోజును నిరాడంబరంగా గడపాలని నిర్ణయించుకున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. తనపై అభిమానంతో శుభాకాంక్షలు తెలియజేయాలనుకునే వారంతా ఈ నిర్ణయాన్ని గౌరవించి సహకరించాలని కోరారు.

Advertisement
Advertisement